ETV Bharat / sitara

బాలీవుడ్​ దర్శకుడితో ప్రభాస్​ సినిమా?

author img

By

Published : Jul 6, 2020, 7:25 AM IST

రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రస్తుతం ప్రభాస్​ ఓ చిత్రంలో నటిస్తున్నాడు. తాజాగా, ప్రముఖ బాలీవుడ్​ దర్శకుడితో తన తర్వాత సినిమా ఉంటుందని సమాచారం. దీనికి సంబంధించిన ఒప్పందాలు కూడా జరిగినట్లు తెలుస్తోంది.

PRABHAS NEXT MOVIE WITH BOLLYWOOD DIRECTOR
బాలీవుడ్​ దర్శకుడితో ప్రభాస్​ సినిమా?

ప్రభాస్‌ చేతిలో రెండు సినిమాలున్నాయి. ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత నాగ్‌ అశ్విన్‌ చిత్రం కోసం రంగంలోకి దిగుతాడు. వీటి తర్వాత సినిమాపై కూడా ఆయన ఇప్పటికే నిర్ణయం తీసేసుకున్నారా? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. తన సొంత సంస్థ లాంటి యువీ క్రియేషన్స్‌లోనే ఆ సినిమాని చేయబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాపై ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది.

ఈ చిత్రాన్ని బాలీవుడ్‌కి చెందిన దర్శకుడు తెరకెక్కించే అవకాశాలున్నట్టు సమాచారం. అయితే ప్రభాస్‌ ఏ భాషలో సినిమా చేసినా.. ఏ దర్శకుడితో చేసినా అది ఇతర భాషల్లోనూ విడుదలవుతుంది. పాన్‌ ఇండియా స్థాయిలోనే ఆయన సినిమాలు రూపొందుతుంటాయి.

ఇదీ చూడండి:డార్లింగ్​ ఫ్యాన్స్ హంగామా.. ట్రెండింగ్​లో 'ప్రభాస్20'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.