ETV Bharat / sitara

సూపర్​స్టార్ రజనీకాంత్​కు తొలి సినిమా అవకాశం అలా..!

author img

By

Published : Oct 27, 2021, 12:11 PM IST

ఇప్పటివరకు ఎన్నో అద్భుత చిత్రాలతో మనల్ని అలరిస్తున్న హీరో రజనీకాంత్​కు(rajinikanth movies) తొలి అవకాశం ఎలా వచ్చిందో తెలుసా? ఒకవేళ తెలియకపోతే ఈ స్టోరీ చదవేయండి.

Superstar Rajanikanth
సూపర్​స్టార్ రజనీకాంత్​

సూపర్​స్టార్ రజనీకాంత్​(rajinikanth new movie) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న ఈయనను.. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతోనూ(dada saheb phalke award 2021) కేంద్రం ఇటీవల సత్కరించింది. దానిని తన మిత్రుడు రాజ్ బహదూర్​కు(raj bahadur rajinikanth friend) అంకితమిస్తున్నట్లు రజనీ చెప్పారు. అయితే వీరిద్దరి స్నేహం ఎప్పటి నుంచి ఉంది? అసలు రజనీకి సినిమాల్లో తొలుత ఎలా అవకాశం వచ్చింది?

రజనీ స్నేహితుడు రాజ్​ బహదూర్

తన స్నేహితుడు రజనీకాంత్​కు దాదా సాహెబ్​ ఫాల్కే అవార్డు(dadasaheb phalke award winners) వచ్చిన తర్వాత 'ఈటీవీ భారత్​'.. రాజ్​ బహదూర్​తో మాట్లాడింది. ఈ సందర్భంగా తామిద్దరి 50 ఏళ్ల స్నేహం, రజనీకి తొలి సినిమా అవకాశం రావడం గురించి ఆయన చెప్పారు.

"రజనీకాంత్(rajinikanth movies) మాతో కలిసి కండక్టర్​గా పనిచేసే రోజుల్లో మేమంతా నాటకాలు వేసేవాళ్లం. రజనీ లీడ్​ రోల్​లో చాలా బాగా నటించేవాడు. అతడి ప్రతిభ చూసి, సినిమాల్లోకి వెళ్లమని చెప్పాను. అందులో ప్రయత్నిస్తే గొప్ప నటుడివి అవుతావని అన్నాను. చెన్నై ఫిల్మ్ ఇన్​స్టిట్యూట్​లో చేరమని చెప్పాను. దీంతో అక్కడ రెండేళ్లపాటు రజనీ శిక్షణ తీసుకున్నాడు. మొత్తం కోర్సు పూర్తయిన తర్వాత వాళ్లు ఓ నాటకం వేశారు. దానికి చూసేందుకు వచ్చిన ప్రముఖ దర్శకుడు బాలచందర్(balachander movies).. రజనీ నటనకు ముగ్దుడయ్యారు. తమిళం నేర్చుకోమని సలహా ఇచ్చారు. అప్పటినుంచి రజనీ, నేను.. తమిళంలో మాట్లాడటం మొదలుపెట్టాం. రెండునెలల్లోనే రజనీ.. తమిళం పూర్తిగా నేర్చుకున్నాడు. ఆ తర్వాత బాలచందర్​ దగ్గరకు వెళ్లగా, తాను తీయబోయే 'అపూర్వ రాగంగళ్'లో రజనీకి అవకాశమిస్తున్నట్లు ఆయన చెప్పారు" అని రాజ్​ బహదూర్ చెప్పారు.

సినిమాల్లోకి రాకముందు బెంగళూరులో కండక్టర్​గా(rajinikanth bus conductor) రజనీ పనిచేశారు. ఆ బస్సుకు రాజ్ బహదూర్ డ్రైవర్. అప్పుడు మొదలైవ వీరి స్నేహం.. ఇప్పటికీ కొనసాగుతోంది. బెంగళూరు ఎప్పుడొచ్చినా, రజనీ.. రాజ్​ బహదూర్​ను కచ్చితంగా కలుస్తారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.