ETV Bharat / sports

Ind vs Aus World Cup 2023 : కోహ్లీ-కేఎల్ రాహుల్​ సూపర్ షో.. ప్రపంచకప్​లో టీమ్​ఇండియా శుభారంభం

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 8, 2023, 9:54 PM IST

Updated : Oct 8, 2023, 10:32 PM IST

Ind vs Aus World Cup 2023 : 2023 వరల్డ్​కప్​ను విజయంతో ప్రారంభించింది టీమ్​ఇండియా. తమ తొలి మ్యాచ్​లో ఆస్ట్రేలియాను ఓడించింది. స్టార్ బ్యాటర్లు కోహ్లీ - కేఎల్ రాహుల్​ కలిసి 200 లక్ష్యాన్ని ఊదేశారు.

Ind vs Aus World Cup 2023
Ind vs Aus World Cup 2023

Ind vs Aus World Cup 2023 : 2023 ప్రపంచకప్​ను విజయంతో ఆరంభించింది టీమ్​ఇండియా. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్​లో ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలి రెండు ఓవర్లలో 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశ నుంచి కోలుకుని నిలకడగా ఆడింది. మూడో ఓవర్లలో ఎంట్రీ ఇచ్చిన స్టార్ బ్యాటర్లు కోహ్లీ - కేఎల్ రాహుల్​ కలిసి 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో కీలక పాత్ర పోషించారు.

Kohli - Kl Rahul Ind VS Aus : 41.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది టీమ్​ ఇండియా. బ్యాటింగ్​కు దిగగానే రోహిత్‌ శర్మ (0), ఇషాన్ కిషన్‌ (0), శ్రేయస్ అయ్యర్‌ (0) వరుసగా పెవిలియన్‌ బాటపట్టారు. దీంతో రెండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది టీమ్‌ఇండియా. అప్పుడు కోహ్లీ (85; 116 బంతుల్లో 6 ఫోర్లు), కేఎల్ రాహుల్ (97*; 115 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆదుకుని జట్టును విజయం దిశగా నడిపించారు. మూడు వికెట్లు పడిన తర్వాత వచ్చిన కోహ్లీ, రాహుల్‌ ఆచితూచి ఆడారు. సింగిల్స్‌ తీస్తూ, స్ట్రైక్‌ రొటేట్‌ చేస్తూ 165 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక ఆసీస్ బౌలర్లలో హేజిల్‌వుడ్ 3 వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.

అంతకుముందు బ్యాటింగ్​ చేసిన ఆస్ట్రేలియాపై భారత స్పిన్నర్లు విరుచుకుపడ్డారు. దీంతో ఆసీస్​ 49.3 ఓవర్లలో ఆలౌటై 199 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్​(71 బంతుల్లో 46; 5x4), వార్నర్​(52 బంతుల్లో 41; 6x4) పర్వాలేదనిపించారు. మార్నస్​ లబుషేన్(27), గ్లెన్ మ్యాక్స్​వెల్​(15), ప్యాట్ కమిన్స్​(15) నామమాత్రపు స్కోరు చేశారు. ఇక చివర్లో వచ్చిన మిచెల్​ స్టార్క్​(28) స్కోరు బోర్డును కాస్త ముందుకు తీసుకెళ్లాడు. అడం జంపా(6), జోష్ హెజిల్​వుడ్​(1*) స్కోర్​ చేశారు. స్పిన్నర్లకే అనుకూలమైన చెపాక్‌ పిచ్‌పై జడేజా (3/28), కుల్‌దీప్‌ (2/42), అశ్విన్‌ (1/34) చక్రం తిప్పారు. పేసర్‌ బుమ్రా (2/35) కూడా రాణించగా.. సిరాజ్‌, హార్దిక్‌ ఒక్కో వికెట్‌ తీశారు.

World Cup 2023 Ind vs Aus : చెపాక్​లో భారత్​ తొలిపోరు.. ఆస్ట్రేలియాపై జోరు ప్రదర్శించేనా?

World Cup Most Runs Indian Batsman : విశ్వకప్​లో భారత పరుగుల వీరులు.. టాప్​లో సచిన్.. రోహిత్-కోహ్లీ ప్లేస్ ఎంతంటే?

Last Updated :Oct 8, 2023, 10:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.