ETV Bharat / state

తుపాకీతో కాల్చుకుని కానిస్టేబుల్​ ఆత్మహత్య - పోలీస్​స్టేషన్​ విశ్రాంతి గదిలోనే - Constable Suicide in AP

author img

By ETV Bharat Telangana Team

Published : May 16, 2024, 11:53 AM IST

Constable Suicide in Srisailam One Town Police Station in AP : ఏపీలోని శ్రీశైలం ఒకటో పట్టణ పోలీసుస్టేషన్‌లో కానిస్టేబుల్ శంకర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మకూరు డీఎస్పీ శ్రీనివాసరావు శ్రీశైలం చేరుకున్న తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

Constable Suicide at Srisailam in AP
Constable Suicide at Srisailam in AP (ETV Bharat)

Constable Suicide at Srisailam in AP : ఏపీలోని శ్రీశైలం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్ శంకర్‌ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. పీఎస్​ విశ్రాంతి గదిలోనే శంకర్ రెడ్డి తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. మృతుడు రక్తపు మడుగులో పడి ఉన్న ఘటనను పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదు.

సమాచారం అందుకున్న సీఐ ప్రసాద్‌రావు అక్కడికి చేరుకొని ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం విచారణ చేపట్టారు. ఆత్మకూరు డీఎస్పీ శ్రీనివాసరావు శ్రీశైలం చేరుకున్న తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. 2001లో సివిల్ కానిస్టేబుల్​గా ఉద్యోగంలో చేరిన శివ శంకర్ రెడ్డి, కర్నూలు, పెద్దకడబూరు శ్రీశైలం పోలీస్ స్టేషన్​లో విధులు నిర్వర్తించారు.

అనుమానాస్పద స్థితిలో యువకుడి ఆత్మహత్య - మృతికి అదే కారణమా? - YOUNG MAN SUICIDE In gundala mandal

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.