ETV Bharat / state

రాజకీయ శత్రువులను నమ్మొచ్చు కానీ ద్రోహులను నమ్మకూడదు: తుమ్మల

author img

By

Published : Mar 16, 2022, 3:47 PM IST

Tummala Nageshwara Rao: సీఎం కేసీఆర్ సహకారంతో పాలేరు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాజకీయశత్రువులను నమ్మొచ్చు కానీ రాజకీయ ద్రోహులను మాత్రం నమ్మకూడదని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గంలో మిగిలిపోయిన అభివృద్ధి కార్యక్రమాలను సీఎం సహకారంతో పూర్తి చేస్తామన్నారు.

రాజకీయ శత్రువులను నమ్మొచ్చు కానీ ద్రోహులను నమ్మకూడదు: తుమ్మల
రాజకీయ శత్రువులను నమ్మొచ్చు కానీ ద్రోహులను నమ్మకూడదు: తుమ్మల

Tummala Nageshwara Rao: రాజకీయ శత్రువులను నమ్మొచ్చు కానీ రాజకీయ ద్రోహులను మాత్రం నమ్మకూడదని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. రాజకీయ ద్రోహులు అంటే ఒకే పార్టీలో ఉండి నమ్మకద్రోహం చేసిన వారిని నమ్మకూడదన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువు మాదారం గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. భారీ ర్యాలీ నిర్వహించి నాయకులు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో పాలేరు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్న ఆయన.. మిగిలిన కార్యక్రమాలు కూడా త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. పాలేరు నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ముందంజలో ఉంచుతానని ఆయన అన్నారు. ఘన స్వాగతం పలికిన కార్యకర్తలనుద్దేశించి.. త్వరలో మరోసారి పాలేరుకి వస్తానని తుమ్మల అన్నారు. మిగిలిపోయిన పనులను పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు.

వారిని నమ్మొద్దు..

ముఖ్యమంత్రి కేసీఆర్​ సహకారంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ఇంకా మిగిలిపోయిన పనులన్నీ కూడా సీఎం సహకారంతో పూర్తవుతాయి. ఈ నియోజకవర్గంలో ఏ పనులు ఆగిపోయినా అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి పనులు చేయిస్తున్నా. రాజకీయ శత్రువులను నమ్మొచ్చు కానీ రాజకీయ ద్రోహులను మాత్రం నమ్మొద్దు. రాజకీయ శత్రువులంటే వారి పార్టీకి వాళ్లు ఓటేసుకుంటారు.. కానీ రాజకీయ ద్రోహులు ఈ పార్టీలో వేరే పార్టీకి ఓటేస్తారు. వాళ్లను మాత్రం నమ్మొద్దు. త్వరలో ప్రజల ముందుకు తప్పకుండా వస్తా. -తుమ్మల నాగేశ్వరరావు, మాజీ మంత్రి

రాజకీయ శత్రువులను నమ్మొచ్చు కానీ ద్రోహులను నమ్మకూడదు: తుమ్మల

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.