ETV Bharat / international

చిచ్చరపిడుగు స్పీడు.. 11నెలలకే స్నోబోర్డింగ్​!

author img

By

Published : Nov 19, 2021, 9:05 PM IST

చైనాలో 11నెలల చిన్నారి వాంగ్​ యుజి.. స్నోబోర్డ్​తో కుస్తీపడుతోంది. ముద్దుముద్దు చేష్టలతో యుజి స్నోబోర్డింగ్​ చేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. క్రీడలపై మక్కువ ఉన్న ఆమె తల్లిదండ్రులు.. యుజికి ఇప్పటి నుంచే పాఠాలు నేర్పించేస్తున్నారు.

china snowboarding place
చిచ్చరపిడుగు స్పీడు.. 11నెలలకే స్నోబోర్డింగ్​!

చిచ్చరపిడుగు స్పీడు.. 11నెలలకే స్నోబోర్డింగ్​!

11నెలల వయస్సులో చిన్నారులు.. ఎక్కువగా నిద్రతోనే కాలక్షేపం చేస్తూ ఉంటారు. నిద్రలేస్తే బొమ్మలతో ఆడుకుంటూ ఉంటారు. కానీ చైనాకు చెందిన వాంగ్​ యుజి మాత్రం.. ఏకంగా స్నోబోర్డ్​ ఎక్కేసి మంచులో రయ్​.. రయ్​ అంటూ దూసుకెళ్లిపోతోంది. కాళ్లకు షూ, చేతులకు గ్లౌజులు, వంటి మీద స్వెటర్​.. తలమీద హెల్మెట్​.. దానిపైన కూలింగ్​ గ్లాసెస్​తో స్టైలిష్​గా స్నోబోర్డింగ్​ చేసేస్తోంది వాంగ్​ యుజి.

china snowboarding place
స్నోబోర్డ్​పై రయ్​రయ్​

సాధారణంగా.. ఈ సమయానికి చైనాలోని అనేక ప్రాంతాల్లో మంచు కురుస్తూ ఉంటుంది. చోంగ్లీ జిల్లాలోని కొండ ప్రాంతాల్లో స్నోట్రాక్స్​ ఉంటాయి. స్నోబోర్డింగ్​ ప్రియులకు ఆ ప్రాంతమంటే చాలా ఇష్టం. అక్కడే వాంగ్​ యుజి స్నోబోర్డ్​తో ప్రాక్టీస్​ చేసింది.

china snowboarding place
తండ్రితో వాంగ్​ యుజి
china snowboarding place
వాంగ్​ యుజి

11నెలల వయస్సులో స్నోబోర్డింగ్​ అంటే కష్టమైన విషయమే. కానీ యుజికి మంచి ఫిట్​నెస్​ ఉండటం వల్ల ఇది సాధ్యమైందని అంటోంది యుజి తల్లి.

"తల్లిదండ్రులకు వచ్చిన క్రీడలనే పిల్లలు కూడా నేర్చుకోవాలని మా కుటుంబ సిద్ధాంతం. మాకు తెలియని క్రీడలను మా పిల్లలకు నేర్పించము. నేను నా భర్తతో స్నోబోర్డింగ్​ నేర్చుకున్నా. అందుకే యుజికి కూడా అదే నేర్పిస్తున్నాము. కొంత వయస్సు వచ్చాక యుజికి స్నోబోర్డింగ్​ నేర్పిద్దామని ముందు అనుకున్నాము. కానీ యుజికి ఇది​ చాలా నచ్చేసింది. ఇంట్లో ఓసారి ప్రయత్నించినప్పుడు.. తను అసలు బయటపడలేదు. చాలా ఎంజాయ్​ చేసింది. ఇక యుజిని మేము రంగంలోకి దింపేశాము. బీజింగ్​ను చోంగ్లీకి తనని తీసుకొచ్చాము."

-- ఫ్యాన్​ జుయేయిన్​, యుజి తల్లి.

యుజి స్నోబోర్డింగ్ చేస్తున్న​ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. యుజి ముద్దుముద్దు చేష్టలు చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. వావ్​ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

china snowboarding place
ముద్దుముద్దు చేష్టలు..

ఇదీ చూడండి:- చైనాలో హిమపాతం.. మంచు ముసుగులో పర్యటక ప్రాంతాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.