ETV Bharat / state

Tongue Cancer Recognize Mobile : ఫొటో తీస్తే చాలు.. నోటి క్యాన్సర్​ని గుర్తించే స్మార్ట్​ఫోన్​.. త్వరలోనే అందుబాటులోకి!

author img

By ETV Bharat Telangana Team

Published : Oct 13, 2023, 5:51 PM IST

Tongue Cancer  Mobile found IIIT Hyderabad
Tongue Cancer Recognize Mobile

Tongue Cancer Recognize Mobile Details : ఆధునిక ప్రపంచంలో సాంకేతికత వేగవంతంగా అభివృద్ధి చెందుతుంది. అందులోనూ వైద్య రంగంలో ప్రతి రోజు ఏదొక మార్పు వస్తుంది. తాజాగా నోటి క్యాన్సర్​ను​ గుర్తించే స్మార్ట్​ఫోన్​ను హైదరాబాద్ ట్రిపుల్​ ఐటీలోని ఐ-హబ్​, ఐఎన్​ఏఐ ప్రతినిధులు కనుగొన్నారు. త్వరలోనే వైద్యులకు అందుబాటులోకి రానుంది.

Tongue Cancer Recognize Mobile : నోటి క్యాన్సర్లను గుర్తించే స్మార్ట్‌ఫోన్‌(Smart Phone)ను హైదరాబాద్‌ ట్రిపుల్‌ ఐటీలోని ఐ-హబ్‌, ఐఎన్‌ఏఐ ప్రతినిధులు కనుగొన్నారు. ఈ ప్రత్యేక స్మార్ట్‌ఫోన్‌ త్వరలో తెలంగాణలో ప్రభుత్వ వైద్యులకు అందుబాటులోకి రానుంది. వీరి పరిశోధనకు తెలంగాణ ప్రభుత్వం సహాయ సహకారాలు అందించింది. ఈ మొబైల్​తో నోటి కుహరం దగ్గర ఫొటో తీస్తే చాలు.. ఫోన్​లోని రూపొందించిన ఏఐ స్టాఫ్​వేర్​ క్యాన్సర్​ ఉందా.. లేదా అనే విషయాన్న గుర్తిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌తో నోటి కుహరం వద్ద ఫొటోలు తీస్తేచాలు.. ఫోన్‌లోని ఏఐ స్టాఫ్‌వేర్‌ క్యాన్సర్‌ ఉందో లేదో అనే విషయాన్ని గుర్తిస్తుంది. వ్యాధి ప్రాథమిక దశలో ఉందా? చివరిదశకు చేరుకుందా? అన్న అంశాలనూ విశ్లేషిస్తుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రబలుతున్న నోటి క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే వేగంగా గుర్తించేందుకు ఇది దోహదపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. బయాప్సీ అవసరం లేకుండానే నోటి కుహరంలో గాయాలు, చిన్న చిన్న కణాల్లో రక్తస్రావం తదితర వాటిని ఈ స్మార్ట్​ఫోన్​ ద్వారా పోటోలు తీయాలి. అనంతరం ఏఐ సాఫ్ట్​వేర్​ విశ్లేషించి క్యాన్సర్​ దశను తెలుసుకోవచ్చని తెలిపారు.

Tongue Cancer Smart Phone Founders : ఈ స్మార్ట్​ఫోన్​ రూపొందించడం వెనుక పరిశోధకుల విశేష కృషి ఉంది. బయోకాన్‌ ఫౌండేషన్‌, గ్రేస్‌ క్యాన్సర్‌ ఫౌండేషన్‌(Grace Cancer Foundation) ప్రతినిధులు కమ్యూనిటీ అవుట్‌రీచ్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాలకు వెళ్లినప్పుడు క్యాన్సర్‌ లక్షణాలు ఉన్నవారి, లేనివారి నోటి కుహర ఫొటోలు తీశారు. బయాప్సీ చేస్తే క్యాన్సర్​ కచ్చితంగా ఉందని చెప్పే లక్షణాలున్న ఫిక్టర్స్​ను ప్రత్యేకంగా తీశారు. వైద్య నిపుణులు వివేక్‌ తల్వార్‌, ప్రజ్ఞాసింగ్‌ల సూచనలతో ఆయా ఫొటోల్లో మార్పులు, చేర్పులు చేసి ఒక డేటాబేస్‌ను రూపొందించారు. ఇలా నిక్షిప్తం చేసిన రెండు వేలకుపైగా ఫొటోలను ఏఐ సాఫ్ట్‌వేర్‌కు అనుసంధానించారు.

Free Cancer Tests At Hyderabad : 'అభిమానులు, సినీ కార్మికుల కోసం ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్స్​'

How to Work Tongue Cancer Smart Phone : మొత్తం తీసిన ఫొటోల డేటాను ఆధారంగా.. కొత్తగా నోటి కుహరంలో తీసిన ఫొటోలను వాటితో పోల్చినప్పుడు.. దాన్ని విశ్లేషించి తగిన గ్రేడింగ్​లను ఇస్తుంది. క్యాన్సర్‌ను గుర్తించడంతో పాటు ఏ దశలో ఉందో నిర్ధరిస్తుంది. అలాగే క్యాన్సర్‌ నియంత్రణకు స్క్రీనింగ్‌ పరీక్షలు అవసరం కాగా.. గ్రామీణ ప్రాంతాల్లో ఇవి నిర్వహించడం కొంత కష్టమే. అయితే ఈ మొబైల్​ను అధిక సంఖ్యలో స్క్రీనింగ్​ పరీక్షలు(Screening Tests) చేయడం ద్వారా చాలా మందిలో క్యాన్సర్​ ముప్పు నుంచి తప్పించుకోవచ్చని ఐఎన్​ఏఐ సీఈవో కోనల వర్మ చెప్పారు. ఈ స్మార్ట్​ఫోన్ రూపొందించేకు రాష్ట్ర ప్రభుత్వం సాయం అందించింది. త్వరలోనే ప్రభుత్వ వైద్యలకు అందుబాటులోకి రానుంది.

Harish Rao Inaugurates Robotic Surgery Equipments : 'క్యాన్సర్‌కు చికిత్స అందించడంలో దేశంలోని అగ్రగామి రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి'

అల్లంతో క్యాన్సర్​కు విరుగుడు! రోజూ తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు

క్యాన్సర్​ రోగి కడుపులో 30 కిలోల కణితి.. వైద్యుల ఆపరేషన్​తో లక్కీగా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.