ETV Bharat / crime

ఆ స్వామిజీ పాత కరెన్సీని కొత్త నోట్లుగా మార్చేస్తాడట..!!

author img

By

Published : Oct 7, 2022, 9:54 AM IST

రద్దయిన కరెన్సీ, దొంగ నోట్లను తరలిస్తున్న ముఠాను ములుగు జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌ జి.పాటిల్‌ గురువారం ఈ వివరాలు వెల్లడించారు.

Swamiji will change cancelled old currency into new notes and 2crores fake currecy gang arrested in mulugu district
పాత కరెన్సీని కొత్త నోట్లుగా మార్చే బాబా.. 2 కోట్లు తరలిస్తూ..

రద్దయిన కరెన్సీ, దొంగ నోట్లను తరలిస్తున్న ముఠాను ములుగు జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌ జి.పాటిల్‌ గురువారం ఈ వివరాలు వెల్లడించారు. వెంకటాపురంలో గురువారం పోలీసులు తనిఖీ చేస్తుండగా రెండు వాహనాల్లో రద్దయిన రూ.వెయ్యి, రూ.500 నోట్లు లభ్యమయ్యాయి. ఈ నోట్ల విలువ రూ.1.65 కోట్లు.

సూర్యాపేట జిల్లా కేశవాపూర్‌కు చెందిన పప్పుల నాగేంద్రబాబు, కోదాడ మండలం సాలర్జింగ్‌పేటకు చెందిన శ్రీరాముల నాగలింగేశ్వర్‌రావు, భద్రాచలం ఏఎంసీ కాలనీకి చెందిన మారె సాంబశివరావు, ములుగు జిల్లా వెంకటాపురానికి చెందిన బెజ్జంకి సత్యనారాయణ, నారాయణపేట జిల్లా మద్దూరు మండలం ఎక్కనాడే గ్రామానికి చెందిన వడ్డి శివరాజ్‌, హైదరాబాద్‌ ఉప్పల్‌ బుద్ధానగర్‌కు చెందిన ఆయుర్వేద వైద్యుడు గంటా యాదగిరి, మలక్‌పేట బ్యాంక్‌కాలనీకి చెందిన ఠాకూర్‌ అజయ్‌సింగ్‌, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నాగేంద్రబాబు అప్పులు ఎక్కువ కావడంతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వచ్చే వ్యాపారం చేయాలనుకున్నాడు. ఈ క్రమంలో తన స్నేహితుడు నాగలింగేశ్వర్‌రావు అలియాస్‌ నగేష్‌ను కలిశాడు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ బాబా పాత కరెన్సీని కొత్త నోట్లుగా మారుస్తాడని నాగలింగేశ్వర్‌రావు నమ్మించాడు. దీంతో హైదరాబాద్‌కు చెందిన వెంకట్‌రెడ్డి, నవీన్‌రెడ్డికి రూ.5 లక్షలు ఇచ్చి వారి వద్ద సుమారు రూ.2 కోట్ల రద్దయిన పాత కరెన్సీ, దొంగ నోట్లను కొనుగోలు చేశాడు. ఆ సొమ్మును భద్రాచలం నుంచి వెంకటాపురం మీదుగా హైదరాబాద్‌ తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు. వారి నుంచి పాత కరెన్సీ, దొంగ నోట్లు, రెండు కార్లు, 9 ఫోన్‌లు,రూ.5 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.