ETV Bharat / sukhibhava

రొమ్ము క్యాన్సర్ బారిన పడొద్దంటే - ఇవి తినాల్సిందే!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 30, 2023, 2:41 PM IST

Diet Foods Can Prevent Breast Cancer : మహిళల్లో ప్రాణాంతక వ్యాధుల జాబితాలో రొమ్ము క్యాన్సర్ ముందు వరసలో ఉంటుంది. ఇది ఎటాక్ అయిందంటే.. దీని నుంచి బయటపడడం చాలా కష్టం. ఈ వ్యాధి రాకముందే మన ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకుంటే.. దీని బారి నుంచి తప్పించుకోవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

Cancer
Diet Foods Can Prevent Breast Cancer

Best Diet Foods to Prevent Breast Cancer Risk : ప్రపంచాన్ని భయపెడుతున్న వ్యాధుల్లో రొమ్ము క్యాన్సర్(Breast Cancer) ఒకటి. ఈ మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. చాలా మందిలో వ్యాధి ముదిరిన తర్వాతగానీ బయటపడట్లేదు. ఈ ప్రాణాంతక వ్యాధి నుంచి తప్పించుకోవాలంటే మహిళలు జీవనశైలితో పాటు.. తీసుకునే ఆహారం విషయంలోనూ కొన్ని మార్పులు చేసుకోవాలంటున్నారు నిపుణులు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఫైబర్ ఫుడ్స్ తీసుకోవాలి : అధిక ఫైబర్ కలిగిన ఉన్న ఆహారం రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని ఒక పరిశోధనలో తేలింది. తృణధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు, క్యారెట్, ఆపిల్, బేరి పండ్లు వంటి వాటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి చిన్న వయసు నుంచే వీటిని మీ డైట్​లో భాగం చేసుకున్నారంటే ఆరోగ్యానికి బలమైన పునాదిని ఏర్పరుస్తాయి. అలాగే ఫైబర్ తీసుకోవడం ద్వారా లభించే శక్తి హార్మోన్ల సమతుల్యతను కాపాడడంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఈ రెండు మంచిగా ఉంటే క్యాన్సర్ రాకుండా కాపాడుకోవచ్చు.

కొవ్వు ఆహారాలకు దూరంగా : గుండె జబ్బులతోపాటు వివిధ అనారోగ్య సమస్యలు రావడానికి కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడమే ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అలాగే ప్రాణాంతకమైన రొమ్ము క్యాన్సర్​ ప్రమాదాలను ఈ ఆహార పదార్థాలు పెంచుతాయని కొన్ని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. కాబట్టి ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఫుడ్స్​కు వీలైనంత దూరంగా ఉంటే మంచిది. అదేవిధంగా మాంసం, కొవ్వు కలిగిన పాల ఉత్పత్తులు, సంతృప్త కొవ్వులు ఉండే పదార్థాలను తీసుకునే విషయంలోనూ కాస్త జాగ్రత్త తీసుకోవాలి.

పెరుగు.. రొమ్ముకు ఎంతో మేలు!

ఆర్గానిక్ ఫుడ్స్ : మహిళలు రొమ్ము క్యాన్సర్ బారిన పడకుండా ఉండడంలో సేంద్రియ ఆహారపదార్థాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే వీటిలో క్యాన్సర్​ రావడానికి కారణమయ్యే హానికరమైన పురుగుమందులు, రసాయనాలు ఉండవు. కాబట్టి మీ డైట్​లో ఆర్గానిక్ ఫుడ్స్​కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. వీటిని మీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఒక్క క్యాన్సర్​ బారిన పడకుండా ఉండడమే కాదు వివిధ ఆరోగ్య సమస్యల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. మీ ఆరోగ్యవంతమైన జీవితానికి ఈ ఫుడ్స్ ఎంతో దోహదపడతాయి.

క్రూసిఫెరస్ కూరగాయలు : క్యాలీఫ్లవర్, క్యాబేజీ, బ్రోకలీ వంటి క్రూసిఫరస్ కూరగాయలు రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో ఎంతో ఉపయోగపడతాయి. వీటిని మీ డైట్​లో సాధారణంగా తీసుకోవడం ద్వారా క్యాన్సర్ కారకాలను చాలా వరకు తగ్గిస్తాయి. కాబట్టి మీరు తీసుకునే ఆహారంలో ఈ కూరగాయలు ఉండేలా చూసుకోవడం ద్వారా అనేక అనారోగ్య సమస్యలు మీ దరి చేరకుండా కాపాడుకోవచ్చు.

పైన పేర్కొన్న ఈ ఫుడ్ ఐటమ్స్​తో పాటు.. మిల్లెట్‌లను మీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. మిల్లెట్లు, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, ఫైటోకెమికల్స్‌తో కూడిన తృణధాన్యాలు.. క్యాన్సర్ నుంచి కాపాడుకోవడానికి చాలా బాగా తోడ్పడుతాయి. ముఖ్యంగా.. యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరించడంతో పాటు క్యాన్సర్ అభివృద్ధికి దోహదపడే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి.

అంతేకాకుండా.. మిల్లెట్లు తీసుకోవడం ద్వారా బాడీలోని హార్మోన్లు, ఇన్సులిన్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అలాగే మిల్లెట్లలోని ఫైబర్ కంటెంట్ జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. వీటితో పాటు క్రమమైన వ్యాయామం, అప్పుడప్పుడు సాధారణ స్కీనింగ్​లు తీయించుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.

నెయ్యిలో నానబెట్టిన ఖర్జూరాలతో ఎన్నో లాభాలు- రొమ్ము క్యాన్సర్​కు చెక్​!- నార్మల్​ డెలివరీకి ఛాన్స్!!

గర్భిణికి... రొమ్ము క్యాన్సర్‌ రాదు నిజమేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.