ETV Bharat / entertainment

ఓటీటీలోనూ 'హాయ్​నాన్న' మేనియా- స్ట్రీమింగ్​లో 'నాని'దే టాప్​ ప్లేస్!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 7, 2024, 8:15 PM IST

Updated : Jan 7, 2024, 9:02 PM IST

Hi Nanna OTT Record: హాయ్​నాన్న సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. కాగా, తాజాగా ఈ సినిమా ప్లాట్​ఫామ్​ నెట్​ఫ్లిక్స్​లోనూ పలు రికార్డులు క్రియేట్ చేస్తోంది.

hi nanna ott record
hi nanna ott record

Hi Nanna OTT Record: నేచురల్ స్టార్ నాని- మృణాల్ ఠాకూర్ ఫీల్​గుడ్​ లవ్​స్టోరీ సినిమా 'హాయ్ నాన్న'. దర్శకుడు శౌర్యువ్​ తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ​ఇక నూతన సంవత్సరం సందర్భంగా 2024 జనవరి 4నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్​ నెట్​ఫ్లిక్స్​లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే థియేటర్లలో రికార్డులు సృష్టించిన హాయ్ నాన్న, అటు ఓటీటీలోనూ టాప్​ రేటింగ్స్​ను సొంతం చేసుకుంది.

నెట్​ఫ్లిక్స్​లో హాయ్​నాన్న చిత్రం ట్రెండింగ్​లో ఉంది. ఇప్పటికే ఈ సినిమా స్ట్రీమింగ్​లో టాప్​- 10లో మూడు స్థానాలు సొంతం చేసుకుంది. తెలుగులో టాప్​లో ఉండగా, హిందీలో 5వ స్థానం, తమిళంలో 10వ ప్లేస్​లో నిలిచింది. దీంతో నాని ఫ్యాన్స్ ఫుల్​ ఖుషీలో ఉన్నారు. కాగా, ఈ సినిమా డిసెంబర్ 7న తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్​గా రిలీజైంది.

HI Nanna Cast: తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్​తో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాతో నాని 2023లో రెండో హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ఇక నాని సరసన ఈ సినిమాలో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ నటించింది. సీనియర్ నటి శ్రుతిహాసన్ కీలక పాత్రలో కనిపించింది. ఇక జయరామ్, అంగాద్ బేడి, బేబీ కియారా ఖన్నా, విరాజ్ అశ్విన్, రితికా నాయక్, ప్రియదర్శి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. వైరా ఎంటర్​టైన్​మెంట్ బ్యానర్​పై సీవీ మోహన్, డా విజేందర్ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఇక అబ్దుల్ వహీద్ సంగీతం అందించారు.

HI Nanna Overseas Collection: 'హాయ్​ నాన్న' సినిమా భారత్​లోనే కాకుండా ఓవర్సీస్​లోనూ కాసుల వర్షం కురిపించింది. అక్కడ ఈ సినిమా 1.3 మిలియన్ డాలర్లు మార్క్ అందుకుంది. ఈ నేపథ్యంలో హాయ్​నాన్న అప్పటికే వారం రోజుల ముందు రిలీజైన రణ్​బీర్ కపూర్ యానిమల్ మూవీని బీట్​ చేసినట్లు తెలిసింది. ఇక వరల్డ్​వైడ్​గా ఈ సినిమా రూ.75 కోట్లు వసూల్ చేసింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

థియేటర్లలో ఈ వారం పాత సినిమాలే- ఓటీటీలో మాత్రం న్యూ ఇయర్ సందడి​!

'మిమ్మల్ని ఇలా కలవడం అదృష్టంగా భావిస్తున్నాను - త్వరలోనే పెళ్లి చేసుకుంటాను'

Last Updated :Jan 7, 2024, 9:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.