ETV Bharat / state

రాష్ట్రంలో భాజపా బాధ్యతలు గవర్నర్ నిర్వహించాలనుకుంటే కష్టం: రేవంత్​రెడ్డి

author img

By

Published : Nov 9, 2022, 8:08 PM IST

Revanth Comments On Governor Tamilisai
Revanth Comments On Governor Tamilisai

Revanth Comments On Governor Tamilisai: ప్రభుత్వం పరిపాలన నిర్వహించడానికి అవసరమైన రాజ్యాంగబద్ధమైన వ్యవస్థల్ని గౌరవించాలని రేవంత్​రెడ్డి స్పష్టం చేశారు. అనుమానాలను నివృత్తి చేసుకొని బిల్లులను అమోదింపజేసుకొని.. ప్రజలకు పరిపాలన అందించాలని రేవంత్​రెడ్డి సూచించారు.

Revanth Comments On Governor Tamilisai: ప్రజా సమస్యలపై దృష్టి మరల్చేందుకు తెరాస-భాజపాలు కలిసి బిల్లుల ఆమోదంపై రాజకీయాలు చేస్తున్నాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి ఆరోపించారు. గవర్నర్‌ కూడా ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం సరికాదని తెలిపారు. రాష్ట్రంలో భాజపా బాధ్యతలు గవర్నర్ నిర్వహించాలనుకుంటే కష్టమని చెప్పారు. బండి సంజయ్, కిషన్​రెడ్డి పాత్ర గవర్నర్ తమిళిసై పోషించాలనుకోవడం అనేది సమజసం కాదని హితవు పలికారు.

అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన నిర్వహించడానికి అవసరమైన రాజ్యాంగబద్ధమైన వ్యవస్థల్ని.. సంస్థలను గౌరవించాలని రేవంత్​రెడ్డి పేర్కొన్నారు. అనుమానాలను నివృత్తి చేసుకొని బిల్లులను ఆమోదింపజేసుకొని.. ప్రజలకు పరిపాలన అందించాలని సూచించారు. కానీ వీరిద్దరి వ్యవహారం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఫలితంగా గవర్నర్ వచ్చిన నష్టం లేదు.. కేసీఆర్​కు వచ్చిన కష్టం లేదని ఎద్దేవా చేశారు. ఇకనైనా చిల్లర రాజకీయాలు భాజపా, తెరాస మానుకోవాలని రేవంత్​రెడ్డి హితవు పలికారు

"గవర్నర్ తమిళిసై ప్రతి విషయాన్ని పారదర్శకంగా చూడాలి. రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో భాజపా నాయకులు సన్యాసులని నిన్న, మొన్న వీడియోలలో వచ్చింది. వారి బాధ్యతలు గవర్నర్ నిర్వహించాలనుకుంటే కష్టం. బండి సంజయ్, కిషన్​రెడ్డి పాత్ర గవర్నర్ తమిళిసై పోషించాలనుకోవడం అనేది సమజసం కాదు. అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన నిర్వహించడానికి అవసరమైన రాజ్యాంగబద్ధమైన వ్యవస్థల్ని, సంస్థలను గౌరవించాలి. అనుమానాలను నివృత్తి చేసుకొని ఆ బిల్లులను అమోదింపజేసుకొని ప్రజలకు పరిపాలన అందించాలి. గవర్నర్​కు వచ్చిన నష్టం లేదు. కేసీఆర్​కు వచ్చిన కష్టం లేదు. చిల్లర రాజకీయాలు భాజపా, తెరాస మానుకోవాలి." -రేవంత్​రెడ్డి పీసీసీ అధ్యక్షుడు

రాష్ట్రంలో భాజపా బాధ్యతలు గవర్నర్ నిర్వహించాలనుకుంటే కష్టం: రేవంత్​రెడ్డి

ఇవీ చదవండి: నా ఫోన్ ట్యాప్‌ అవుతుందనే అనుమానం ఉంది.. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతోంది: గవర్నర్‌

నేను ఎలాంటి బిల్లులను ఆపలేదు: గవర్నర్‌ తమిళిసై

పరుగు పందెం గెలిచి.. వైకల్యాన్ని ఓడించిన విద్యార్థి.. వీడియో వైరల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.