ETV Bharat / state

Harish Rao Inaugurates Robotic Surgery Equipments : 'క్యాన్సర్‌కు చికిత్స అందించడంలో దేశంలోని అగ్రగామి రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి'

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 18, 2023, 4:57 PM IST

MNJ Cancer Hospital have robotic surgery Equipments
Harish Rao Inaugurates robotic surgery Equipments

Harish Rao Inaugurates Robotic Surgery Equipments at MNJ Hospital : క్యాన్సర్‌ రోగులకు చికిత్స అందించడంలో.. దేశంలోని అగ్రగామి రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా ఉందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. హైదరాబాద్‌లోని ఎంఎన్​జే ఆసుపత్రిలో ఆత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన రోబోటిక్‌ సర్జరీ పరికరాలను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. క్యాన్సర్‌ బాధితులకు చికిత్స అందించేందుకు రూ.900 కోట్లు విడుదల చేశామన్నారు.

Harish Rao Inaugurates Robotic Surgery Equipments at MNJ Hospital in Hyderabad : క్యాన్సర్ చికిత్సలో తెలంగాణ అత్యుత్తమ ఫలితాలు సాధిస్తోందని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. హైదరాబాద్​లోని ఎంఎన్​జే ప్రభుత్వ క్యాన్సర్​ ఆసుపత్రిలో రోబోటిక్​ సర్జరీ పరికరాలను మంత్రి హరీశ్​రావు ప్రారంభించారు. దేశంలోనే మూడో అతిపెద్ద క్యాన్సర్​ ఆస్పత్రిగా అవతరించిందని కొనియాడారు. హైదరాబాద్​లోని ఎంఎన్​జే ఆసుపత్రి(MNJ Hospital)లో రూ.34 కోట్లతో ఏర్పాటు చేసిన అత్యాధునిక సౌకర్యాలు ఉన్న రోబోటిక్‌ సర్జరీ పరికరాలను మంత్రి హరీశ్​రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ రోబోటిక్ థియేటర్ ద్వారా ఎంతో మంది రోగులకు మరింత మెరుగైన సేవలు అందించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. రూపాయి ఖర్చు లేకుండా బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్లు సైతం ఎంఎన్​జే వైద్యశాలల్లో నిర్వహిస్తున్నారని వివరించారు. క్యాన్సర్​తో అవసానదశలో బాధపడుతున్న వారి కోసం పాలియేటివ్ సేవలు అందుబాటులోకి తెచ్చామన్నారు.

MNJ Cancer Hospital in Hyderabad : ఎంఎన్‌జే ప్రభుత్వ ఆసుపత్రిలో నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామని.. ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని హర్షం వ్యక్తం చేశారు. దేశంలోనే అతిపెద్ద క్యాన్సర్‌ ఆస్పత్రి ఎమ్‌ఎన్‌జే క్యాన్సర్‌ ఆస్పత్రి అని తెలిపారు. 371 మంది క్యాన్సర్‌ ఉన్న మహిళలను ఈ ఆసుపత్రిలో చేర్పించామని వివరించారు. క్యాన్సర్‌కు చికిత్స(Cancer Treatment) అందించడంలో దేశంలోనే అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా ఉందని చెప్పారు. రోగులకు హోమ్‌ కేర్‌ సర్వీస్‌నూ అందిస్తున్నామన్న విషయం గుర్తు చేశారు.

Harish Rao Fires on BJP and Congress : 'కేసీఆర్​ ప్రజలని నమ్ముకుంటే.. బీజేపీ జమిలి ఎన్నికలను నమ్ముకుంది'

Robotic Equipments in MNJ Cancer Hospital : క్యాన్సర్‌ రోగుల చికిత్స కోసం రూ.900 కోట్లు విడుదల చేశామని పేర్కొన్నారు. ఆరోగ్య మహిళా కేంద్రాల్లో మహిళలకు ఉచితంగా పరీక్షలు చేసి మందులు ఇస్తున్నామని అన్నారు. గతంలో ఈ ఆసుపత్రిలో మూడు థియేటర్లు మాత్రమే ఉండేవని గుర్తు చేశారు. అవి కూడా 60 సంవత్సరాల క్రితం ప్రారంభించినవని అన్నారు. గతంలో రాష్ట్రాన్ని పాలించిన పాలకులు ఎంఎన్​జే ఆసుపత్రిని అభివృద్ధి చేయాలని ఆలోచించలేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ నాయకత్వంలో అభివృద్ధి చేసేందుకు రూ.120 కోట్లు మంజూరు చేశారని తెలిపారు.

"రోజులు గడుస్తున్న కొద్దీ కొత్త కొత్త క్యాన్సర్​లతో బాధపడుతున్న రోగులు పెరుగుతున్నారు. అందువల్ల దీనికి అవసరమైన టెక్నాలజీని అభివృద్ధి చేయాలి. అధునాతన సౌకర్యాలు అందించేందుకు ఎంఎన్​జే ఆసుపత్రికి రూ.120 కోట్లు కేటాయించాం. ఈ నిధులతో రాష్ట్రంలో క్యాన్సర్​ రోగుల ప్రత్యేక వైద్యశాలగా అభివృద్ధి చేస్తున్నాం. ఇందులో భాగంగా ఇవాళ రూ.34 కోట్లతో రోబోటిక్​ పరికరాలను ప్రారంభించాం." - హరీశ్‌రావు, వైద్యారోగ్య శాఖ మంత్రి

Harish Rao Inaugurates Robotic Surgery Equipments క్యాన్సర్‌కు చికిత్స అందించడంలో దేశంలోని అగ్రగామి రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి

Harishrao Distributes Gruhalakshmi Documents : తిట్ల ప్రభుత్వం కావాలా?.. కిట్ల ప్రభుత్వం కావాలా?

Harish Rao Fires on Congress : 'బీఆర్​ఎస్ చేసిన అభివృద్ధికి.. కాంగ్రెస్‌ చెబుతున్న అబద్దాలకు పోటీ'

Harish Rao Fires on Opposition Parties : 'పని చేసే నోబెల్స్‌కు, దుష్ప్రచారం చేసే గోబెల్స్‌కు మధ్యే వచ్చే ఎన్నికల్లో పోటీ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.