ETV Bharat / sukhibhava

ఇలా చేస్తే రొమ్ము క్యాన్సర్​ను ముందే గుర్తించవచ్చు!

author img

By

Published : Aug 31, 2021, 7:00 AM IST

Breast Cancer
రొమ్ము క్యాన్సర్

రొమ్ము క్యాన్సర్​ను(Breast Cancer) ముందుగా గుర్తించవచ్చా? అంటే నిపుణులు అవుననే సమధానం ఇస్తున్నారు. అలాగే రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో..? వారి మాటల్లోనే తెలుసుకుందాం.

మారుతున్న జీవనశైలి, తీసుకున్న ఆహారం సహా వాతావరణ మార్పులతో ఎన్నో రోగాలు పుట్టుకొస్తున్నాయి. ఉన్న రోగాలు మరింత తీవ్రంగా తయారై మానవ మనుగడకు ముప్పుగా పరిణమిస్తున్నాయి. అటువంటి వ్యాధుల్లో క్యాన్సర్​ ప్రధానమైంది. ముఖ్యంగా మహిళలు రొమ్ము క్యాన్సర్​కు(Breast Cancer) గురవుతున్నారు. ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది మహిళలు.. ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అయితే ఈ వ్యాధిని ముందే గుర్తించడం ఎలా..? రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దీనిపై వైద్య నిపుణులు ఏమంటున్నారు.

ముందే గుర్తించడం ఎలా?

  • ప్రతf మహిళ నెలకొకసారి అద్దం ముందు నిల్చొని.. రొమ్ము వైపు చూసి, చేతులతో తాకి.. స్వయంగా పరీక్షించుకోవాలి. స్నానం చేస్తున్నప్పుడు, పడుకునే ముందు ఈ విధంగా పరీక్షించుకోవాలి.
  • సొంతంగా రొమ్ములను పరీక్షించుకోవాలో తెలియకపోతే డాక్టర్​ను సంప్రందిస్తే.. వాళ్లు నేర్పిస్తారు. లేదా యూట్యూబ్​లో చాలా వీడియోలు ఉన్నాయి. వాటిని చూసి నేర్చుకోవచ్చు!
  • 45-65 ఏళ్ల మధ్య వయసువారు.. ఏడాదికి ఒకసారి లేదా రెండేళ్లకు ఒకసారి మామోగ్రామ్​(బ్రెస్ట్​కు స్కాన్, ఎక్స్​రే ) చేయించుకోవాలి.
  • ఒబెసిటీ ఉన్నవాళ్లకు రొమ్ము క్యాన్సర్​ వచ్చే ప్రమాదముంది.

రాకుండా ఉండాలంటే ఇవి తప్పనిసరి

  • తొలుత మీ గురించి మీరు తెలుసుకోవాలి. అంటే.. మీ రొమ్ములు ఎలా ఉన్నాయి? ఏ పరిమాణంలో ఉన్నాయి? ఏ ఆకారంలో ఉన్నాయి? కుడి, ఎడమ రొమ్ముల మధ్య ఏదైనా తేడా ఉందా? వంటి విషయాలు తరచూ పరీక్షించుకుని తెలుసుకోవాలి.
  • పిల్లలకు ఎక్కువ కాలం పాలిచ్చినా.. బ్రెస్ట్​ క్యాన్సర్​ బారిన పడే ప్రమాదం తగ్గుతుంది.
  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: వెల్లుల్లి తింటే తగ్గే రోగాలు ఇవే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.