ETV Bharat / sitara

ప్రభాస్​, హృతిక్​ కలయికలో మల్టీస్టారర్​?

author img

By

Published : Jul 7, 2020, 8:02 AM IST

Updated : Jul 7, 2020, 10:09 AM IST

hrithik roshan
ప్రభాస్​, హృతిక్

ప్రముఖ కథానాయకుడు ప్రభాస్​ బాలీవుడ్​లో ఓ సినిమా చేయనున్నట్లు తెలిసింది. అయితే, ఈ చిత్రంలో బాలీవుడ్​ హీరో హృతిక్​ రోషన్​ కూడా నటించనున్నట్లు సమాచారం.

ఇటీవలే రెబల్​ స్టార్​ ప్రభాస్​ హిందీ దర్శకుడితో ఓ సినిమా చేయబోతున్నాడంటూ వార్తలు వినిపించాయి. ఈ విషయంపై బాలీవుడ్​లోనూ చర్చ నడుస్తోంది. అయితే, ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ప్రభాస్​ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్​ కథానాయకుడు హృతిక్​రోషన్​ నటిస్తున్నాడట. మల్టీస్టారర్​ చిత్రంగా, యాక్షన్​ నేపథ్యంలో రూపొందనున్నట్లు సమాచారం. అందుకోసం ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలయ్యాయని ప్రచారం సాగుతోంది.

అయితే, ఈ సినిమాపై అధికారికంగా ఎటువంటి సమాచారం బయటకు రాలేదు. ప్రభాస్‌ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. ఆ తర్వాత నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తారు. వీటి తర్వాతే హిందీలో చేయనున్న చిత్రం పట్టాలెక్కే అవకాశాలున్నాయి.

ఇదీ చూడండి:బాలీవుడ్​ దర్శకుడితో ప్రభాస్​ సినిమా?

Last Updated :Jul 7, 2020, 10:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.