ETV Bharat / sukhibhava

గుడ్డుతో బోలెడు లాభాలు.. రోజుకు ఎన్ని తింటే ఆరోగ్యానికి మంచిది?

author img

By

Published : Jan 9, 2023, 7:11 AM IST

శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్లు గుడ్డులో అధికంగా ఉంటాయి. అందుకే గుడ్డును సంపూర్ణ ఆహారం అంటారు. గుడ్డు ఓ ఖనిజాల గని. ఇది శరీరానికి కావలసిన పోషకాలు, ప్రోటీన్లు, మాంసకృత్తులను అందించి.. ఆరోగ్యవంతంగా ఉండడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకే పసిపిల్లల మొదలుకొని పండు ముసలి వరకు రోజు తీసుకునే ఆహారంలో గుడ్డు తప్పనిసరిగా ఉండాలని పోషకాహార నిపుణలు అంటున్నారు.

egg health benefits
గుడ్డు కలిగే ప్రయోజనాలు

ప్రతి రోజూ గుడ్డు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

గుడ్డులో అనేక రకాల పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే దీన్ని సమతుల ఆహారం అంటారు. అందుబాటు ధరలో ఉండడం వల్ల దీన్ని రోజూ తీసుకోవడం మంచిది. రోజుకు ఒక ఉడికించిన గుడ్డు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. జీర్ణక్రియ మెరుగు పడడమే కాకుండా శరీరానికి శక్తిని కూడా అందిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మెదడును చురుగ్గా ఉంచుతుంది. గుడ్డు వల్ల కలిగే మరిన్ని ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మెదడు చురుగ్గా ఉంచడంలో గుడ్డు పాత్ర..
రోజూ అల్పాహారం తీసుకోకపోయినా పర్లేదు కానీ.. ఉదయాన్నే ఓ గుడ్డు అయినా తీసుకోవాలంటారు పోషకాహార నిపుణులు. ఎందుకంటే దానిలో శరీరానికి కావాల్సిన మాంసకృత్తులన్నీ ఉంటాయి. మెదడు చురుగ్గా పనిచేయాలన్నా, జ్ఞాపకశక్తి పెరగాలన్నా.. న్యూరో ట్రాన్స్​మిటర్​గా పనిచేసే ఎసిటైల్​ కొలిన్​ చాలా కీలకం. అది గుడ్డులో పుష్కలంగా ఉంటుంది.

కొలస్ట్రాల్​ తగ్గించే పచ్చసొన..
గుడ్డులోని పచ్చసొన తింటే లావు అయిపోతారనే ఆలోచనలు చాలా మందిలో ఉంటుంది. ఫలితంగా దాన్ని తినకుండా పడేస్తుంటారు. అయితే ఇక మీదట ఆ పని మాత్రం చేయకండి. ఎందుకంటే.. పచ్చసొనలో శరీరానికి కావాల్సిన మంచి కొలస్ట్రాల్​ ఉంటుంది. ఇది శరీరంలోని చెడు కొలస్ట్రాల్స్​ను తగ్గించి.. మంచి కొలస్ట్రాల్​ స్థాయిని పెంచుతుంది.

పచ్చిగుడ్డు తాగుతున్నారా..?
చాలా మంది పచ్చిగుడ్డును తీసుకుంటే ఎక్కువగా పోషకాలు అందుతాయి అనే భావనలో ఉండి.. దాన్ని అలానే తీసుకుంటారు. అలా చేయవద్దని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. శరీరానికి కావాల్సిన ఆల్బుమిన్​ అనే పోషకం గుడ్డులో ఉంటుంది. అది ఉడికించడం ద్వారా మాత్రమే శరీరానికి అందుతుందని నిపుణులు చెబుతున్నారు.

ప్రయోజనాలు..

  • గుడ్లు తీసుకుంటే శరీరానికి కావాల్సిన మాంసకృత్తులన్నీ అందుతాయి.
  • మెదడు చురుగ్గా పనిచేయడానికి, జ్ఞాపక శక్తి పెరగడానికి ఉపయోగపడుతుంది.
  • మెదడులోని కణాలను ఆరోగ్యంగా ఉంచుతంది..
  • గుండె ఆరోగ్యంగా ఉండడానికి సహకరిస్తుంది.
  • పిల్లలు ఎదగడంలో ఎంతగానో తోడ్పాటు అందిస్తుంది.
  • ఎముకలను దృఢంగా తయారు చేస్తుంది.
  • కాళ్ల వాపులను తగ్గించడానికి సహకరిస్తుంది.
  • బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. దీనిలో ఉండే మాంసకృత్తులతో తక్కువ తిన్నా సరే.. కడుపునిండిన భావన కలుగుతుంది.
  • గర్భిణిలు రోజూ ఓ గుడ్డును తీసుకుంటే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది
  • శరీరానికి కావాల్సిన పోషకాలను సమతుల్యం చేయడానికి సహకరిస్తుంది.
  • గుడ్డులో ఉండే క్యాల్షియం శరీరంలోని జుట్టు, చర్మం, గోర్లు లాంటివి ఆరోగ్యంగా ఉండేందుకు సహకరిస్తుంది.
  • రక్త ప్రసరణ సాఫీగా సాగేలా చేయడమే కాకుండా.. రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది.
  • గుడ్డు తింటే.. విటమిన్ C​ తప్ప మిగిలిన అన్ని విటమిన్లు శరీరానికి అందుతాయి
  • రోజుకు ఒక గుడ్డు తీసుకుంటే శరీరానికి కావాల్సిన B, E విటమిన్లు లభ్యమవుతాయి.
  • విటమిన్ D లోపం నుంచి శరీరాన్ని రక్షిస్తుంది.
  • గుడ్డులో ఉండే పచ్చసొన.. ఒత్తిడిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
  • పచ్చసొనలో ఉండే ల్యూటిన్..​ రెటీనాను శక్తిమంతం చేస్తుంది. దీంతో కంటి చూపు మెరుగుపడుతుంది.
  • రోజుకు ఒకటి లేదా రెండు గుడ్లు తినే వారి రక్తంలో కొలస్ట్రాల్ స్థాయిలో ఆరోగ్యకరమైన మార్పులు వస్తాయి.
  • శరీరానికి కావాల్సిన అమైనో ఆమ్లాలు గుడ్డులో పుష్కలంగా ఉంటాయి. శరీరానికి అధిక శ్రమ కలిగినప్పుడు తిరిగి పుంజుకోవడానికి ఇవి ఎంతగానే ఉపయోగపడతాయి.
  • వృద్ధాప్యంలో మెదడుకు వచ్చే అనేక సమస్యల నుంచి రక్షిస్తుంది.

అయితే గుడ్లను తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని అధికంగా తినకండి. ఎందుకంటే అధికంగా గుడ్లు తినడం వల్ల.. గుండె జబ్బులు వచ్చే ప్రమాదముందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అందుకే రోజుకు ఓ గుడ్డు తినడం అలవాటు చేసుకోవడం మంచిది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.