ETV Bharat / sukhibhava

మైక్రో​ ఓవెన్లతో మనుషులకు క్యాన్సర్​ వస్తుందా? - WHO ఏమంటోంది?

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 4, 2024, 10:25 AM IST

Can Microwaves Cause Cancer? : ప్రస్తుతం చాలా మంది ఇళ్లలో మైక్రోవేవ్ ఓవెన్ ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులు టైమ్ సేవ్ అవుతుందని వీటివైపు మొగ్గుచూపుతున్నారు. అయితే.. ఇందులో వండిన ఆహారాలు తింటే.. క్యాన్సర్ వస్తుందేమో అనే చర్చ చాలా మందే చేస్తుంటారు. మరి.. ఇందులో నిజమెంత? WHO ఏం చెబుతోంది? అన్నది ఇప్పుడు చూద్దాం.

Microwaves
Can Microwaves Cause Cancer

Microwaves Can Cause Cancer? : ఒకప్పుడు వంట చేసుకోవాలంటే కట్టెల పొయ్యి వాడేవారు. కాలక్రమంలో ఎల్​పీజీ గ్యాస్ స్టవ్ వచ్చింది. ఆ తర్వాత మైక్రోవేవ్ ఓవెన్ కూడా వంటింట్లోకి వచ్చేసింది. నేటి బిజీబిజీ లైఫ్​లో తక్కువ టైమ్​లో వంట సిద్ధం కావాలనే ఉద్దేశంతో చాలా మంది మైక్రోవేవ్ ఓవెన్​లు తీసుకోవడానికి మొగ్గుచూపుతున్నారు. అయితే.. కొందరిలో ఓవెన్స్ విషయంలో పలు సందేహలు ఉన్నాయి. మైక్రోవేవ్(Microwave)​లో ఆహారాన్ని వండుకోవడం లేదా వేడి చేయడం సురక్షితమేనా? క్యాన్సర్​ కూడా వచ్చే ఛాన్స్ ఉందా? అనే భయాలు ఉన్నాయి. మైక్రోవేవ్ ఓవెన్లు క్యాన్సర్​ కారకాలను ఉత్పత్తి చేస్తాయన్న అనుమానాలే ఈ భయాలకు కారణాలు. మరి.. వాస్తవాలేంటి? అపోహాలు ఏవి? అన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

అపోహ : మైక్రోవేవ్​లో ఆహారం వండితే లేదా వేడి చేస్తే అందులోని పోషకాలను తొలగిస్తుంది.

వాస్తవం : ఇతర వంట పద్ధతుల కంటే మైక్రోవేవ్​లో ఆహారం నిజానికి ఎక్కువ పోషకాలను నిలుపుకోవడంలో సహాయపడుతుంది. హార్వర్డ్ హెల్త్ పబ్లిషింగ్ ప్రకారం.. వెజిటేబుల్స్ ఎక్కువగా ఉడకకుండా ఉన్నంత వరకు వాటిలోని పోషకాలను సంరక్షించడంలో మైక్రోవేవ్​ ఓవెన్లు సహాయపడతాయి.

అపోహ : మైక్రోవేవ్ ఓవెన్లు క్యాన్సర్‌కు కారణమవుతాయి.

వాస్తవం : మైక్రోవేవ్ ఓవెన్‌లు క్యాన్సర్‌కు కారణమవుతాయనే వాదనకు శాస్త్రీయ ఆధారాలు లేవు. నిజానికి, ఓవెన్లు ఆహారాన్ని వండడానికి, వేడి చేయడానికి సురక్షితమైనవని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) పేర్కొంది. మైక్రోవేవ్ ఓవెన్లు మానవులకు హాని కలిగించే రేడియేషన్‌ను ఉత్పత్తి చేయవని WHO పరిశోధనలో తేలింది. ఇంకా.. ఇందులో ఆహారాన్ని వేడి చేయడానికి ఉపయోగించే తరంగాలు.. ఆహారం పరమాణు నిర్మాణంలో ఎటువంటి ముఖ్యమైన మార్పులనూ కలిగించలేనంత బలహీనంగా ఉంటాయని తెలిపింది.

అపోహ : మైక్రోవేవ్ ప్లాస్టిక్ కంటైనర్లు క్యాన్సర్ కారక రసాయనాలను విడుదల చేస్తాయి.

వాస్తవం : కొన్ని ప్లాస్టిక్‌లు వేడిచేసినప్పుడు హానికరమైన రసాయనాలను విడుదల చేస్తాయన్నది నిజమే. అయితే.. చాలా వరకు మైక్రోవేవ్​లో వినియోగించే ప్లాస్టిక్ కంటైనర్లను అధిక వేడికి తట్టుకునేలా తయారు చేస్తారు. మీరు మైక్రోవేవ్ ఓవెన్‌లో ప్లాస్టిక్ కంటైనర్‌లను ఉపయోగించే ముందు.. "మైక్రోవేవ్-సేఫ్" అని లేబుల్ చేసిన వాటిని మాత్రమే యూజ్ చేయండి.

మీరు ఓవెన్ వాడుతున్నారా? - ఈ 6 వస్తువులు అందులో పెడితే చాలా డేంజర్!

అపోహ : మైక్రోవేవ్ ఓవెన్‌కు చాలా దగ్గరగా నిలబడితే రేడియేషన్ ఎక్స్‌పోజర్‌కు కారణం కావచ్చు.

వాస్తవం : మైక్రోవేవ్ ఓవెన్‌లు నాన్-అయోనైజింగ్ రేడియేషన్‌ను విడుదల చేస్తాయి. ఈ రేడియేషన్ అనారోగ్యం లేదా క్యాన్సర్‌కు కారణమయ్యేంత శక్తిని కలిగి ఉండదు. కాబట్టి మైక్రోవేవ్ ఓవెన్ ఉపయోగంలో ఉన్నప్పుడు దాని దగ్గర నిలబడటం హానికరం కాదు. కేవలం ఆ మైక్రోవేవ్‌లు ఆహారంలోకి చొచ్చుకుపోయి అందులో ఉన్న అణువులను కంపించేలా చేస్తాయి. అప్పుడు వేడి ఉత్పత్తి అయి అవి తొందరగా ఉడుకుతాయి. అయితే.. ఓవెన్ డోర్ సరిగ్గా మూసి, అది మంచి స్థితిలో ఉన్నంత వరకు దాని నుంచే వచ్చే మైక్రోవేవ్‌లు ఓవెన్‌లోనే ఉంటాయి. ఉడుకుతున్నప్పుడు డోర్ తీస్తే బయటకు వచ్చి కొంత ఇబ్బంది కలిగించవచ్చు.

ఇక చివరగా.. మైక్రోవేవ్ ఓవెన్లు ఆహారాన్ని వండడానికి, మళ్లీ వేడి చేయడానికి సురక్షితమైన అనుకూలమైన మార్గం. అవి క్యాన్సర్‌కు కారణమవుతాయని లేదా ఏదైనా ఇతర ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తాయని సూచించడానికి ఎటువంటి ఆధారాలూ లేవని నిపుణులు చెబుతున్నారు.

ఈ '5' ఆహార పదార్థాలను మళ్లీ మళ్లీ వేడిచేసి తింటున్నారా? - అయితే మీరు ప్రమాదానికి వెల్​కమ్​ చెప్పినట్లే!

డిన్నర్​లో ఏం తింటున్నారు..? ఇవి తింటే డేంజర్​ జోన్​లో పడ్డట్టే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.