ETV Bharat / state

Revanth Reddy on joinings : 'కాంగ్రెస్‌లో చేరికలు గాలివాటంతో కూడినవి కావు'

author img

By

Published : Jun 16, 2023, 3:48 PM IST

Revanth Reddy on Congress joinings : కేసీఆర్ దోపీడికి 4 కోట్ల మంది ప్రజలు బలి అయ్యారని రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్లలో ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను.. ముఖ్యమంత్రి బొందలగడ్డగా మార్చారని దుయ్యబట్టారు. సీఎం అరాచక పాలనను భరించే ఓపిక రాష్ట్ర ప్రజలకు లేదని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌లో చేరికలు గాలివాటంతో కూడినవి కావని స్పష్టంచేశారు.

Revanth Reddy
Revanth Reddy

BRS Leader to Join Congress : ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలంగాణను పాలించే అర్హత లేదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్‌లో చేరికలు గాలివాటంతో కూడినవి కావని స్పష్టంచేశారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్‌కు చెందిన పలువురు నేతలు.. రేవంత్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. అచ్చంపేట నియోజకవర్గానికి చెందిన బీఆర్‌ఎస్‌ సీనియర్ నాయకుడు, న్యాయవాది గంగాపురం రాజేందర్, మాజీ జడ్పీటీసీ భీముడు నాయక్, అచ్చంపేట, చారగొండ మండలాల కార్యకర్తలు గాంధీభవన్‌లో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

Revanth Reddy Fires on KCR : కేసీఆర్ దోపిడీకి 4 కోట్ల మంది ప్రజలు బలి అయ్యారని రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పదేళ్లలో ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను ముఖ్యమంత్రి.. బొందలగడ్డగా మార్చారని విమర్శించారు. సీఎం అరాచక పాలనను భరించే ఓపిక రాష్ట్ర ప్రజలకు లేదని.. కేసీఆర్ నుంచి తెలంగాణకు విముక్తి కలిగించేందుకే.. ఈ చేరికలు జరుగుతున్నాయని అన్నారు. ఇవన్నీ కూడా తెలంగాణలో కేసీఆర్ వ్యతిరేక రాజకీయ పునరేకీకరణ కోసమేనని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

కేసీఆర్ పుట్టకపోతే రాష్ట్రం వచ్చేది కాదని కేటీఆర్ అన్నారని.. కానీ ఆయన పుట్టకముందే తెలంగాణ ఉద్యమం పుట్టిందని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. పాలమూరు బిడ్డ చిన్నారెడ్డి అప్పట్లో ఉద్యమం నడిపారని తెలిపారు. ఎలక్షన్లు, కలెక్షన్ల కోసమే 2001లో ముఖ్యమంత్రి పార్టీ పెట్టారని విమర్శించారు. ఈ క్రమంలోనే 22 సంవత్సరాలు జెండా మోసిన గంగాపురం రాజేందర్‌కు న్యాయం జరిగిందా అని ప్రశ్నించారు. నల్లమల అడవుల్లో అచ్చంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని రేవంత్‌రెడ్డి వివరించారు.

హైదరాబాద్‌లో తాగు నీటి సమస్య తీర్చిన ఘనత పీజేఆర్ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. వందలాది ఐటీ కంపెనీలను నగరానికి తెచ్చింది కాంగ్రెస్ అని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే రాష్ట్రానికి కేసీఆర్ ఛార్లెస్ శోభరాజ్‌లా, హరీశ్‌, కేటీఆర్ బిల్లా-రంగాలా తయారయ్యారని విమర్శించారు. పార్టీ కార్యకర్తలంతా.. తెలంగాణ ప్రజల కోసం సమయం కేటాయించాలని అన్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని రేవంత్‌రెడ్డి పునురుద్ఘాటించారు.

"ఈ చేరికలు గాలివాటం చేరికలు కాదు. ఇక కేసీఆర్ అరాచక పాలన భరించే ఓపిక ప్రజలకు లేదు. రాష్ట్రానికి కేసీఆర్ నుంచి విముక్తి కలిగించేందుకే ఈ చేరికలు. ఇక తెలంగాణను పాలించే అర్హత కేసీఆర్‌కు లేదు. కేసీఆర్ దోపీడికి 4కోట్ల మంది ప్రజలు బలయ్యారు. కేసీఆర్ పుట్టకపోతే రాష్ట్రం వచ్చేది కాదని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ పుట్టకముందే తెలంగాణ ఉద్యమం పుట్టింది. పాలమూరు బిడ్డ చిన్నారెడ్డి అప్పట్లో ఉద్యమం నడిపారు. అచ్చంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరాలి." - రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

రాష్ట్రాన్ని పాలించే అర్హత కేసీఆర్‌కు లేదు

ఇవీ చదవండి: BRS Leader to Join Congress : బీఆర్​ఎస్​కు షాక్​... కాంగ్రెస్​లో చేరనున్న మరో కీలక నేత

మన యువతను గాలికొదిలి.. మహారాష్ట్ర వాళ్లకు ఉద్యోగాలు : రేవంత్‌రెడ్డి

REVANTH REDDY: 'ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చాక.. సంతలో ప్రశ్నపత్రాలు అమ్ముతున్నారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.