ETV Bharat / sukhibhava

Alert : బ్రేక్​ఫాస్ట్​లో ఈ ఆహారాలు - క్యాన్సర్​ వచ్చే అవకాశం!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 6, 2024, 2:24 PM IST

Do not Eat These Foods in Breakfast: మనలో చాలా మంది ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ గా ఏది కనిపిస్తే అది లాగిస్తూ ఉంటారు. అయితే.. కొన్ని ఫుడ్ ఐటమ్స్ తింటే మాత్రం అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు!

Do not Eat These Foods in Breakfast
Do not Eat These Foods in Breakfast

Do n0t Eat These Foods in Breakfast: మార్నింగ్​ టైమ్​లో ఉత్సాహంగా ఉండాలంటే.. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఉదయం పూట సరైన మోతాదులో ప్రొటీన్లు, విటమిన్లు, పీచుపదార్థాలు, కాల్షియం ఉన్న ఆహారం తీసుకోవడం అవసరం. అయితే చాలా మంది నచ్చింది తింటున్నారు. దాంతోపాటు ఇంట్లో చేసుకునే ఓపిక లేక.. బయట ఏది కనిపిస్తే దానిని పొట్టలోకి వేస్తున్నారు. దీనివల్ల క్యాన్సర్ ముప్పు కూడా ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు.

డీప్ ​ఫ్రై ఫుడ్స్​: చాలా మంది తమ బ్రేక్​ఫాస్ట్​లో ఆయిల్​ ఫుడ్స్​ను ఎక్కువగా తీసుకుంటారు. అంటే పూరి, వడ, బొండా.. ఇలా మొదలైనవి. అయితే ఉదయం పూట వీటిని తినడం వల్ల మెటబాలిజం తగ్గిపోతుంది. అలాగే హెవీగా ఉండి.. నడవడానికి కూడా చాలా కష్టపడతాం. అంతే కాకుండా చాలా మంది బయట హోటల్స్​, మొబైల్​ క్యాంటీన్ల దగ్గర తినడానికి ఇష్టపడతారు. అయితే వాళ్లు వాడిన ఆయిల్​ను.. పదేపదే ఉపయోగిస్తారు. అలాంటి నూనెలతో చేసిన ఫుడ్స్​ తినడం వల్ల హార్ట్​ ఎటాక్స్​, ఫ్యాటీ లివర్​ సమస్య, షుగర్​, క్యాన్సర్​ వంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మీకు అంతగా తినాలనిపిస్తే.. ఎప్పుడో ఒకసారి ఇంట్లోనే తయారు చేసుకోవడం బెటర్​.

రెడ్ రైస్ గురించి మీకు తెలుసా? - అంత మంచిదా?

న్యూటెలా: న్యూటెలాను బ్రెడ్​, రోటీ, దోశ మీద స్ప్రెడ్​ చేసుకుని చాలా మంది బ్రేక్​ఫాస్ట్​లాగా తింటుంటారు. అదే కాకుండా జామ్​ కూడా తింటారు. అయితే అవి ఎక్కువగా షుగర్​ కంటెంట్​ను కలిగి ఉంటాయి. దీనివల్ల ఆరోగ్యానికి నష్టమే కానీ.. లాభం ఏ మాత్రం ఉండదు. అయితే చాలా మంది తల్లిదండ్రులు చెప్పే మాట.. "మా పిల్లలు జామ్​ లేనిది తినరు" అని. ఒకవేళ మీ పిల్లలు అంతగా జామ్​ ఇష్టపడితే.. ఇంట్లోనే ఎటువంటి ప్రిజర్వేటివ్స్​ లేకుండా తయారు చేసుకోండి. దీనివల్ల ఆరోగ్యం కలిసివస్తుంది.

పెరుగు Vs మజ్జిగ - ఏది ఆరోగ్యానికి మంచిది?

రెడీ టూ ఈట్​ ఫుడ్స్​​: బిజీ లైఫ్​ షెడ్యూల్​ కారణంగా ఇంట్లో చేసుకునే తీరిక లేక.. నిమిషాల్లో రెడీ అయ్యే ఫుడ్స్​పై ఆధారపడుతున్నాం.. అయితే ఇందులో ఎక్కువ మంది ఉప్మా, పోహాలను ఎక్కువ వాడుతుంటారు. అయితే వీటిలో ఫైబర్​ కంటెంట్​ చాలా తక్కువ. 60 గ్రాముల పోహా ప్యాకెట్​లో కేవలం 1.5 గ్రాములు ఫైబర్​ మాత్రమే ఉంటుందట! అది మ్యాగీతో సమానం. కాబట్టి రెడీ టూ ఈట్​ మీల్స్​(ఉప్మా, దోశ,పోహా) వల్ల ఆరోగ్యంగా ఉంటామనే ప్రకటనలను నమ్మకుండా.. కొంచెం కష్టమైనా సరే ఇంట్లో తయారు చేసుకోవడం బెటర్​..

విటమిన్ D లోపం వల్లే ఆ సమస్యలు - ఏమైందో అని భయపడుతుంటారు!

మ్యూస్లీ: ప్రస్తుత రోజుల్లో ఇది బ్రేక్​ఫాస్ట్​గా పాపులర్​ అయ్యింది. అందులో పాలు కలుపుకుని తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటామని భావించి చాలా మంది వాటిని రెగ్యూలర్​గా తమ బ్రేక్​ఫాస్ట్​లో భాగం చేసుకుంటున్నారు. వీటిని ఎక్కువ మంది కొనడానికి కారణం.. అడ్వర్టైజ్​మెంట్​లో చూపించే విధంగా వివిధ ధాన్యాలు, గింజలు, పండ్లు ఉన్నాయని.. కాబట్టి అలాంటి మోసపూరిత ప్రకటనలను నమ్మి మోసపోవద్దని హెచ్చరిస్తున్నారు. వీటిలో మైదా, ఆర్టిఫిషియల్​ ప్లేవర్స్​, కలర్స్​, బ్లీచ్ ఉంటాయని, ఫైబర్​ కంటెంట్​ కూడా తక్కువ ఉంటుంద చెబుతున్నారు. వీటి బదులు.. మిల్లెట్​ ఫ్లేక్స్​ లేదా అన్​ఫ్లేవర్డ్​​ రోల్డ్​ ఓట్స్​ తీసుకుని అందులో పాలు.. ఇంక మీకు నచ్చిన ఫ్రూట్స్​ వేసుకుని తినొచ్చట.

కళ్లలో సమస్యలా? భవిష్యత్తులో ఇబ్బందులే - ఇలా కాపాడుకోండి!

బ్రెడ్​: ఉదయం బ్రేక్​ఫాస్ట్​గా చాలా మంది బ్రెడ్​ తింటుంటారు. అయితే దీన్ని బ్రేక్​ఫాస్ట్​గా తినొద్దంటున్నారు నిపుణులు. ఎందుకుంటే దీనిని ఎక్కువ శాతం మైదాతో తయారు చేస్తారు. గోధుమ పిండి తక్కువ మొత్తంలో ఉంటుంది. కేవలం మైదా మాత్రమే కాకుండా.. పామాయిల్​, ఆర్టిఫిషియల్​ ఫ్లేవర్స్​, ప్రిజర్వేటివ్స్​ ఉపయోగించి తయారు చేస్తారు. వీటి వల్ల ఆరోగ్యానికి ప్రమాదం పొంచిఉంటుందని చెబుతున్నారు. ఒకవేళ మీరు బ్రెడ్​ లవర్​ అయితే.. ఇంట్లోనే బ్రెడ్​ చేసుకోవడం బెటర్​ అని సూచిస్తున్నారు.

పైన చెప్పిన వాటికి బదులుగా.. బ్రేక్ ఫాస్ట్​లోకి గ్రెయిన్స్​, నట్స్​, సీడ్స్​, పండ్లు, కూరగాయలు తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

మైక్రో​ ఓవెన్లతో మనుషులకు క్యాన్సర్​ వస్తుందా? - WHO ఏమంటోంది?

వింటర్​ ఎఫెక్ట్​- జలుబు, దగ్గుతో ఇబ్బంది పడుతున్నారా? నో టెన్షన్​- వీటిని ట్రై చేయండి!

రుమటాయిడ్ ఆర్థరైటిస్​తో​ ఇబ్బందా? ఈ ఆయుర్వేద రెమిడీతో ఈజీగా రిలీఫ్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.