ETV Bharat / sukhibhava

మహిళలు ఈ లక్షణాలను లైట్​ తీస్కోవద్దు - క్యాన్సర్ కావొచ్చు!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 10, 2024, 11:38 AM IST

Cancer Symptoms in Women
Cancer Symptoms in Women

Cancer Symptoms in Women: క్యాన్సర్ ఒక ప్రాణాంతకమైన వ్యాధి. అయితే.. చాలా మంది దీన్ని ముదిరిన తర్వాతగానీ గుర్తించలేకపోతున్నారు. స్త్రీల విషయానికి వస్తే.. శరీరంలో కొన్ని మార్పులు సంభవిస్తుంటాయి. వాటిని నిర్లక్ష్యం చేయొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

Cancer Symptoms in Women: మారిన జీవనశైలి, ఒత్తిడి, హార్మోన్లు, ఆహారం సహా అనేక అంశాలు మహిళల శరీరంలో మార్పులకు దోహదం చేస్తాయి. అయితే.. కొన్ని మార్పులు సాధారణమైనవిగా భావించినప్పటికీ.. మరికొన్ని ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధికి సంకేతంగా ఉండవచ్చు. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ (ACS) ప్రకారం.. మహిళలను ఎక్కువగా ప్రభావితం చేసే కొన్ని క్యాన్సర్లు.. రొమ్ము, కొలొరెక్టల్, ఎండోమెట్రియల్, ఊపిరితిత్తులు, గర్భాశయ, చర్మం, అండాశయ క్యాన్సర్లు. అయితే స్త్రీ శరీరంలో జరిగే ప్రతి మార్పు క్యాన్సర్‌కు సంకేతం కానప్పటికీ.. కొన్ని విస్మరించకూడని సాధారణ సంకేతాలు ఇక్కడ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

రొమ్ములో గడ్డలు : మహిళల్లో రొమ్ము క్యాన్సర్​ ఎక్కువగా వస్తుంది. దీనితో చనిపోయే వారి సంఖ్య కూడా ఎక్కువే. రొమ్ములో గడ్డల్లాంటివి తగలడం, రొమ్ముల పరిమాణంలో తేడా, ఎర్రగా, కందినట్లుగా ఉండే చనుమొనలు, చనుమొనల నుంచి స్రావాలు వెలువడడం, రొమ్ములు సొట్టలు పడినట్లు ఉండడం, చంకలో వాపు.. ఇలాంటి లక్షణాలు రొమ్ము క్యాన్సర్‌లో కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే.. మీరు డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.

రొమ్ము చర్మం రంగులో మార్పులు: ఇన్ఫ్లమేటరీ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది అరుదైన రొమ్ము క్యాన్సర్. ACS ప్రకారం.. ఇది రొమ్ములో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ.. చర్మం రంగును ఊదా లేదా ఎరుపుగా మారుస్తుంది. కాబట్టి మీ బ్రెస్ట్​ దగ్గర కలర్​ ఛేంజ్​ అయితే అప్రమత్తమవ్వాల్సిందే.

మలంలో రక్తం: కొలెరెక్టరల్ క్యాన్సర్​కు మరో సంకేతం రెక్టల్ బ్లీడింగ్. స్టూల్లో రక్తం పడటం గమనిస్తే వెంటనే డాక్టర్​ను సంప్రదించాలి. ఇది కూడా ఒక ముఖ్యమైన క్యాన్సర్ సంకేతం. ఇది రక్తహీనతకు దారితీస్తుంది. అలాగే ఎర్ర రక్త కణాల సంఖ్య తక్కువవుతుంది. ఇది తరచుగా బలహీనత, అలసటకు కారణమవుతుంది.

Alert : బ్రేక్​ఫాస్ట్​లో ఈ ఆహారాలు - క్యాన్సర్​ వచ్చే అవకాశం!

నెలసరి కాకుండా.. బ్లీడింగ్‌: పీరియడ్స్ సమయంలో కాకుండా, తర్వాత కూడా బ్లీడింగ్‌ అవుతున్నట్లయితే.. అది హార్మోన్ల అసమతుల్యతకు సంకేతం మాత్రమే కాదు, కొన్ని ప్రమాదకర వ్యాధులకు సంకేతం. ముఖ్యంగా మెనోపాజ్ సమయంలో రక్తస్రావం అవుతుంటే. ఇది కాకుండా, కోయిటల్ బ్లీడింగ్, పెరిమెనోపౌసల్ బ్లీడింగ్, ఇంటర్‌మెన్‌స్ట్రువల్ బ్లీడింగ్‌ను తేలికగా తీసుకోకూడదు. ఎందుకంటే ఇది గర్భాశయ క్యాన్సర్‌కు సంకేతం. ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఉన్న మహిళల్లో దాదాపు 90% మందికి నెలసరి కాకుండా బ్లీడింగ్‌ అవుతుంది. అండాశయ క్యాన్సర్‌లోనూ ఇదే లక్షణం కనిపిస్తుంది. ఈ లక్షణాలు గుర్తిస్తే.. మీరు వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.

పొత్తికడుపు, వెన్ను లేదా కటి నొప్పి: అండాశయ క్యాన్సర్ సంకేతాలలో కడుపు ఉబ్బరం, దిగువ వెన్నునొప్పి, ఆకలి తగ్గడం లేదా త్వరగా నిండిన అనుభూతి వంటి మార్పులు ఉంటాయి. పెల్విక్ నొప్పి లేదా ఒత్తిడి అనేది అండాశయ, గర్భాశయ (ఎండోమెట్రియల్‌ని కలిగి ఉంటుంది) క్యాన్సర్‌ల రెండింటికీ సాధారణ లక్షణం. మలబద్ధకం, ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయవలసి రావడం అండాశయ, యోని క్యాన్సర్ రెండింటికి సంబంధించిన లక్షణాలు.

లైంగిక సంపర్కం సమయంలో నొప్పి: అమెరికన్ సొసైటీ ఆఫ్ క్లినికల్ ఆంకాలజీ (ASCO) ప్రకారం, అసాధారణ యోని రక్తస్రావంతో పాటు.. లైంగికం సంపర్కం సమయంలో నొప్పి యోని క్యాన్సర్ మరొక లక్షణం. మూత్రవిసర్జన చేసేటప్పుడు ఇబ్బంది లేదా నొప్పి, కటి నొప్పి, వెన్ను లేదా కాళ్ల నొప్పి, కాళ్లలో వాపు, అసాధారణ పేగు పనితీరు.. ఇతర లక్షణాలుగా చెప్పుకోవచ్చు.

మైక్రో​ ఓవెన్లతో మనుషులకు క్యాన్సర్​ వస్తుందా? - WHO ఏమంటోంది?

రంగు మారడం..: ప్రైవేట్‌ భాగాల్లో పుండ్లు, దద్దుర్లు, వల్వార్‌ క్యాన్సర్‌కు సంకేతం. ఇటువంటి మార్పులను నిర్లక్ష్యం చేయకూడదు. ఈ లక్షణాలు చర్మ క్యాన్సర్‌కు సంకేతం కూడా కావచ్చు. పుట్టు మచ్చలన్నీ ఒకే పరిమాణంలో, ఆకృతిలో లేకపోవడం, పుట్టు మచ్చ రంగు.. వంటి లక్షణాలు గమనిస్తే.. చర్మ క్యాన్సర్‌ కావచ్చు. చర్మంపై పుట్టు మచ్చలు ఒకవేళ అసాధారణ రీతిలో పెరుగుతూ ఉన్నట్లయితే పరీక్షలు చేయించుకోవడం మంచిది.

నిరంతర దగ్గు: ఊపిరితిత్తుల క్యాన్సర్‌లో సాధారణంగా తీవ్రమైన దగ్గు, కారణం లేకుండా శ్వాస ఆడకపోవడం, రక్తంతో కఫం లేదా శ్లేష్మం, ఛాతీ నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొంతమంది దగ్గు వాతావరణ మార్పుల కారణంగా వస్తుందని తప్పుగా అర్థం చేసుకుంటారు. దగ్గు ఎక్కువగా వచ్చినప్పడు డాక్టర్‌ను కలవడం మంచిది.

నాడీ వ్యవస్థ మార్పులు: ఊపిరితిత్తుల క్యాన్సర్ మెదడుకు వ్యాపిస్తే.. అది తలనొప్పి, మైకము, మూర్ఛ, తిమ్మిరి, చేయి లేదా కాలు వాపునకు కారణమవుతుంది. కొన్ని ఊపిరితిత్తుల క్యాన్సర్లు కళ్ల నరాలపై ప్రభావం చూపుతాయి. దీని వలన కనురెప్పలు పడిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇతర నాడీ వ్యవస్థ సమస్యలలో కండరాల బలహీనత, మాట్లాడటం, మింగడం లేదా కూర్చున్న స్థానం నుంచి లేవడం కష్టంగా ఉంటుంది.

రొమ్ము క్యాన్సర్ బారిన పడొద్దంటే - ఇవి తినాల్సిందే!

మింగడంలో ఇబ్బంది: ఆహారాన్ని మింగడం లేదా నీటిని తాగడం వంటి వాటిల్లో ఇబ్బందులు ఎదుర్కొంటుంటే, అవి అన్నవాహిక క్యాన్సర్‌కు, కడుపు క్యాన్సర్‌కు లేదా గొంతు క్యాన్సర్‌కు సంకేతంగా చూడొచ్చు. నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ప్రకారం, తల, మెడ క్యాన్సర్లలో నోరు, దవడ, ఫారింక్స్ (గొంతు), స్వరపేటిక (వాయిస్ బాక్స్), సైనస్‌లు, నాసికా కుహరం, లాలాజల గ్రంథులు ఉన్నాయి. ఈ క్యాన్సర్‌ల సంకేతాలలో నిరంతర గొంతు నొప్పి కూడా ఉంటుంది.

మూత్రంలో రక్తం: మూత్రంలో రక్తం మూత్రాశయ క్యాన్సర్‌కు సంకేతం. మాయో క్లినిక్ ప్రకారం, మూత్రం ఎరుపు లేదా కోలా రంగులో కనిపిస్తుంది. అయితే కొన్నిసార్లు మూత్రం సాధారణ రంగులో కనిపిస్తుంది. దీనిని టెస్ట్​ చేయడం ద్వారా కనుక్కోవచ్చు. మూత్రాశయ క్యాన్సర్ఇతర లక్షణాలు వెన్నునొప్పి, తరచుగా మూత్రవిసర్జన చేయడం.

నిరంతర అలసట: క్యాన్సర్ లక్షణాల్లో అలసట ఒకటి. ఇది విపరీతంగా ఉంటుంది. విశ్రాంతి తీసుకున్నా కూడా అలసట నుంచి బయటపడలేరు. క్యాన్సర్ పెరుగుతుందనే దానికి ఇది ప్రధాన సంకేతంగా ఉంటోంది. లుకేమియా లాంటి కొన్ని క్యాన్సర్లలో అలసటే తొలి లక్షణంగా ఉంటోంది. పెద్ద పేగు లేదా కడుపు క్యాన్సర్లు రక్తహీనతకు కారణమవుతాయి. ఆ సమయంలో కూడా అలసట అనేది సాధారణం.

మీ టూత్​పేస్ట్​లో క్యాన్సర్​ ఉందా?

జ్వరం: క్యాన్సర్ వచ్చిన రోగుల్లో జ్వరమనేది సాధారణ లక్షణం. క్యాన్సర్ పుట్టిన దగ్గర్నుంచి ఇతర అవయాలకు, శరీర భాగాలకు వ్యాప్తి చెందేటప్పుడు జ్వరం వస్తూ ఉంటుంది. క్యాన్సర్ ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో జ్వరం బారిన పడతారు. ముఖ్యంగా క్యాన్సర్, దాని చికిత్సలు రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం చూపుతుంటాయి. ఈ ప్రభావంతో క్యాన్సర్ ఉన్న రోగులు జ్వరం బారిన పడుతూ ఉంటారు. లుకేమియా లేదా లింఫోమా వంటి వాటికి జ్వరం ప్రాథమిక లక్షణం.

అతిగా బరువు తగ్గిపోవడం: క్యానర్స్ ఉన్న చాలా మంది ఒకానొక సమయంలో బాగా బరువు తగ్గిపోతుంటారు. ఐదు లేదా అంతకంటే ఎక్కువ కేజీలు బరువు తగ్గిపోవడాన్ని క్యాన్సర్ తొలి సంకేతంగా చూడొచ్చు. పాంక్రియాస్, కడుపు, ఊపిరితిత్తుల క్యాన్సర్, అన్నవాహిక క్యాన్సర్ వచ్చినప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది.

మొత్తం ఆరోగ్యం క్షీణించడం: క్యాన్సర్ పెరిగి, అవయవాలతో సహా శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించినప్పుడు ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు సూచించే వివిధ లక్షణాలు తలెత్తుతాయి. ఉదాహరణకు, ఎముక నొప్పి, బరువు తగ్గడం, వికారం, ఆకలి లేకపోవడం, కామెర్లు, శ్వాస ఆడకపోవడం, దగ్గు, తలనొప్పి, కండరాల బలహీనత.. తదితర లక్షణాలు ఉంటాయి. ఏవైనా కొత్త ఆరోగ్య లక్షణాలు తలెత్తి రెండు వారాల కంటే ఎక్కువ కాలం ఉంటే, మీరు మీ డాక్టర్​తో మాట్లాడాలి. హెపటైటిస్ ప్రమాదం - క్యాన్సర్​గా మారే వరకు లక్షణాలు కనిపించవు - ఇలా అడ్డుకోవాల్సిందే!

క్యాన్సర్​ను తరిమికొట్టే - అద్భుతమైన ఫుడ్! - మీ డైట్​లో భాగం చేసుకోవాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.