ETV Bharat / sports

World Cup 2023 Ind vs Aus : చెపాక్​లో భారత్​ తొలిపోరు.. ఆస్ట్రేలియాపై జోరు ప్రదర్శించేనా?

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 8, 2023, 7:35 AM IST

World Cup 2023 Ind vs Aus : 2023 వరల్డ్​కప్​లో భారత్​.. తొలిపోరుకు సమయం ఆసన్నమైంది. మరికొన్ని గంటల్లో భారత్​-ఆస్ట్రేలియా మధ్య పోరు ప్రారంభం కానుంది.

World Cup 2023 Ind vs Aus
World Cup 2023 Ind vs Aus

World Cup 2023 Ind vs Aus : 2023 వన్డే ప్రపంచకప్​లో టీమ్ఇండియా ఫ్యాన్స్​ ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. మరి కొన్ని గంటల్లోనే ఈ మెగాటోర్నీలో భారత్ తొలి మ్యాచ్​ ఆడనుంది. చెన్నై వేదికగా భారత్.. ఆదివారం పటిష్ఠమైన ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. అయితే రీసెంట్​గా స్వదేశంలో కంగారులతో జరిగిన వన్డే సిరీస్​ను భారత్​ 2-1తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్​లోనూ అదే జోరుతో అసీస్​ను ఓడించి.. టోర్నీని​ ఘనంగా ఆరంభించాలని రోహిత్ సేన భావిస్తోంది. కానీ ఆసీస్​ను ఇలాంటి ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో తీసిపారేయలేం.

ఐదుసార్లు విశ్వకప్ విజేత ఆస్ట్రేలియా.. ప్రతి ఎడిషన్​లో టైటిల్ ఫేవరెట్​గానే బరిలో దిగుతోంది. ఈ టోర్నీలో ఆసీస్​.. భిన్నంగా కనిపిస్తే ఆశ్చర్యమేమీ లేదు. ఓపెనర్ డేవిడ్ వార్నర్ నుంచి కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వరకు అందరూ అవసరమైనప్పుడల్లా.. అటు బ్యాట్, ఇటు బంతితో రాణించగలరు. ​అలాగే వార్నర్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్​వెల్, లబుషేన్​ ఈ మధ్య మంచి ఫామ్​లో ఉన్నారు. వారిని బుమ్రా, సిరాజ్‌ ఆరంభంలో.. మధ్య ఓవర్లలో కుల్‌దీప్‌, జడేజా, అశ్విన్‌ కంగారూ బ్యాటర్లను బాగానే ఇబ్బంది పెట్టగలిగితే మ్యాచ్​లో టీమ్ఇండియా పైచేయి సాధించవచ్చు.

ఆశలు వారిపైనే.. కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్​పై టీమ్ఇండియా ప్రధానంగా ఆధారపడింది. ఇక గాయం ,నుంచి కోలుకున్న శ్రేయస్ అయ్యర్.. మిడిలార్డర్​లో కీలక రాణించాల్సిన అవసరం ఉంది. రీసెంట్​గా అతడు ఆసీస్‌పై సెంచరీ చేసి ఫామ్​ చాటుకున్నాడు.అదే జోరును ఈ మ్యాచ్​లోనూ కొనసాగిస్తే.. విజయం పక్కా భారత్​దే.

స్పిన్నర్లకే కలిసొస్తుందా?
చెన్నై చెపాక్‌ స్టేడియం పిచ్​.. స్పన్నర్లకే అనకూలం అని తెలుస్తోంది. దీంతో భారత్.. ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవాకాశం ఉంది. ఈ క్రమంలో జడేజా, కుల్‌దీప్‌, అశ్విన్‌ తుది జట్టులో ఉండవచ్చు. అశ్విన్‌.. ఇటీవల వన్డే సిరీస్‌లో ఆసీస్‌ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. పైగా చెపాక్‌ అశ్విణ్ సొంత మైదానం కూడా. ఇక ఈ గ్రౌండ్​లో పెద్ద స్కోర్లు ఖాయమని విశ్లేషకులు అంటున్నారు.

తుది జట్లు (అంచనా)...
భారత్‌: రోహిత్‌ (కెప్టెన్‌), ఇషాన్‌, కోహ్లి, శ్రేయస్‌, రాహుల్‌, హార్దిక్‌, జడేజా, కుల్‌దీప్‌, అశ్విన్‌/షమి, బుమ్రా, సిరాజ్‌.
ఆస్ట్రేలియా: వార్నర్‌, మిచెల్‌ మార్ష్‌, స్మిత్‌, లబుషేన్‌, మ్యాక్స్‌వెల్‌, కేరీ, గ్రీన్‌, కమిన్స్‌ (కెప్టెన్‌), స్టార్క్‌, హేజిల్‌వుడ్‌, జంపా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.