ETV Bharat / state

'కాళేశ్వరంలో ఏం జరిగిందో ప్రత్యక్షంగా చూశా, ప్రాజెక్టు పేరుతో బీఆర్​ఎస్​ లక్ష కోట్ల దోపిడీకి పాల్పడింది'

author img

By ETV Bharat Telangana Team

Published : Nov 2, 2023, 9:40 AM IST

Updated : Nov 2, 2023, 1:55 PM IST

Rahul Gandhi Inspected Medigadda Barrage
Rahul Gandhi

Rahul Gandhi Inspected Medigadda Barrage : మేడిగడ్డ బ్యారేజీని కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్‌ గాంధీ సందర్శించారు. కుంగిన ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన.. అందుకు గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాహుల్ గాంధీ వెంట రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు ఉన్నారు.

Rahul Gandhi Inspected Medigadda Barrage : తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మూడో రోజు పర్యటించారు. ఈ క్రమంలోనే నేడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా పర్యటనలో భాగంగా రాహుల్.. మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు. బ్యారేజీ కుంగడానికి గల కారణాలను తెలుసుకున్నారు. అనంతరం మేడిగడ్డ నుంచి హైదరాబాద్ చేరుకున్న రాహుల్‌ గాంధీ ప్రత్యేక విమానంలో దిల్లీ బయల్దేరారు.

Opposition on Medigadda Project Issue : "మేడిగడ్డ బ్యారేజీపై సమగ్ర విచారణ జరిపించాలి"

అంతకుముందు రాహుల్ గాంధీ మహదేవ్‌పూర్ మండలం అంబట్‌పల్లిలో ఏర్పాటు చేసిన మహిళా సాధికారత సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దొరల తెలంగాణకు.. ప్రజల తెలంగాణ మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కాళేశ్వరంలో ఏం జరిగిందో ప్రత్యక్షంగా చూసేందుకే వచ్చానని చెప్పారు. ప్రాజెక్టు పేరుతో రాష్ట్ర ప్రజల ధనం రూ.లక్ష కోట్లు దోపిడీ జరిగిందని ఆరోపించారు. కాళేశ్వరంపై ఇక్కడ ఉన్నవాళ్లు బీఆర్​ఎస్​ ఏటీఎం అని చెబుతున్నారని రాహుల్ గాంధీ విమర్శించారు.

Rahul Gandhi Comments on BRS Government : కాళేశ్వరం బీఆర్ఎస్​ ఏటీఎం కాదని.. కేసీఆర్‌ ఏటీఎం అని తాను చెబుతున్నానని రాహుల్ గాంధీ అన్నారు. కేసీఆర్‌ ప్రజల సంపదను దోచుకున్నారని ఆరోపించారు. అధికారంలోకి రాగానే ప్రతి నెలా మహిళల ఖాతాల్లో రూ.2,500 వేస్తామని పేర్కొన్నారు. కేసీఆర్‌ పాలనలో సిలిండర్‌ ధర రూ.1000 అని.. తాము వస్తే రూ.500కే ఇవ్వనున్నట్లు చెప్పారు. కాంగ్రెస్‌ రాగానే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.

Rahul Gandhi Speech at Kalwakurthy : కేసీఆర్‌ లూటీ చేసిన సొమ్మంతా వసూలు చేసి ప్రజలకు పంచుతాం : రాహుల్​గాంధీ

Rahul Gandhi Fires on KCR : తాము ఏర్పాటు చేసేది ప్రజల ప్రభుత్వమని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం ద్వారా మహిళలకు నెలకు రూ.4,000 ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు మధ్యే పోటీ అని స్పష్టం చేశారు. బీజేపీ, ఎంఐఎం.. బీఆర్ఎస్​కు మద్దతుగా నిలిచాయని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ఇవ్వాలని.. దొరల ప్రభుత్వాన్ని పారదోలి ప్రజా సర్కార్‌ను ఏర్పాటు చేస్తామని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, తదితరులు పాల్గొన్నారు.

Rahul Gandhi Inspected Medigadda Barrage కాళేశ్వరం బీఆర్ఎస్ ఏటీఎం కాదు కేసీఆర్‌ ఏటీఎం అని నేను చెబుతున్నా

"కేసీఆర్ దోచుకున్న సొమ్మును మహిళల ఖాతాల్లో వేస్తాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తాం. మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు రూ.2,500 ఇస్తాం. బీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీ మూడూ ఒక్కటే." - రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

  • Kaleshwaram Project = KCR Family ATM

    I visited the Medigadda barrage, which is a part of the corruption-ridden Kaleshwaram Lift Irrigation Scheme in Telangana.

    Cracks have developed in multiple pillars because of shoddy construction with reports indicating that the pillars are… pic.twitter.com/BWe8Td9mCq

    — Rahul Gandhi (@RahulGandhi) November 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదిలా ఉండగా.. రాహుల్ మేడిగడ్డ పర్యటన సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆయనతోపాటు భారీ సంఖ్యలో వచ్చిన కాంగ్రెస్‌ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు ఆందోళనకు దిగారు. భూపాలపల్లి జిల్లాలోని వివిధ గ్రామాల పర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు సహా కార్యకర్తలు ధర్నాలో పాల్గొన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు అనుమతి ఇవ్వాలని వారు డిమాండ్‌ చేశారు. బ్యారేజీ భద్రతా కారణాల దృష్ట్యా అనుమతి ఇవ్వలేమని పోలీసు తేల్చిచెప్పారు. ఎమ్మెల్యే శ్రీధర్‌ బాబు.. కార్యకర్తలకు సర్దిచెప్పడంతో వారు శాంతించారు.

'జోడో యాత్ర తర్వాత నన్ను తలచుకుని మోదీ, కేసీఆర్ ఉలిక్కిపడుతున్నారు'

'పాలమూరు జిల్లాలో ఇప్పటికీ పల్లేర్లు మొలుస్తున్నాయ్, వలసలూ ఆగలేదు కాంగ్రెస్​కు ఒక్క ఛాన్స్​ ఇచ్చి చూడండి'

Last Updated :Nov 2, 2023, 1:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.