ETV Bharat / state

శ్వేతపత్రం మమ్మల్ని బద్నాం చేసేందుకేనన్న బీఆర్​ఎస్ - వాస్తవాలు ప్రజలముందుంచామన్న అధికారపక్షం

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 20, 2023, 8:19 PM IST

Deputy CM Bhatti Vikramarka in Assembly Session
Telangana Assembly Session 2023

Telangana Assembly session 2023 : శాసనసభ వేదికగా ఆర్థిక స్థితిగతులపై ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంపై వాడీవేడీ చర్చ జరిగింది. తమను బద్నాం చేసేందుకే ప్రభుత్వం శ్వేతపత్రం విడుదలచేసిందని ప్రధాన విపక్షం బీఆర్​ఎస్​ ఆక్షేపించగా వాస్తవాలను ప్రజలముందుంటే ప్రయత్నమేనని ప్రభుత్వం వివరణ ఇచ్చింది.

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ శ్వేతపత్రంపై అధికార, విపక్షాల మధ్య వాడీవేడీ చర్చలు

Telangana Assembly Session 2023 : తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై శాసనసభలో శ్వేతపత్రం(White Paper) విడుదల చేసిన ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క స్వల్పకాలిక చర్చను ప్రారంభించారు. బీఆర్​ఎస్​ పదేళ్ల హయాంలో రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను ఛిద్రమైందని ఆరోపించారు. రోజూవారీ ఖర్చులకు ఓడీపై ఆధారపడాల్సిన దుస్థితికి దిగజార్చారని ధ్వజమెత్తారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని పెదవివిరిచారు.

Deputy CM Bhatti Vikramarka in Assembly Session : రాష్ట్రాన్ని ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్లడంపై చర్చిద్దామని మంత్రి భట్టి విక్కమార్క సూచించారు. అంకెల గారడీతో 9 ఏళ్లు ప్రజలను మోసం చేశారని విమర్శించారు. గత ప్రభుత్వం ఆర్థిక ప్రణాళిక (Financial planning) లేకుండా ఖర్చు చేసి రాష్ట్రానికి నష్టం చేశారని ఆరోపించారు. 1956 నుంచి 2014 వరకు తక్కువ ఖర్చుతోనే భారీ ప్రాజెక్టుల నిర్మాణం జరిగిందని గుర్తు చేశారు.

శ్వేతపత్రం విడుదలను తప్పుపట్టిన అక్బరుద్దీన్‌ - కౌంటర్ ఇచ్చిన మంత్రి శ్రీధర్‌ బాబు

Congress vs BRS in Assembly Session : కాంగ్రెస్‌ సర్కార్‌ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై విడుదల చేసిన శ్వేతపత్రం పూర్తి తప్పులతడక, అంకెల గారడీగా బీఆర్​ఎస్​ విమర్శించింది. గ్యారంటీల నుంచి తప్పించుకునేందుకు సాకులు వెతుక్కుంటున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు(Harish Rao) ఆక్షేపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి భేషుగ్గా ఉందని అనేక ప్రభుత్వ సంస్థలు చెప్పాయని హరీశ్‌రావు అన్నారు. దివాళా తీస్తుందనే దుష్ప్రచారం రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. పెట్టుబడులు తరలిపోతే పర్యవసానాలు దారుణంగా ఉంటాయన్న హరీశ్ రావు, కూర్చున్న కొమ్మను నరుక్కునే అవివేకమైన చర్యగా అభివర్ణించారు.

MLA Madan Mohan Rao Statements in Assembly : బీఆర్​ఎస్​ పాలనలో అన్ని వర్గాల ప్రజలు పేదరికంలో మగ్గిపోయారని కాంగ్రెస్‌ సభ్యులు, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌ రావు విమర్శించారు. గత పాలకులు వాస్తవాలను మరుగునపెట్టి ప్రజలను మభ్యపెట్టారని ధ్వజమెత్తారు.

శ్వేతపత్రం ఒక తప్పుల తడక, అంకెల గారడీ : హరీశ్‌రావు

BJP in Assembly Session 2023 : అర్థిక శ్వేతపత్రంపై జరిగిన చర్చలో పాల్గొన్న బీజేపీ గత ప్రభుత్వం, కేంద్రంపై నెపం నెట్టడాన్ని ఆక్షేపించింది. రూ. లక్షల కోట్లు కేంద్రం నుంచి సాయం పొందింది నిజం కాదా అని ఆ పార్టీ సభ్యులు మహేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు సహా మిగతా హామీలను ఎలా నెరవేరుస్తుందో స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Telangana Assembly Session Latest News : రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం ప్రకటించడం మంచిదేనన్న సీపీఐ(CPI) శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, ఇబ్బడిముబ్బడిగా అప్పులు ఎవరు చేసినా తప్పేనని పేర్కొన్నారు. ఫలాలను క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లడంలో గత ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. ప్రాజెక్టులు కట్టామని చెప్పడం కాదు, వాటి వల్ల ప్రజలకు ఏలాంటి ప్రయోజనం కలిగిందనేది ముఖ్యమని అన్నారు. సంపద అంతా కొద్దీ మంది చేతిలో మిగిలిపోయి అసమానతలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ఆర్థిక సంస్థలను తప్పుదోవ పట్టించి - రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారు : సీఎం రేవంత్‌ రెడ్డి

ఎన్ని సంవత్సరాలు కష్టపడినా నిన్ను సీఎంని చేయరు : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.