ETV Bharat / state

మన యువతను గాలికొదిలి.. మహారాష్ట్ర వాళ్లకు ఉద్యోగాలు : రేవంత్‌రెడ్డి

author img

By

Published : May 6, 2023, 2:18 PM IST

Revanth Reddy Interesting Comments: తెలంగాణలోనూ కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని రేవంత్​రెడ్డి స్పష్టం చేశారు. నిరుద్యోగులకు అండగా ఉండే బాధ్యత తమ పార్టీపై ఉందన్నారు. కేసీఆర్‌.. తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వరని.. బీఆర్​ఎస్​లో చేరిన మహారాష్ట్ర యువకుడికి ఉద్యోగం ఇచ్చారని ఆయన ఆరోపించారు.

Revanth Reddy
Revanth Reddy

Revanth Reddy Interesting Comments: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి స్పష్టం చేశారు. అక్కడ అన్ని సర్వేలు తమ పార్టీకి అనుకూలంగా వస్తున్నాయని పేర్కొన్నారు. తాను హవేలీ నియోజకవర్గం ఇంఛార్జ్​గా ప్రచారం చేశానని వివరించారు. తెలంగాణ నేతలు చాలామంది కర్ణాటకలో ప్రచారం నిర్వహించారని అన్నారు.

Revanth Reddy Comments on CM KCR : ఈనెల 8న హైదరాబాద్‌కు ప్రియాంకగాంధీ రానున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణలోనూ కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు అండగా ఉండే బాధ్యత కాంగ్రెస్‌పై ఉందని స్పష్టం చేశారు. కేసీఆర్‌.. తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వరని మండిపడ్డారు. బీఆర్ఎస్​లో చేరిన మహారాష్ట్ర యువకుడికి ఉద్యోగం ఇచ్చారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

శ్వేతపత్రం విడుదల చేయాలి: మరోవైపు రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా.. సీఎం కేసీఆర్‌ మహారాష్ట్రకు చెందిన వ్యక్తిని తన సెక్రెటరీగా నియమించుకున్నారని పేపర్‌ లీక్‌ వ్యతిరేక పోరాట కమిటీ ఛైర్మన్‌ మల్లు రవి ఆరోపించారు. అతనికి నెలకు లక్షన్నర రూపాయల జీతం ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. ఇది ముమ్మాటికి ఇక్కడి యువతను అవమాన పరిచినట్లేనని విమర్శించారు. ఇలాంటి దొంగ జీవోలు ఇంకా ఎన్ని ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని మల్లురవి డిమాండ్ చేశారు.

సరూర్​నగర్​లో నిర్వహిస్తున్న కాంగ్రెస్ నిరుద్యోగ నిరసన సభకు.. పెద్ద ఎత్తున్న యువత, విద్యార్థులు తరలివచ్చి విజయవంతం చేయాలని మల్లు రవి పిలుపునిచ్చారు. 15 పేపర్లు లీకైతే.. తిరిగి అదే కమిటీతో పరీక్షలు నిర్వహించాలని చూడడంలో అర్థం లేదని ధ్వజమెత్తారు. పూర్తిగా ప్రక్షాళన చేసిన తరువాతనే పరీక్షలు నిర్వహించాలని మల్లు రవి డిమాండ్‌ చేశారు.

ప్రియాంక గాంధీ హైదరాబాద్ టూర్ షెడ్యూల్: ఈనెల 8న సాయంత్రం ప్రియాంక గాంధీ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఎల్బీనగర్ కూడలికి చేరుకొని.. అక్కడ శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత సరూర్​నగర్ ఇండోర్ స్టేడియానికి చేరుకుంటారు.

Priyanka Gandhi Hyderabad Tour : ఈ నేపథ్యంలో ఆమెను స్వాగతించడానికి పెద్ద ఎత్తున యువతీయువకులు తరలిరావాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ సభలో యువత విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రియాంక గాంధీ ఎండగడతారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక యువతను ఆదుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో డిక్లరేషన్ ప్రకటిస్తున్నారని హస్తం నేతలు వెల్లడించారు.

ఇవీ చదవండి: Bhatti people's March Today : 'అధికారంలోకి వస్తే రూ.500కే గ్యాస్ ​సిలిండర్'

'ఖర్గే ఫ్యామిలీని హత్య చేసేందుకు బీజేపీ కుట్ర.. మోదీ మౌనం ఎందుకు?'

కర్ణాటకలో మోదీ ప్రచార జోరు.. బెంగళూరులో 26 కి.మీ మెగా రోడ్​ షో.. తరలివచ్చిన కార్యకర్తలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.