ETV Bharat / state

తొలిసారిగా 8 మోటార్లతో పార్వతి బ్యారేజ్​లోకి నీటి ఎత్తిపోత

author img

By

Published : Feb 23, 2020, 8:29 PM IST

parvathi barrage
తొలిసారిగా 8 మోటార్లతో పార్వతి బ్యారేజ్​లోకి నీటి ఎత్తిపోత

పార్వతి బ్యారేజ్​ ప్రారంభించాక పూర్తిస్థాయిలో నీటిని ఎత్తిపోస్తున్నారు. అన్నారం పంప్​హౌస్​ నుంచి 8 మోటార్లతో 23,200 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు.

పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగులో నిర్మించిన అన్నారం పంప్​హౌస్​లో ఇవాళ సాయంత్రం తొలిసారిగా 8 మోటార్లు ప్రారంభించారు. 23,200 క్యూసెక్కుల చొప్పున నీటిని పార్వతి బ్యారేజ్​లోకి ఎత్తిపోస్తున్నారు. పార్వతి బ్యారేజ్​ ప్రారంభించాక పూర్తి సామర్థ్యంలో నీటిని ఎత్తిపోయడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు నాలుగు మోటార్లనే వినియోగించారు. జలకళ సంతరించుకోవడం వల్ల అటుగా వెళ్తున్న ప్రయాణికులు పార్వతి బ్యారేజ్​పై స్వీయచిత్రాలు దిగుతున్నారు. పరిసరాలన్నీ సందడిగా మారాయి.

తొలిసారిగా 8 మోటార్లతో పార్వతి బ్యారేజ్​లోకి నీటి ఎత్తిపోత

ఇవీచూడండి: కాళేశ్వరంలో కేసీఆర్ విహంగ వీక్షణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.