ETV Bharat / international

కాబుల్​ పేలుళ్లలో తాలిబన్ కమాండర్ మృతి- 20కి చేరిన మరణాలు

author img

By

Published : Nov 3, 2021, 10:02 AM IST

Updated : Nov 3, 2021, 11:08 AM IST

Afghanistan blasts
అఫ్గాన్ పేలుళ్లు

అఫ్గానిస్థాన్​ రాజధాని కాబుల్​లో మిలిటరీ ఆసుపత్రిపై జరిగిన బాంబు దాడిలో (Afghan blast news) మృతుల సంఖ్య 20కి చేరింది. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. తాలిబన్ల వైపు నుంచి ఓ సీనియర్ కమాండర్​ కూడా మృతి చెందినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

కాబుల్‌ మిలటరీ ఆసుపత్రిపై జరిగిన బాంబుల దాడిలో (Afghan blast news) మరణించిన వారి సంఖ్య 20కి పెరిగింది. మరో 16 మంది తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. 400 పడకల సర్దార్ దావూద్ ఖాన్ ఆసుపత్రిపై ముష్కరులు మంగళవారం దాడి చేశారు. ఈ దాడి తామే చేశామని ఇస్లామిక్ స్టేట్ అనుబంధ సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ ఖొరాసన్‌ (ఐఎస్​కే) ప్రకటించింది.

ఐఎస్​కే ఉగ్రవాదులు ఆసుపత్రి గేటు దగ్గర బాంబు పేల్చిన (Afghan blast update) తరువాత లోపలికి ప్రవేశించారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. తాలిబన్లు జరిపిన ఎదురు కాల్పుల్లో నలుగురు ఐఎస్​కే ఉగ్రవాదులు హతమవ్వగా.. ఒకరిని సజీవంగా పట్టుకున్నామని అధికారులు పేర్కొన్నారు. హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రి ప్రాంగణంలో దిగిన తాలిబన్ ప్రత్యేక బలగాలు దుండగులను లోనికి ప్రవేశించకుండా నిరోధించాయని వెల్లడించారు. దుండగులంతా 15 నిమిషాల్లో హతమయ్యారని తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ వెల్లడించారు. అఫ్గాన్ ప్రభుత్వం నుంచి స్వాధీనం చేసుకున్న ఎయిర్‌క్రాఫ్ట్‌ను తాలిబన్లు ఉపయోగించడం ఇదే మొదటిసారని ఆయన తెలిపారు.

కాల్పుల్లో తాలిబన్ల వైపు నుంచి ఓ సీనియర్ కమాండర్​ కూడా మృతి చెందినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

ఇదీ చదవండి: ఇథియోపియాలో జాతీయ అత్యయిక స్థితి

Last Updated :Nov 3, 2021, 11:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.