ETV Bharat / state

మోదీ, కేసీఆర్‌కు గుణపాఠం చెప్పే సమయం వచ్చింది: రేవంత్‌ రెడ్డి

author img

By

Published : Oct 10, 2022, 7:36 PM IST

Munugode By Election On Campaign Revanth: మునుగోడు ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రచార జోరు పెంచింది. సిట్టింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు తమదైన వ్యూహాలతో ప్రజాక్షేత్రంలోకి కదులుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న భాజపా, తెరాసను దీటుగా ఎదుర్కొనేందుకు కార్యకర్తల బలాన్ని నేతలు నమ్ముకున్నారు. ప్రచార బాధ్యతలు మోస్తున్న పీసీసీ సారథి స్వయంగా రంగంలోకి దిగి రోడ్‌షోలతో ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

రేవంత్ రెడ్డి
రేవంత్ రెడ్డి

Munugode By Election On Campaign Revanth: మునుగోడు ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ దూకుడు పెంచింది. కేంద్రం, రాష్ట్రాన్ని ఏలుతున్న భాజపా, తెరాస మునుగోడు ప్రజలకు చేసిందేమి లేదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. మోదీ, కేసీఆర్‌కు గుణపాఠం చెప్పే సమయం వచ్చిందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప కొత్తగా ఒరగబెట్టింది శూన్యమని ఆరోపించారు.

డిండి, చర్లగూడెం ప్రాజెక్టులను పూర్తిచేయలేదన్న రేవంత్‌.. భూనిర్వాసితులకు న్యాయం చేయడంలో కేసీఆర్‌ సర్కార్‌ విఫలమైందని విమర్శించారు. నియోజకవర్గ ఆడబిడ్డ స్రవంతి గెలిపించాలని ఓటర్లను రేవంత్ రెడ్డి అభ్యర్థించారు. కుటుంబ పెత్తనం, కుటుంబ బాధ్యత ఆడబిడ్డ చేతిలో పెడితేనే బాగుంటుందని తెలిపారు. కాంగ్రెస్‌ హయాంలో మహిళలకు ప్రాధాన్యం ఇచ్చామన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థిని 30 వేల ఓట్ల మెజారిటీతో గెలిపించాలని రేవంత్ రెడ్డి అక్కడి వారిని కోరారు.

ఇవీ చదవండి: 'పార్టీ మారాలని బెదిరిస్తే.. ఎంతటి వారైనా వాళ్ల వీపు విమానం మోతే'

ఏ ఊరికెళ్లినా నీరాజనాలే.. మునుగోడు కాంగ్రెస్‌దే: పాల్వాయి స్రవంతి

శివసేన గుర్తు కోసం ఠాక్రే న్యాయపోరాటం.. ఈసీ ఆదేశాల రద్దుకు హైకోర్టులో పిటిషన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.