ETV Bharat / state

SRISAILAM RESERVOIR: శ్రీశైలం జలాశయానికి వరద తగ్గింది... కిన్నెరసానికి పెరిగింది!

author img

By

Published : Aug 17, 2021, 11:17 AM IST

Updated : Aug 17, 2021, 11:34 AM IST

full of water in srisaialm and kinnerasani reservoirs
శ్రీశైలం జలాశయానికి తగ్గింది.. కిన్నెరసాని ప్రాజెక్టుకి పెరిగింది..

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గింది. జలాశయం ఇన్​ఫ్లో 21,121 క్యూసెక్కులుగా నమోదైంది. అలాగే కిన్నెరసాని జలాశయానికి వరద ప్రవాహం పెరగడంతో... అధికారులు రెండు గేట్లను ఎత్తివేశారు.

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గింది. జలాశయం ఇన్‌ఫ్లో 21,121 క్యూసెక్కులుగా నమోదవుతోంది. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులకు.. ప్రస్తుతం 879.80 అడుగుల మేర నీటి నిల్వ ఉంది. గరిష్ఠ నీటినిల్వ 215 టీఎంసీలుకు గాను.. ప్రస్తుత నీటినిల్వ 187.70 టీఎంసీలుగా నమోదైంది. కుడిగట్టు విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి నిలిపివేసిన అధికారులు.. వరద ప్రవాహం తగ్గడమే అందుకు కారణంగా చెప్పారు.

శ్రీశైలం జలాశయానికి తగ్గిన వరద

కిన్నెరసానికి జలకళ

కిన్నెరసానికి జల కళ వచ్చేసింది. ఎగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి మర్కోడు, గుండాల, అల్లపల్లి తదితర ప్రాంతాల్లో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో అక్కడ నుంచి భారీగా వరదలు వచ్చి పాల్వంచ మండలంలోని కిన్నెరసాని జలాశయంలో కలుస్తున్నాయి. 4 రోజుల క్రితం వరకు 200 క్యూసెక్కుల ఇన్​ప్లో మాత్రమే ఉండగా... ప్రస్తుతం 1200 క్యూసెక్కులకు చేరుకుంది.

కిన్నెరసాని ప్రాజెక్టుకి పెరిగిన వరద

జలాశయ నీటిమట్టం 407 అడుగులు కాగా... బుధవారం సాయంత్రం 403.60 అడుగులకు చేరుకుంది. ఇన్ ప్లో అమాంతంగా పెరగడంతో కిన్నెరసాని ప్రాజెక్టు అధికారులు అప్రమత్తమయ్యారు. రాత్రి 10 గంటలకు రెండు గేట్లు ఎత్తి 8 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. పాల్వంచ, బూర్గంపాడు మండల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.

ఇదీ చూడండి: Gandhi Hospital Rape: గాంధీలో దారుణం.. అక్కాచెల్లెళ్లపై సామూహిక అత్యాచారం..!

Last Updated :Aug 17, 2021, 11:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.