ETV Bharat / city

Telangana Top News: టాప్ ​న్యూస్ @7PM

author img

By

Published : Oct 18, 2022, 6:57 PM IST

telangana top news today
telangana top news today

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

  • ముసద్దీలాల్ జువెల్లర్స్​లో ముగిసిన ఈడీ సోదాలు..

ముసద్దీలాల్ జెమ్స్ ఆండ్ జువెల్లర్స్ షోరూంలో రెండు రోజుల పాటు ఈడీ చేపట్టిన సోదాలు ముగిశాయి. విజయవాడ, హైదరాబాద్​లోని మూడు షోరూమ్​లలో బంగారు, వజ్రాభరణాలు, ఇతర కీలక పత్రాలను సీజ్ చేశారు.

  • కేసీఆర్‌కు ఓట్లపై ఉన్న ప్రేమ.. ప్రజలపై లేదు: ఈటల రాజేందర్‌

BJP Leaders Campaign in Munugode Bypoll: దేశ చరిత్రలో ఎక్కడాలేని విధంగా సీఎం కేసీఆర్‌ తన మంత్రులు, సహచరులతో గొర్లమందపై తోడేళ్లు దాడి చేసినట్లు.. మునుగోడుపై పడ్డారని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ విమర్శించారు.

  • 'ఓటుకు రూ.40 వేలు తీసుకుని భాజపాకు ఓటు వేయండి'

సీఎం కేసీఆర్‌ది దండుపాళ్యం ముఠా అని.. ఒక్క రాజగోపాల్​రెడ్డిని ఓడించేందుకు ఆ బ్యాచ్‌ అంతా మునుగోడుకు వచ్చిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ధ్వజమెత్తారు.

  • 'కేసీఆర్‌ నిరంకుశ పాలనకు ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారు'

ముఖ్యమంత్రి కేసీఆర్‌ వారం రోజులుగా దిల్లీలో దేనికోసం ఉన్నారని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. విభజన సమస్యలపై నోరు విప్పాడా అంటే అదీ లేదు.. ఆయన ఉండి ఏమాత్రం ప్రయోజనం లేదని విమర్శించారు.

  • పవన్​ను కలిసిన చంద్రబాబు.. ఆ అంశాలపైనే చర్చ..

తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్​తో భేటీ అయ్యారు. ఏపీలోని విజయవాడ నోవాటెల్‌ హోటల్‌కు వెళ్లి పవన్​తో సమావేశమైన చంద్రబాబు.. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.

  • ఉగ్రవాద అనుకూల మార్గాలను మూసివేయాలి : మోదీ

ఉగ్రవాదులు, అవినీతిపరులు, నేరస్థులకు అనుకూలమైన అన్ని మార్గాలను పూర్తిగా మూసివేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. దిల్లీలోని ప్రగతి మైదాన్​లో జరిగిన ఇంటర్‌పోల్ 90వ సర్వసభ్య సమావేశంలో మోదీ ప్రసంగించారు.

  • అత్తింటిపై పెట్రోల్ పోసి నిప్పు.. భార్యాపిల్లలు, అత్తామామలు సజీవ దహనం

అత్తింటిపై పెట్రోల్​ పోసి నిప్పంటించాడు ఓ వ్యక్తి. ఈ ఘటనలో భార్యాపిల్లలు, అత్తామామలు సజీవ దహనమయ్యారు. ఈ దారుణం పంజాబ్​లోని​ జలంధర్​లో జరిగింది.

  • నో కాస్ట్ ఈఎంఐతో వస్తువులు కొంటున్నారా?

పండగల వేళ ఎన్నో రాయితీలు.. చేతిలో డబ్బు లేకున్నా కోరుకున్న ఉత్పత్తులను ఇంటికి తీసుకొచ్చేందుకు వీలుగా రుణ సదుపాయాలు.. ప్రధానంగా సున్నా వడ్డీతో వాయిదాల (జీరో కాస్ట్‌ ఈఎంఐ) సౌలభ్యం ఎంతోమందిని ఆకర్షిస్తుంటుంది.

  • టీమ్‌ఇండియాకు అలాంటోడు అవసరం: సచిన్‌

పొట్టి ప్రపంచకప్​లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిగ్గజ క్రికెటర్​ సచిన్‌ తెందుల్కర్‌.. టీమ్​ఇండియాకు సలహాలు ఇచ్చాడు. జట్టుకు ఎలాంటి ఆటగాడు అవసరమో చెప్పాడు. ఇంకా ఏమన్నాడంటే..

  • సలార్ నుంచి​ సూపర్ అప్డేట్​.. 'కాంతార'ను మించేలా..

సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో ప్రభాస్‌ 'సలార్' ‌ఒకటి. భారీ యాక్షన్​ సన్నివేశాలతో పాన్‌ఇండియా స్థాయిలో రానున్న ఈ సినిమాపై ఫ్యాన్స్​ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కేజీయఫ్‌ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గురించి తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.