ETV Bharat / sports

'రిటైర్మెంట్ తర్వాత ఎవ్వరికీ కనిపించను'- విరాట్ షాకింగ్ కామెంట్స్- ఆందోళనలో ఫ్యాన్స్! - Virat Kohli Retirement

author img

By ETV Bharat Telugu Team

Published : May 16, 2024, 12:10 PM IST

Updated : May 16, 2024, 12:40 PM IST

Virat Kohli Retirement: టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్లాన్స్ గురించి తాజాగా వెల్లడించాడు. విరాట్ షాకింగ్ కామెంట్స్​తో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

Virat Kohli Retirement
Virat Kohli Retirement (Source: Associated Press)

Virat Kohli Retirement: టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన రిటైర్మెంట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెరీర్​కు గుడ్​బై చెప్పిన తర్వాత తన ప్లాన్స్​ గురించి వెల్లడించాడు. రిటైర్మెంట్ తర్వాత కొంతకాలం ఎవరికీ కనిపించనని అన్నాడు. ప్రస్తుతం ఐపీఎల్​లో బిజీగా ఉన్న విరాట్ రీసెంట్​గా ఆర్సీబీ రాయల్ గలా డిన్నర్ ప్రోగ్రామ్​లో ఈ వ్యాఖ్యలు చేశాడు.

'ఓ క్రీడాకారుడిగా మాకు కెరీర్ ముగించాల్సిన రోజు ఒకటి ఉంటుంది. నేను కూడ ఎప్పటికీ ఇలాగే ఆడలేను. నాకు ఇప్పటికైతే కెరీర్​ పరంగా ఎలాంటి రిగ్రెట్స్ లేవు. 'ఫలానా రోజు ఇలా చేసి ఉంటే బాగుండేది' అనుకుంటూ కెరీర్​ను ముగించడం నాకు ఇష్టం లేదు. చేయలేని దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా ముందుకెళ్తా. ఇక ఏదో ఒకరోజు నేను కూడా ఆటకు ముగింపు పలుకుతా. ఆ తర్వాత కొంతకాలం మీకు ఎవరికీ నేను కనిపించను. అందుకే ఆడినన్ని రోజులు బెటర్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికే ప్రయత్నిస్తా. అదే నన్ను ముందుకు నడిపిస్తోంది' అని విరాట్ అన్నాడు. దీంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. తొందరలో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కోరుతున్నారు.

ఇక 35ఏళ్ల విరాట్ ఇప్పటిదాకా ఒక్కసారి కూడా ఫిట్​నెస్ సమస్యలతో జట్టుకు దూరం కాలేదు. 2008లో అంతర్జాతీయ క్రికెట్ ప్రారంభించిన విరాట్ భారత్​కు అనేక విజయాలు అందించాడు. మూడు ఫార్మాట్లలో విరాట్ తనదైన మార్క్ చూపుతూ కోట్లాది ఫ్యాన్స్​ను సంపాదించాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీ (50)లతోపాటు అనేక రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Virat Kohli IPL 2024: ప్రస్తుత ఐపీఎల్​లోనూ విరాట్ అదరగొడుతున్నాడు. ఇప్పటివరకు 13మ్యాచ్​లు ఆడిన విరాట్ 66.10 సగటుతో 661 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేస్​లో అందరికంటే ముందున్నాడు. ఇక ఆర్సీబీ శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్​తో చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ ఇరుజట్లకు అత్యంత కీలకం కానుంది. అయితే ఈ మ్యాచ్​కు వర్షం ముప్పుపొంచి ఉంది. ఒకవేళ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైతే ఆర్సీబీ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.

'విరాట్ మళ్లీ కెప్టెన్ అవ్వాలి- ధోనీలా ఇంపాక్ట్ చూపిస్తాడు!' - IPL 2024

అంపైర్​పై కోహ్లీ మళ్లీ ఫైర్​ - ఈ సారి ఏం జరిగిందంటే? - IPL 2024

Last Updated : May 16, 2024, 12:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.