ETV Bharat / sports

IndvsEng: 'టీమ్​ఇండియా గెలవాలంటే అదొక్కటే దారి'

author img

By

Published : Aug 29, 2021, 5:31 AM IST

ఇంగ్లాండ్​(IndvsEng)తో జరగబోయే తర్వాతి రెండు మ్యాచ్​ల్లో టీమ్​ఇండియా గెలవాలంటే నలుగురు బౌలర్లు, ఆరుగురు బ్యాట్స్​మెన్​ సూత్రాన్ని పాటించాలని సూచించాడు భారత మాజీ కెప్టెన్​ దిలీప్​ వెంగ్​సర్కార్​. బ్యాటింగ్​ లైనప్​ మరింత బలంగా తయారవ్వాలంటే ఆరో బ్యాట్స్​మన్​గా సూర్యకుమార్​ యాదవ్​ను తీసుకోవాలని అభిప్రాయపడ్డాడు.

teamindia
టీమ్​ఇండియా

ఇంగ్లాండ్​తో జరుగుతున్న సిరీస్​(IndvsEng)లో నలుగురు బౌలర్లు, ఆరుగురు బ్యాట్స్​మెన్​ వ్యూహంతో బరిలో దిగితే మిగతా రెండు మ్యాచ్​లు టీమ్​ఇండియా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశాడు భారత మాజీ కెప్టెన్​ దిలీప్​ వెంగ్​సర్కార్​. ఆరో బ్యాట్స్​మన్​గా సూర్యకుమార్​ యాదవ్​ను తుది జట్టులోకి తీసుకుంటే బ్యాటింగ్​ లైనప్​ బలంగా తయారవుతుందని సూచించాడు. నాలుగో టెస్టుకు అతడిని తీసుకోవాలని అభిప్రాయపడ్డాడు. మూడో మ్యాచ్​లో ఘోరంగా ఓడిపోయిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశాడు.

surya kumar yadav
సూర్యకుమార్​ యాదవ్​

"బ్యాటింగ్​ లైనప్​ బలంగా తయారవ్వాలంటే జట్టులోకి హనుమ విహారిని తీసుకోవాలని అంటున్నారు. కానీ అతడికి బదులు సూర్యకుమార్​ యాదవ్​ను తీసుకుంటే మంచిది. చెప్పడానికి కాస్త కష్టంగా ఉన్నా దీన్ని నేను బలంగా నమ్ముతున్నా. టీమ్​ఇండియాలోని అద్భుత ఆటగాళ్లతో సమానంగా సూర్యలోనూ నైపుణ్యాలు ఉన్నాయి. అతడు ప్రతిభ ఉన్న ఆటగాడు. ఇప్పటికే జట్టులోకి అతడిని తీసుకోవడం చాలా ఆలస్యమైంది. ఇక తుది జట్టులో అశ్విన్​ను ఎందుకు తీసుకోలేదో ఇప్పటికీ నాకు మిస్టరీగానే ఉంది. అతడిని తీసుకోకపోవడాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నా. ఏదేమైనప్పటికీ మిగతా మ్యాచ్​లు గెలవాలంటే టీమ్​ఇండియా నలుగురు బౌలర్లు, ఆరుగురు బ్యాట్స్​మెన్​తో బరిలో దిగాలి."

-వెంగ్​సర్కార్​, టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​. ​

ఆరుగురు బ్యాట్స్​మెన్​ సూత్రాన్నిఅమలు చేయడం మంచిదని ఇటీవల దిగ్గజ బ్యాట్స్​మన్​ సునీల్​ గావస్కర్​ కూడా సూచించాడు. కాగా, ఇంగ్లాండ్​తో జరిగిన మూడో టెస్టులో ఘోర ఓటమి చవిచూసింది టీమ్ఇండియా. మూడో రోజు ఎంతో పట్టుదల ప్రదర్శించిన భారత బ్యాట్స్​మెన్ నాలుగో రోజు చేతులెత్తేయడం వల్ల ఇన్నింగ్స్​ 76 పరుగుల తేడాతో ఓడిపోయింది కోహ్లీసేన. దీంతో సిరీస్​ 1-1తో సమం అయింది.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.