ETV Bharat / science-and-technology

JioBook Laptop Launch : అమెజాన్​లో జియోబుక్ టీజర్​.. జులై 31న విడుదల!.. ఫీచర్లు చూస్తే ఫిదానే!

author img

By

Published : Jul 24, 2023, 12:48 PM IST

JioBook Laptop Teaser : రిలయన్స్ జియో తన సరికొత్త బడ్జెట్​ లాప్​టాప్​ను జులై 31న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా 'జియోబుక్​' ల్యాప్​టాప్​ టీజర్​ను రిలీజ్​ చేసింది. ఈ ల్యాప్​టాప్​ను​ మంచి కాంపాక్ట్​ డిజైన్​తో, 4జీ కనెక్టివిటీతో తీసుకొస్తున్నారు. ఇందులో పవర్​ఫుల్​ ఆక్టా-కోర్​ ప్రాసెసర్​ కూడా ఉంది. మరిన్ని పూర్తి వివరాలు మీ కోసం..

JioBook laptop specifications and features
JioBook laptop launch on July 31

JioBook Laptop Launch Date : రిలయన్స్​ జియో మరో సరికొత్త బడ్జెట్​ ల్యాప్​టాప్​ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. అభిషేక్ యాదవ్​ అనే టిప్​స్టర్​ ఈ కామర్స్​ వెబ్​సైట్ అమెజాన్​​లో కనిపించిన జియోబుక్​ ల్యాప్​టాప్​ను తన ట్విట్టర్ అకౌంట్​లో షేర్​ చేశాడు. ఇందులో అతను జియోబుక్​ను ఈ జులై 31న మార్కెట్​లోకి విడుదల చేయడానికి రిలయన్స్​ జియో సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నాడు.

ఈ జియోబుక్​ను ప్రత్యేకంగా విద్యార్థుల కోసం రూపొందించినట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగానే 'యువర్ అల్టిమేట్​ లెర్నింగ్ పార్టనర్​' అనే ట్యాగ్​లైన్​ను స్పష్టంగా చూపించడం జరిగింది.

అప్​డేటెడ్​ వర్షెన్​!
Latest Jiobook laptop : రిలయన్స్​ కంపెనీ జియోబుక్​ను 2022 అక్టోబర్​లోనే మార్కెట్​లోకి విడుదల చేసింది. అప్పుడు దాని ధరను రూ.20,000 ప్రైస్​ రేంజ్​లో ఉంచింది. ఇప్పుడు అదే ల్యాప్​టాప్​ అప్​డేటెడ్​ వెర్షన్​ను మరలా మార్కెట్​లోకి తెస్తోంది. ఇది లాంఛ్​ అయిన తరువాత రిలయన్స్ డిజిటల్​ స్టోర్​లో అందుబాటులో ఉంటుంది.

జియోబుక్​ స్పెక్స్​ అండ్ ఫీచర్స్​
JioBook laptop specs : అమెజాన్​లో విడుదలైన టీజర్​లో జియోబుక్​ స్పెసిఫికేషన్స్​, ఫీచర్స్​ గురించి కొంత సమాచారం తెలుస్తోంది. వాస్తవానికి ఇది పాత జియోబుక్​ మాదిరి డిజైన్​నే కలిగి ఉంది. కానీ ఈ సారి మరింత కాంపాక్ట్​గా, సైలిష్​ బ్లూ కలర్​తో దీనిని తీసుకొస్తున్నారు. ఈ జియోబుక్​ అన్ని వయస్సుల వారికి అనుగుణంగా ఉంటుందని, అలాగే ఎంటర్​టైన్మెంట్​, ప్రొడక్టివిటీ, గేమింగ్​లకు సపోర్ట్​ చేస్తుందని రిలయన్స్​ జియో స్పష్టం చేస్తోంది.

JioBook laptop features : 4జీ కనెక్టివిటీతో వస్తున్న ఈ ల్యాప్​టాప్​లో పవర్​ఫుల్​ ఆక్టా-కోర్ ప్రాసెసర్​ కూడా ఉంది. అందువల్ల దీనిలో హై-డెఫినిషన్​ వీడియో స్ట్రీమింగ్​ చేసుకోవచ్చు. అలాగే వివిధ సాఫ్ట్​వేర్​లను ఉపయోగించి, మల్టీటాస్కింగ్​ కూడా చేయవచ్చు.

JioBook teaser : అమెజాన్​లో విడుదలైన టీజర్​ ప్రకారం, ఈ జియోల్యాప్​ టాప్​ చాలా సన్నగా, తక్కువ బరువుతో ఉంటుంది. ఇది కేవలం 990 గ్రాముల బరువు మాత్రమే ఉంటుందని కంపెనీ స్పష్టం చేస్తోంది. అలాగే ఒకసారి దీని బ్యాటరీని ఫుల్​ ఛార్జ్​ చేస్తే.. రోజంతా పనిచేసుకోవచ్చని చెబుతోంది. ఈ ల్యాప్​ట్యాప్​లోని మిగతా ఫీచర్లు, స్పెసిఫికేషన్లు.. జులై 31న లాంఛ్ చేసినప్పుడే మనకు తెలిసే అవకాశం ఉంది.

పాత మోడల్​ జియోబుక్​ స్పెసిఫికేషన్స్​
JioBook specifications : 2022 అక్టోబర్​లో రిలీజ్ అయిన జియోబుక్​లో 11.6 అంగుళాల డిస్​ప్లే, బ్రాడ్​ బెజిల్స్ ఉన్నాయి. వీడియోకాల్​ చేసుకునేందుకు వీలుగా.. 2 మెగా పిక్సెల్​ ఫ్రంట్ కెమెరా​ ఇచ్చారు. ఈ ల్యాప్​టాప్​లో క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ 665 ప్రాసెసర్​, దానికి అనుసంధానంగా అడ్రినో 610జీపీయూ పొందుపరిచారు. ఇంకా 2జీబీ ర్యామ్​ + 32జీబీ eMMC స్టోరేజ్​ ఇచ్చారు. అలాగే ఇందులోని స్టోరేజ్​ను 128జీబీ వరకు పెంచుకునేందుకు కూడా అవకాశం కల్పించారు. ఈ జియో ల్యాప్​టాప్.. జియోఓఎస్​తో రన్​ అవుతుంది. ఇందులో అనుమతించిన థర్డ్ పార్టీ యాప్​లను కూడా ఇన్​స్టాల్​ చేసుకోవచ్చు.

ఈ జియో ల్యాప్​టాప్​లో 5000mAh బ్యాటరీ ఉంది. దీనిని ఒకసారి ఛార్జ్​ చేస్తే కనీసం 8 గంటల వరకు నిర్విరామంగా పనిచేసుకోవచ్చు. దీనిలో 3.5ఎంఎం ఆడియో జాక్​, బ్లూటూత్​ 5.0, HDMI మినీ, వై-ఫై, ఇంకా అనేక ఫీచర్లు ఉన్నాయి. వాస్తవానికి ఈ ల్యాప్​టాప్​లో జియోసిమ్​ కార్డు ఉంటుంది. దీని ద్వారా మీరు 4జీ ఎల్​టీఈ కనెక్టివిటీని పొందవచ్చు. మరి త్వరలో విడుదల కానున్న అప్​డేటెడ్​ వెర్షన్​ జియోబుక్​లో ఏమేమి సరికొత్త ఫీచర్స్​ పొందుపరిచారో జులై 31న తెలుస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.