ETV Bharat / city

ప్రజల పాలిట శాపంగా మారిన ఇసుకరీచ్‌లు.. అంబులెన్సులు రాక మరణాలు

author img

By

Published : Oct 7, 2022, 1:36 PM IST

Sand Reaches
Sand Reaches

Roads Damaged due to Sand Reaches: మానేరు నదిపై ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన ఇసుక రీచ్‌లు పెద్దపల్లి నియోజకవర్గ ప్రజల పట్ల శాపంగా మారాయి. లారీలు నిత్యం ఇసుక రవాణా చేస్తుండటంతో రోడ్లు దెబ్బతిని, గోతులు పడి రహదారుల పరిస్థితి అధ్వాహ్నంగా మారింది. అంబులెన్సులు సరైన సమాయానికి చేరుకోకపోవడంతో కొన్నిసార్లు మరణాలు సైతం సంభవిస్తున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Roads Damaged due to Sand Reaches: పెద్దపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇసుక రీచ్‌ల వల్ల సామర్థ్యానికి మించి అధికలోడుతో రవాణా జరిగి రోడ్ల పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. సుల్తానాబాద్‌ నుంచి కాల్వ శ్రీరాంపూర్‌ వెళ్లే మార్గంలో 14 కిలోమీటర్ల ప్రయాణానికి కనీసం రెండు గంటలకు పైగా సమయం పడుతుందంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓదెల మండలంలోని అనేక గ్రామాల్లోని రహదారులు ధ్వంసం అయ్యాయి. ఆదాయం కోసం ప్రభుత్వం ఆలోచించినప్పుడు ప్రజలకు కలిగే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకోవాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ద్విచక్రవాహనాలు సైతం రోడ్డుపై నడపలేక పోతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఓదెల మండలంలో ప్రధానంగా 8 ఇసుక రీచ్‌ల ద్వారా నిరంతరాయంగా ఇసుక రవాణా సాగుతోంది. రీచ్‌లకు అనుమతించిన అధికారులు నిబంధనలకు అనుగుణంగా ఇసుక రవాణా జరుగుతుందా లేదా అనే విషయం అసలు పట్టించుకోవట్లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజూ 300నుంచి 500వరకు లారీలు తిరుగుతున్నాయని... వాటి వల్ల దెబ్బతిన్న రహదారులు బాగు చేయాలని ధర్నాలు చేసినా ప్రయోజనం లేదని ప్రజలు వాపోతున్నారు. సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఇసుక లారీలను ప్రభుత్వం అదుపు చేసి రహదారుల మరమ్మతులు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.