ETV Bharat / sports

Diamond League Final 2023 Neeraj Chopra : నీరజ్‌ చోప్రాకు నిరాశ.. ఈ సారి డైమండ్ లీగ్ విజేత ఎవరంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 17, 2023, 6:36 AM IST

Updated : Sep 17, 2023, 7:12 AM IST

Diamond League Final 2023 Neeraj Chopra : రెండో స్థానంతో సరిపెట్టుకున్న నీరజ్‌ చోప్రా.. ఈ సారి డైమండ్ లీగ్ విజేత ఎవరంటే?
Diamond League Final 2023 Neeraj Chopra : రెండో స్థానంతో సరిపెట్టుకున్న నీరజ్‌ చోప్రా.. ఈ సారి డైమండ్ లీగ్ విజేత ఎవరంటే?

Diamond League Final 2023 Neeraj Chopra : ఈ ఏడాది ప్రపంచ అథ్లెటిక్స్‌లో గోల్డ్​ మెడల్​ సాధించి చరిత్ర సృష్టించిన భారత స్టార్‌ జావెలిన్‌ త్రో అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా.. ఇప్పుడు డైమండ్‌ లీగ్‌ టైటిల్‌ కోసం బరిలో దిగుతున్నాడు. మరి ఈ పోరులో అతడు నెగ్గడంతో పాటు తన 90 మీటర్ల లక్ష్యాన్ని చేరుకుంటాడో లేదో చూడాలి..

Diamond League Final 2023 Neeraj Chopra : భారత స్టార్‌ జావెలిన్‌ త్రో అథ్లెట్‌ నీరజ్‌ చోప్రాకు తన లక్ష్యాన్ని చేరుకోలేకపోయాడు. తాజాగా జరిగిన ప్రతిష్ఠాత్మక డైమండ్‌ లీగ్‌ టైటిల్​లో తన 90 మీటర్ల లక్ష్యాన్ని చేరుకోకపోవడంతో పాటు కనీసం టైటిల్​ను కూడా నెగ్గలేకపోయాడు. ఫైనల్​లో రెండో స్థానంలో సరిపెట్టుకున్నాడు. ఈ పోటీల్లో చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన జాకబ్‌ వాద్లెచ్‌ ఛాంపియన్‌గా నిలిచాడు(Diamond league final winner).

అమెరికా వేదికగా శనివారం జరిగిన టైటిల్ మ్యాచ్‌లో నీరజ్‌ జావెలిన్‌ను 83.80 మీటర్లు విసిరి రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. మొదటి, నాలుగు ప్రయత్నాల్లో ఫెయిల్ అయిన నీరజ్‌... తన రెండో ప్రయత్నంలో విసిరిన దూరంతో ఈ స్థానంలో నిలిచాడు. మూడు, ఐదు, ఆరు ప్రయత్నాల్లో వరుసగా 81.37, 80.74, 80.90 మీటర్ల దూరం ఈటెను విసిరాడు.

విజేతగా నిలిచిన చెక్‌ రిపబ్లిక్‌ ప్లేయర్​ జాకబ్‌ వాద్లెచ్‌ తన చివరి ప్రయత్నంలో 84.24 మీటర్ల అత్యుత్తమ త్రోను వేశాడు. దీంతో టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఇక ఫిన్లాండ్‌కు చెందిన ఆలివర్ హెలాండర్ 80.90 మీటర్లు విసిరి మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. కాగా, ఈ సీజన్‌లో అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న నీరజ్‌ చోప్రా మరోసారి విజేతగా నిలుస్తాడని అందరూ భావించారు. గత ఏడాది జ్యురిచ్‌లో జరిగిన చోప్రా డైమండ్‌ లీగ్‌లో అతడు టైటిల్‌ నెగ్గాడు. కానీ ఇప్పుడా జోరు కొనసాగించలేకపోయాడు. దీంతో ఇప్పుడు రెండో స్థానంలో నిలిచిన నీరజ్‌కు 12 వేల డాలర్ల ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు. ఇక టైటిల్ నెగ్గిన జాకబ్​ వాద్లెచ్​కు 30 వేల డాలర్ల నగదు బహుమతి దక్కనుంది.

గెలిచుంటే.. మూడో ఆటగాడిగా.. నీరజ్ చోప్రా ఈ ఫైనల్​ మ్యాచ్​లో టైటిల్‌ గెలిచి ఉంటే.. డైమండ్ లీగ్ ట్రోఫీని వరుసగా అందుకున్న మూడో ఆటగాడిగా నిలిచేవాడు. కానీ అది జరగలేదు. చెక్ రిపబ్లిక్‌కు చెందిన విటెజ్‌స్లావ్ వెస్లీ గతంలో.. 2012, 2013లో ఈ ఫీట్ సాధించాడు. అలానే అదే దేశానికి చెందిన మరో అథ్లెట్​ జాకుబ్ వడ్లెచ్ 2016, 2017లో టైటిల్ గెలిచి ఈ ఘనత అందుకున్నాడు.

Neeraj Chopra Diamond League : డైమండ్‌ లీగ్‌లో నీరజ్​కు రెండో స్థానం.. సెప్టెంబర్​ 17న ఫైనల్

Neeraj Chopra Diamond League 2023 : నీరజ్​ చోప్రా.. ఇక డైమండ్‌ లీగ్‌ స్వర్ణంపై గురి

Last Updated :Sep 17, 2023, 7:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.