ఎన్ని సంవత్సరాలు కష్టపడినా నిన్ను సీఎంని చేయరు : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

By ETV Bharat Telangana Team

Published : Dec 20, 2023, 3:59 PM IST

thumbnail

Komatireddy Rajagopal Reddy Comments on Harish Rao : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా జరుగుతున్నాయి. కాంగ్రెస్​, బీఆర్ఎస్​ నాయకుల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. కాంగ్రెస్​ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ మాజీ మంత్రి హరీశ్​రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ​ఎంత బాగా పనిచేసినా హరీశ్​కు మాజీ సీఎం కేసీఆర్​ ముఖ్యమంత్రి పదవి ఇవ్వరని వ్యాఖ్యానించారు. 

Komatireddy Rajagopal Reddy vs Harish Rao : అసెంబ్లీలో ఎంత గట్టిగా మాట్లాడినా మంత్రి పదవి రాదని హరీశ్​ రావు తనపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారని రాజగోపాల్​ రెడ్డి మండిపడ్డారు. దీనికి బదులుగా ఆయన కేసీఆర్​ తరువాత బీఆర్​ఎస్ నుంచి కేటీఆర్​ సీఎం అవుతారే తప్పా హరీశ్ ఎంత కష్టపడి పనిచేసినా సీఎంని చేయరని ఎద్దేవా చేశారు. తండ్రి, కుమారులు హరీశ్​ను వాడుకుంటారే తప్పా, ​న్యాయం చేయరని తెలిపారు. తన మంత్రి పదవి గురించి కాంగ్రెస్​ నాయకత్వం ఆలోచిస్తుందని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.