ETV Bharat / state

Tummala Nageshwar Rao Met Supporters : మీకోసం పోటీ చేస్తాను.. నిరంతరం ప్రజాక్షేత్రంలోనే ఉండండి.. అనుచరులతో తుమ్మల

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 30, 2023, 3:15 PM IST

Updated : Aug 30, 2023, 3:47 PM IST

Thummala Nageswar Rao
Thummala Nageswar Rao Meet to Supporters

Tummala Nageshwar Rao Met Supporters : మీ కోసం వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని కార్యకర్తలతో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు పునరుద్ఘాటించారు. ఖమ్మం జిల్లాలో అభిమానులతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా గండుగులపల్లిలో తుమ్మలను.. కూసుమంచి మండల నేతలు కలిశారు. నిరంతరం ప్రజాక్షేత్రంలోనే ఉండాలని వారికి ఆయన దిశానిర్దేశం చేశారు.

Tummala Nageshwar Rao Met Supporters in Khammam : గత వారం బీఆర్‌ఎస్‌ 115 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఆ జాబితాలో ఖమ్మం జిల్లా సీనియర్‌ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు(Tummala Nageshwar Rao) పేరు లేకపోవడంతో ఆరోజు నుంచి ఆయన అసమ్మతి గళం వినిపిస్తూనే ఉన్నారు. తుమ్మలను శాంతింపజేయడానికి ఎంపీ నామా నాగేశ్వర్‌రావును పంపించారు. అయినా ఆయన అలక విడవలేదు. ఇటీవల ఖమ్మంలో నిర్వహించిన భారీ ర్యాలీలోనూ బీఆర్​ఎస్(BRS)​ జెండాలు ఎక్కడా కనిపించలేదు.

ఈ సందర్భంగా ఈ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానంటూ.. కార్యకర్తల్లో జోష్‌ నింపారు. ఈ క్రమంలో నేడు ఖమ్మం జిల్లా గండుగులపల్లిలో తుమ్మల నాగేశ్వర్‌రావును కూసుమంచి మండలం నేతలు కలిశారు. ఈ క్రమంలో వారితో సుదీర్ఘంగా మాజీ మంత్రి తుమ్మల చర్చించారు. నిరంతరం ప్రజాక్షేత్రంలోనే ఉండాలని అనుచరులకు ఆయన సూచించారు. మీ కోసం వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ.. స్పష్టం చేశారు. అయితే ఆ తర్వాత కాంగ్రెస్‌ ఎంపీటీసీ, సర్పంచ్‌లు తుమ్మల నాగేశ్వర్‌రావును ఆయన నివాసంలో కలిశారు. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

రాజకీయ శత్రువులను నమ్మొచ్చు కానీ ద్రోహులను నమ్మకూడదు: తుమ్మల

Tummala Nageshwar Rao Election Plan : బీఆర్‌ఎస్‌ టికెట్‌ లభించకపోవడంతో తుమ్మల నాగేశ్వర్‌ రావు తీవ్ర అసహనానికి గురైయ్యారు. అందుకు తాను ఎవరినీ నిందించ తలచుకోలేదని తెలిపారు. తన రాజకీయ జీవితం ప్రజల చేతుల్లోని ఉందని వివరించారు. తన జిల్లా అభివృద్ధి కోసం జీవితాన్నే అంకితం చేశానన్నారు. నియోజకవర్గంలో ఎందరో నాయకుల వల్ల కానివి.. తాను చేసి చూపించినట్లు తుమ్మల నాగేశ్వర్‌రావు వివరించారు. ఈ ఎన్నికల్లో తనను తప్పించడానికి ఎందరో.. ఎన్నో ఎత్తుగడలు వేశారని ఆరోపించారు. ఎవరు ఎన్ని పన్నాగాలు పన్నిన తనను ఖమ్మం ప్రజలతో ఉన్న అనుబంధం నుంచి విడదీయలేరని స్పష్టం చేశారు.

Tummala BRS MLA Ticket Issue : కారు దిగుతారా.. కాంగ్రెస్​కు వెళ్తారా.. తుమ్మల దారి ఎటువైపు..?

Tummala Nageswar Rao Rally : అంతకు ముందు హైదరాబాద్‌ నుంచి ఖమ్మం వస్తున్నారని తెలిసి జిల్లా సరిహద్దులో నాయకన్‌గూడెం నుంచి సుమారు 1000 కార్లు, 2000 బైక్‌లతో భారీ ర్యాలీ నిర్వహించారు. సుమారు 6 గంటలు నడిచిన ర్యాలీలో.. కార్యకర్తలు, అనుచరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈసారి ఎలాగైనా పాలేరు నుంచి తుమ్మల పోటీ చేయాలని.. అనుచరులు పట్టుబట్టారు. అయితే ఈ మధ్య పార్టీ మారుతున్నారన్న ఊహాగానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఆయన పయనం ఎటుపోతుందో చూడాలి మరీ. ఇప్పటికే బీఆర్‌ఎస్‌ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈసారి ఎన్నికల బరిలో నిలిచి.. గెలుపొందాలని తుమ్మల నాగేశ్వర్‌రావు భావిస్తున్నారు.

Tummala MLA Ticket Issue : తుమ్మల పార్టీ మారతారా..! మారితే ఎందులోకి..? మారకపోతే నెక్ట్స్​ ఏంటి..?

Tummala Comments on Assembly Elections 2023 : నా ప్రజల కోసం.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా: తుమ్మల

Last Updated :Aug 30, 2023, 3:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.