ETV Bharat / bharat

పరుగు పందెం గెలిచి.. వైకల్యాన్ని ఓడించిన విద్యార్థి.. వీడియో వైరల్

author img

By

Published : Nov 9, 2022, 6:46 PM IST

సాధించాలన్న పట్టుదల ఉంటే వైకల్యాన్ని సైతం జయించవచ్చని ఓ విద్యార్థి నిరూపించాడు. రేసులో పాల్గొనలేని పరిస్థితిలోనూ ట్రాక్​పై పరుగులుపెట్టి అందరిని ఆశ్చర్యపరిచాడు. విద్యార్థి ధైర్యాన్ని చూసి మురిసిపోయిన టీచర్లు... అతన్ని ప్రోత్సహించి గెలిపించారు. ఈ ఘటన కేరళలోని మలప్పురంలో జరిగింది.

differently abled student  participates running race in kerala
differently abled student participates running race in kerala

కేరళ మలప్పురంలోని పన్తళ్లూర్​లోని ఓ హైస్కూల్​కు చెందిన అష్రఫ్ అనే పదో తరగతి విద్యార్థి.. తన 'మానసిక వైకల్యం' కారణంగా పాఠశాలలో జరుగుతున్న క్రీడా పోటీల్లో పాల్గొనలేకపోయాడు. దీంతో నిరాశ చెందిన ఆ విద్యార్థిని ప్రోత్సహించేందుకు తన టీచర్లు అతనికి పోటీల్లో పాల్గొనేందుకు అవకాశం ఇచ్చారు. అలా ట్రాక్​ మొత్తం సంతోషంగా పరుగులుతీసిన అష్రఫ్​ ఆఖరికి ఫినిష్​ లైన్​కు చేరుకున్నాడు. తన కృషికి మెచ్చిన స్కూల్​ యాజమాన్యం అతనికి మెడల్​తో పాటు బొకే ఇచ్చి సత్కరించింది.

కేరళ విద్యాశాఖ మంత్రి వి.శివన్​ కుట్టి మంగళవారం దీనికి సంబంధిన ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేయగా.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆ స్కూల్​ యాజమాన్యాన్ని కొనియాడారు. అష్రఫ్ విజయంలో పాలు పంచుకున్న తోటి విద్యార్థులతో పాటు స్కూల్​ టీచర్లను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి:వేరే కులం వ్యక్తితో ప్రేమ.. మైనర్​ కూతురిని కాలువలో తోసేసి చంపిన తండ్రి

నకిలీ బ్యాంక్​తో భారీ స్కామ్.. 10 బ్రాంచ్​లు నడుపుతూ కోట్లు మోసం.. చివరకు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.