ETV Bharat / science-and-technology

మీ వస్తువులను ఎక్కడైనా మర్చిపోయారా?.. వెతికిపెట్టేందుకు 'JIO TAG'​ ఉందిగా!

author img

By

Published : Jul 24, 2023, 10:09 AM IST

Reliance Jio Tag : వస్తువులను ఎక్కడో ఒక దగ్గర పెట్టి మర్చిపోవడం మనలో చాలా మందికి ఉన్న అలవాటు. అలా మర్చిపోయిన వస్తువులను వెతికే ఒక సాధనం ఉంటే బాగుంటుందని చాలా మంది అనుకుంటారు. ఈ బెంగను పోగొట్టే ఆ వస్తువే జియో ట్యాగ్​. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Jio Tag Device Details
మీ ఫోన్​, పర్స్​ పోయిందా.. జియో ట్యాగ్​ ఉందిగా వెతికేందుకు..!

Jio Tag Device : భారతదేశంలోని ప్రముఖ టెలికమ్యూనికేషన్స్ కంపెనీ జియో.. మన జీవితాలను సులభతరం చేసే లక్ష్యంతో, జియోట్యాగ్ అనే ట్రాకింగ్ పరికరాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇది మన వస్తువులను ట్రాక్ చేయడంలో సహాయపడుతుంది. జియో ట్యాగ్ మీ పర్సనల్ వస్తువులను ట్యాగ్ చేసి సులువుగా గుర్తించడానికి ఉపయోగపడే బ్లూటూత్​తో వచ్చే లాస్ట్ అండ్ ఫౌండర్ ట్రాకర్. యాపిల్ ఎయిర్ ట్యాగ్​కు చాలా దగ్గరగా ఉండే జియో ట్యాగ్, దానికి ఒక మంచి ప్రత్యామ్నాయం కూడా కావచ్చు. ఫోన్, తాళాలు, వాలెట్ లేదా మరేదైనా విలువైన వస్తువు అయినా మర్చిపోయి ఉండొచ్చు.. జియో ట్యాగ్ ఉంటే ఆ చింతే లేదు.

జియోట్యాగ్ ఫీచర్లు:
Jio Tag Features : మీ ఫోన్​ను కనిపెట్టడానికి మీకు సహాయపడే సామర్థ్యం జియోట్యాగ్​ పరికరం ముఖ్య లక్షణాల్లో ఒకటి. ఫోన్ కనిపించకపోతే, మరీ ముఖ్యంగా తొందరలో ఉన్నప్పుడు కలిగే ఆందోళన మనం అందరం చూసే ఉంటాం. అయితే జియో ట్యాగ్​తో ఈ భయం ఉండదు. లింక్ చేసిన పరికరాన్ని రెండుసార్లు ట్యాప్ చేస్తే చాలు మీ ఫోన్ రింగ్ అవుతుంది, ఒకవేళ మీ ఫోన్ సైలెంట్ మోడ్​లో ఉన్నా కూడా. దీంతో ఫోన్ వెతుక్కునే ఒత్తిడికి వీడ్కోలు చెప్పండి.

Jio Tag Alerts : సాధారణంగా కనిపించకుండా పోయే వస్తువులకు, జియో ట్యాగ్ ఒక రక్షణ కవచంలా నిలుస్తుంది. మీ వస్తువులకు జియో ట్యాగ్​ను అటాచ్ చేయడం ద్వారా మీరు మర్చిపోయిన వస్తువులకు అలర్ట్స్ పొందొచ్చు. ఒకవేళ మీరు పొరపాటున మీ ఫోన్, తాళాలు లేదా వాలెట్ ఏదైనా రెస్టారెంట్​లో లేదా షాపింగ్ చేసేటప్పుడు మర్చిపోయినా సరే జియో ట్యాగ్ మీరు వాటిని మళ్లీ మరిచిపోకుండా చూసుకుంటుంది.

జియో ట్యాగ్​తో మీ వస్తువు చివరి డిస్కనెక్షన్​ను సులువుగా తెలుసుకోవచ్చు. ఒకవేళ మీ ఫోన్​లో డిస్కనెక్షన్ నోటిఫికేషన్​ను మిస్ అయినా కూడా, జియో ట్యాగ్ మీకు కచ్చితమైన చివరి లొకేషన్​ను అందిస్తుంది. దీంతో మీరు పోగొట్టుకున్న వస్తువును కనుక్కోవడం చాల సులువు.

Jio Tag Details : jio tag distanceఏదైనా కారణం వల్ల మీరు జియో ట్యాగ్ చేసిన వస్తువును చివరిసారిగా డిస్కనెక్ట్ అయిన లొకేషన్​లో కూడా కనుక్కోలేకపోయినా బాధలేదు. దీనికి ఒక మార్గం ఉంది. జియో తింగ్స్​ యాప్​లో జియో ట్యాగ్ పోయిందని నమోదు చేస్తే, జియో కమ్యూనిటీ ఫైండ్ నెట్‌వర్క్ రంగంలోకి దిగుతుంది. పోయిన జియో ట్యాగ్ చేసిన వస్తువును వెతికి, దాని స్థానానికి తిరిగి రిపోర్ట్ చేస్తుంది. మీ విలువైన వస్తువును మీరు తిరిగి పొందేలా చేస్తుంది.

Reliance Jio Tag : జియో ట్యాగ్​ను మీరు ఎక్కువ కాలం ఉపయోగించడానికి వీలుగా రీప్లేసబుల్ బ్యాటరీతో వస్తుంది. వినియోగదారులకు మరింత వీలుగా ఉండటానికి, జియో ఒక అదనపు బ్యాటరీ, అలాగే ఒక లాన్యార్డ్ కేబుల్​ను కూడా అందిస్తుంది. దీంతో ఎల్లప్పుడూ మీకు బ్యాకప్ ఉంటుంది.

Jio Tag Distance : ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. జియో ట్యాగ్ బ్యాటరీ దాదాపు ఒక సంవత్సరం పాటు పనిచేస్తుంది. ఇక రేంజ్ విషయానికొస్తే ఇండోర్​లో 20 మీటర్లు, అవుట్​డోర్​లో 50 మీటర్లు. ఇది బ్లూటూత్ 5.1ను సపోర్ట్ చేస్తుంది. దీని బరువు కేవలం 9.5 గ్రాములు.

ఇండియాలో జియో ట్యాగ్ ధర:
Jio Tag Price : రిలయన్స్ జియో అధికారిక యాప్​లో జియో ట్యాగ్ కేవలం రూ.749/-కే అందుబాటులో ఉంది. దేశంలోని అధికారిక రిలయన్స్ జియో స్టోర్​లో దీనిని కొనుగోలు చేయవచ్చు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.