Revanth Reddy Comments On KCR : 'బీజేపీని కాపాడేందుకే.. కేసీఆర్​ ప్రయత్నం చేస్తున్నారు'

author img

By

Published : May 18, 2023, 6:19 PM IST

Updated : May 18, 2023, 7:56 PM IST

Revanth Reddy

Revanth Reddy Fires On BJP And BRS : కర్ణాటకలో కాంగ్రెస్‌ది గెలుపే కాదంటూ బీజేపీను కాపాడేందుకు కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. బీజేపీ, బీఆర్​ఎస్​ వేర్వేరు కాదని.. కర్ణాటక ఫలితాలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని కేసీఆర్‌ చెప్పటమే దీనికి నిదర్శనమన్నారు. క్షణికావేశంలో కాంగ్రెస్‌ను వీడిన వారందరూ తిరిగి రావాలని రేవంత్‌రెడ్డి కోరారు. ఈ సమావేశంలో పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.

Revanth Reddy Fires On BJP And BRS : కర్ణాటకలో కాంగ్రెస్​ గెలుపు.. గెలుపే కాదని కేసీఆర్​ అంటున్నారని.. ఈ విధంగా బీజేపీ ఓటమిని ఆయన ఒప్పుకోవడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్​లోని గాంధీభవన్​లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రేవంత్​ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్​ఎస్​, బీజేపీలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో వీహెచ్​, షబ్బీర్​ అలీ, అంజన్​ కుమార్​ యాదవ్​, పొన్నం ప్రభాకర్​, సిరిసిల్ల రాజయ్య, రాముల నాయక్​ వంటి ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

దేశంలో మోదీ బ్రాండ్​కు కాలం చెల్లింది : కర్ణాటక ప్రజలు ఇచ్చిన తీర్పుపై దేశం నలుమూలలా చర్చ సాగుతోందని రేవంత్​ రెడ్డి తెలిపారు. ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా.. నలుగురు చర్చించుకున్నా ఇదే అంశంపై ప్రస్తావనకు వస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇక దేశంలో మోదీ బ్రాండ్​కు కాలం చెల్లిందని.. ఈడీ, సీబీఐ దాడులు ద్వారా ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టి నెగ్గాలని ప్రధాని చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని ఆరోపించారు. దిల్లీలో పాలన గాలికొదిలేసి మోదీ, అమిత్​ షా, కేంద్ర మంత్రులు 20 రోజుల పాటు కర్ణాటకలో తిష్టవేసినా ఫలితం మాత్రం శూన్యంగానే వచ్చిందని విమర్శించారు.

కర్ణాటక గెలుపుపై కేసీఆర్​ హాస్యం : అలాగే బుధవారం జరిగిన బీఆర్​ఎస్​ సర్వసభ్య సమావేశంలో కర్ణాటక ఫలితాలను పట్టించుకోవాల్సిన అవసరమే లేదని కేసీఆర్​ వ్యాఖ్యానించడం దేనికి సంకేతమని రేవంత్​ రెడ్డి ప్రశ్నించారు. ఇది ఒక గెలుపేనా అని హాస్యాస్పదం చేయడం ఏంటని.. అసలు కేసీఆర్​ ఆలోచన ఏంటో అన్నారు. మరోవైపు కర్ణాటక ఫలితాలు అనంతరం తెలంగాణపై ప్రభావమే ఉండవని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ అంటున్నారని వివరించారు. సంజయ్​ చెప్పి నాలుగు రోజులు తర్వాత కూడా కేసీఆర్​ ఇదే మాట చెప్పడం వెనుక బీజేపీ, బీఆర్​ఎస్​ వేర్వేరు కాదని అర్థమవుతోందని అన్నారు.

కాంగ్రెస్​ పార్టీ అందరినీ ఆహ్వానిస్తుంది : వివేక్​, విశ్వేశ్వర రెడ్డి, రాజగోపాల్​ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి, ఈటల రాజేందర్​ లాంటి నేతలందరికీ కాంగ్రెస్​ పార్టీ ఆహ్వానం పలుకుతోందని రేవంత్​ రెడ్డి ప్రత్యేకంగా చెప్పారు. కేసీఆర్​ను గద్దె దించడానికి.. అంతా ఖర్గే, సోనియా నాయకత్వంలో కలిసి పనిచేద్దాం రండి అని మిత్రులందరికీ విజ్ఞప్తి చేశారు. కుటుంబ పెద్దగా నన్నేమన్నా పెద్దగా పట్టించుకోను.. నావల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటే పార్టీ పెద్దలు మాట్లాడతారన్నారు. తెలంగాణ అభ్యున్నతి కోసం అందరం కలిసి పనిచేద్దాం.. ఇదే తన సాదర స్వాగతం అని పిలుపునిచ్చారు.

"కర్ణాటకలో కాంగ్రెస్‌ది గెలుపే కాదంటూ బీజేపీను కాపాడేందుకు కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్​ఎస్​ 25 సీట్లు కూడా దాటవు. కర్ణాటక ఫలితాలే తెలంగాణలో వస్తాయి. అన్ని వర్గాలకు కాంగ్రెస్​కు మద్దతిస్తున్నాయి. కర్ణాటక ఫలితాలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని కేసీఆర్‌ చెప్పటమే ఏంటి? క్షణికావేశంలో కాంగ్రెస్‌ను వీడిన వారందరూ తిరిగి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాను." -రేవంత్​రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

ఇవీ చదవండి:

Last Updated :May 18, 2023, 7:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.