ETV Bharat / state

Revanth Reddy on KCR : 'త్యాగాల తెలంగాణలో కేసీఆర్‌ దోపిడిని భరించాల్సిన అవసరం లేదు'

author img

By

Published : Jun 3, 2023, 3:38 PM IST

Revanth Reddy Fires on KCR : రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబమే పదేళ్లుగా పాలిస్తూ.. అడ్డగోలుగా దోచుకుంటున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. త్యాగాల తెలంగాణలో ముఖ్యమంత్రి దోపిడిని భరించాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్‌తోనే తెలంగాణ ఆకాంక్షలు నెరవేరుతాయని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

Revanth Reddy
Revanth Reddy

Revanth Reddy Comments on KCR : తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ఆశయాలు కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తేనే నెరవేరతాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధిలో ఎన్‌ఆర్‌ఐలు కూడా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. అమెరికా న్యూజెర్సీలో జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. కేసీఆర్ దోపిడీని ఇంకా ఎంతకాలం భరించాలని ఆయన ప్రశ్నించారు. అన్ని వర్గాల ప్రజల పోరాటాలు వల్లనే రాష్ట్రం ఏర్పాటైందని పేర్కొన్నారు.

అడ్డగోలుగా దోచుకుంటున్నారు : నిరుద్యోగ యువత బలిదానాలను చూసి చలించిపోయిన సోనియాగాంధీ తెలంగాణను ఇచ్చారని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. కానీ రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబమే పదేళ్లుగా పాలిస్తూ.. అడ్డగోలుగా దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. ఈ క్రమంలోనే రాజకీయాలను అవినీతిమయం చేశారని ఆక్షేపించారు. అమెరికాలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో తాను పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

తెలంగాణలో 9ఏళ్ల పాలనలో కేసీఆర్.. రూ.5 లక్షల కోట్లు అప్పులు చేశారని రెేవంత్‌రెడ్డి ఆరోపించారు. మరోవైపు రూ.17 లక్షల కోట్లు పన్నుల ద్వారా సమకూరాయని తెలిపారు. అయినా మొత్తం రూ.22 లక్షల కోట్లు ఖర్చు చేసినా కూడా.. రాష్ట్ర ప్రజల సగటు జీవితంలో ఎలాంటి మార్పులు రాలేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదని దుయ్యబట్టారు.

Revanth Reddy Comments on BRS : తెలంగాణ కోసం పోరాటం చేసినట్లు చెప్పిన బీఆర్‌ఎస్‌కు రెండు సార్లు ప్రజలు అవకాశం ఇచ్చారని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. అయిన కేసీఆర్ ప్రజల ఆశలకు, ఆశయాలకు అనుగుణంగా పాలన చేయలేదని ఆక్షేపించారు. ఈ క్రమంలోనే జూన్ 4న న్యూయార్క్‌లోని జాకబ్ జవిట్స్ స్టేడియంలో జరగనున్నఇండియన్ ఓవర్సిస్ కాంగ్రెస్ సభ ఏర్పాట్లను రేవంత్‌రెడ్డి, హర్యానా రాజ్యసభ సభ్యులు దిపేందర్ హుడా, చామల కిరణ్ కుమార్‌ రెడ్డి పరిశీలించారు. ఈ సభలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొని భారతీయులను ఉద్దేశించి ప్రసంగిస్తారని రేవంత్‌ తెలిపారు.

"తెలంగాణలో ప్రశ్నించే దిక్కు లేదు. దీనికి కారణం కేసీఆర్. తెలంగాణను తెచ్చినని చెప్పుకున్న కేసీఆర్‌కు ప్రజలు రెండు సార్లు అవకాశం ఇచ్చారు. ఈ పదేళ్లలో రూ.22 లక్షలు ఖర్చు చేశారు. అయినా రాష్ట్ర ప్రజల సగటు జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదు. దీనిపై ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. కేసీఆర్ దోపిడీని ఇంకా ఎంతకాలం భరించాలి. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. కేసీఆర్ కుటుంబమే పదేళ్లుగా పాలిస్తూ.. అడ్డగోలుగా దోచుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు." - రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

త్యాగాల తెలంగాణలో కేసీఆర్‌ దోపిడిని భరించాల్సిన అవసరం లేదు

మన యువతను గాలికొదిలి.. మహారాష్ట్ర వాళ్లకు ఉద్యోగాలు : రేవంత్‌రెడ్డి

REVANTH REDDY: 'ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చాక.. సంతలో ప్రశ్నపత్రాలు అమ్ముతున్నారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.