ETV Bharat / city

ఈటీవీ భారత్​ ముఖ్యాంశాలు

author img

By

Published : Nov 29, 2021, 6:02 AM IST

Updated : Nov 29, 2021, 9:57 PM IST

ETV BHARAT
ఈటీవీ భారత్

21:52 November 29

టాప్ న్యూస్ @ 10PM

  • ' కొనుగోలు కేంద్రాలు ఉండవు'

రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలపై సీఎం కేసీఆర్​ కీలక ప్రకటన చేశారు. బాయిల్డ్ రైస్​ కొనేది లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పిందన్న సీఎం.. ఎంత పోరాడినా ఒప్పుకోవట్లేదని తెలిపారు. ధాన్యం పండించి రైతులు నష్టపోవద్దనే ధైర్యంగా ప్రకటన చేస్తున్నామన్న కేసీఆర్​.. యాసంగి పంటకు కొనుగోలు కేంద్రాలు ఉండవని స్పష్టం చేశారు.

  • జబల్‌పుర్‌లో దారుణ హత్య

మధ్యప్రదేశ్​లోని జబల్​పుర్​లో దారుణ (madhya pradesh farmer killed news) హత్య జరిగింది. ఓ రైతును పొలంలోనే హత్య చేసి పారిపోయారు కొందరు దుండగులు. తలను మొండెం నుంచి వేరు చేసి నిందితులు తమతో పాటు తీసుకెళ్లారని పోలీసులు తెలిపారు.

  • జిన్​పింగ్​ 'మాస్టర్​ ప్లాన్'​.. కొత్తగా 3 లక్షల మంది!

china recruitment for military: భవిష్యత్తు అవసరాల దృష్ట్యా చైనా తన సైన్యాన్ని మరింత పెంచుకోవాలని చూస్తోంది. ఈ మేరకు ఆ దేశాధ్యక్షుడు జింగ్​ పింగ్​ సైనిక అధికారులకు సుమారు 3 లక్షల మందిని నియమించుకోవాలని సూచించారు. రాబోయే యుద్ధాల్లో చైనా పై చేయి సాధించడానికి టెక్నాలజీలో పట్టున్న యువకులను తీసుకోవాలని స్పష్టం చేశారు.

  • ట్విట్టర్ సీఈఓగా భారతీయుడికే ఛాన్స్

ట్విట్టర్ సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు జాక్ డోర్సీ ప్రకటించారు. పరాగ్ అగర్వాల్ తదుపరి సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలిపారు.

  • వివాహ బంధంలోకి టీమ్ఇండియా క్రికెటర్

Rahul Tewatia Wedding: టీమ్ఇండియా, రాజస్థాన్ రాయల్స్ క్రికెటర్ రాహుల్ తెవాటియా వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. ప్రేయసి రిధి పన్నుతో ఇతడి వివాహం సోమవారం ఘనంగా జరిగింది.

20:50 November 29

టాప్ న్యూస్ @ 9PM

  • ' కొనుగోలు కేంద్రాలు ఉండవు'

రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలపై సీఎం కేసీఆర్​ కీలక ప్రకటన చేశారు. బాయిల్డ్ రైస్​ కొనేది లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పిందన్న సీఎం.. ఎంత పోరాడినా ఒప్పుకోవట్లేదని తెలిపారు. ధాన్యం పండించి రైతులు నష్టపోవద్దనే ధైర్యంగా ప్రకటన చేస్తున్నామన్న కేసీఆర్​.. యాసంగి పంటకు కొనుగోలు కేంద్రాలు ఉండవని స్పష్టం చేశారు.

  • 'మీకేం పనిలేదా.. మళ్లీ వచ్చారన్నారు'

సాగురంగాన్ని మొత్తం కేంద్రం... అంబానీ, అదానీ(ambani, adani) చేతిలో పెట్టాలని చూసిందని సీఎం కేసీఆర్​ విమర్శించారు (cm kcr on paddy procurement). వాస్తవం గ్రహించిన ఉత్తరాది రైతులు ఉద్యమానికి దిగారని... రైతుల పోరాటం, యూపీ ఎన్నికలు చూసి సాగు చట్టాలు రద్దు చేశారని పేర్కొన్నారు. వద్దంటే వినకుండా సాగుచట్టాలు చేసి 700 మంది రైతులను చంపారని ఆరోపించారు.

  • 'సాగు చట్టాల రద్దు' బిల్లుకు​ ఆమోదం

విపక్షాల ఆందోళనల మధ్యే సాగు చట్టాల రద్దు బిల్లుకు పార్లమెంట్​ ఆమోదం తెలిపింది. మూజువాణి ఓటు ద్వారా ముందుగా లోక్​సభలో ఆమోదం తెలిపింది. ఆ తర్వాత మధ్యాహ్నం రాజ్యసభలో ప్రవేశపెట్టగా.. ఎలాంటి చర్చ లేకుండానే బిల్లుకు ఆమోదం లభించింది. విపక్షాల ఆందోళనలతో ఉభయ సభలు మంగళవారానికి వాయిదా పడ్డాయి. మరోవైపు.. 12మంది రాజ్యసభ సభ్యులపై వేటు పడింది.

  • ​ అంత్యక్రియలు పూర్తి

ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ అంత్యక్రియలు.. హైదరాబాద్​లో ఆదివారం పూర్తయ్యాయి. అంతకు ముందు మాస్టర్ పార్థివ దేహాన్ని హీరో రాజశేఖర్ సందర్శించారు.

  • ఒక్క వికెట్ దూరంలో నిలిచిన భారత్

భారత్-న్యూజిలాండ్ మధ్య కాన్పూర్ వేదికగా జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. ఐదో రోజు కివీస్ బ్యాటర్లు పట్టుదలతో ఆడటం వల్ల భారత బౌలర్లు ఆలౌట్ చేయడంలో విఫలమయ్యారు.

19:51 November 29

టాప్ న్యూస్ @ 8PM

  • 'దమ్ముంటే బాయిల్డ్​ రైస్​ కొనిపించు..'

కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రి కిషన్​రెడ్డిపై సీఎం కేసీఆర్​ తీవ్రంగా మండిపడ్డారు. కేంద్రంలోని భాజపా.. రైతు వ్యతిరేక విధానాన్ని అవలంభిస్తోందని ధ్వజమెత్తారు. కేంద్రం చిల్లర కొట్టు షావుకారిగా మాట్లాడకూడదని సూచించారు.

  • కోటి రూపాయల బంగారం పట్టివేత

భాగ్యనగరంలో భారీస్థాయిలో అక్రమ బంగారం(gold seized) పట్టుకున్నారు. విమానాశ్రయ క్యాటరింగ్ ఉద్యోగి వద్ద నుంచి 2 కిలోల పసిడిని డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం(two kgs of gold) చేసుకున్నారు. ఆ బంగారం విలువ కోటి రూపాయలు ఉంటుందని తెలిపారు.

  • మ్యాన్​హోల్​లో పడిన కార్మికుడు

మ్యాన్​హోల్​లో పనిచేసేందుకు దిగిన ఓ కార్మికుడు పొరపాటున 30 అడుగుల లోతున చిక్కుకుపోయాడు(Labour stucks in manhole). ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​ వారణాసి జిల్లాలోని(Varansi labour trapped in manhole) లహురా​బీర్​ ప్రాంతంలో జరిగింది

  • ​ 'రాధేశ్యామ్'​ ​ టీజర్​ వచ్చేసింది​

'రాధేశ్యామ్'లోని రెండో గీతానికి సంబంధించిన టీజర్​ విడుదలైంది. తెలుగు,తమిళ, కన్నడ, మలయాళ వెర్షన్​లో ఈ ప్రోమోనూ రిలీజ్ చేసింది చిత్రబృందం. పూర్తి పాటను డిసెంబరు 1న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించింది.

  • డబ్ల్యూటీసీలో భారత్ స్థానం ఎంతంటే?

WTC 2021-23 Points Table: భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. ఈ నేపథ్యంలో టెస్టు ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో టీమ్ఇండియా రెండవ స్థానానికి చేరుకుంది. న్యూజిలాండ్ ఐదో స్థానంలో నిలిచింది.

18:52 November 29

టాప్ న్యూస్ @ 7PM

  • ముగిసిన మంత్రివర్గ సమావేశం

హైదరాబాద్‌లో ఇవాళ జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది.సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ భేటీ జరిగింది. ధాన్యం కొనుగోళ్లు, యాసంగి సాగుపై మంత్రివర్గం చర్చించింది.

  • ఒమిక్రాన్ కేసులు లేవు.. కానీ..!

దేశంలో ఒమిక్రాన్ కేసులు (Omicron variant in India) బయటపడనప్పటికీ.. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వారి నమూనాల్లో గుర్తు తెలియని వేరియంట్ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. బెంగళూరుకు వచ్చిన ఓ వ్యక్తి నమూనాలో డెల్టా కంటే భిన్నమైన వేరియంట్​ ఉన్నట్లు కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు. దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చిన మరో ఇద్దరికి సైతం కొవిడ్ సోకింది.

  • రైతు సంఘాలు డెడ్​లైన్​!

నూతన వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలపడం.. రైతులు సాధించిన విజయం అని పంజాబ్ రైతు నేతలు పేర్కొన్నారు. కేంద్రం తమ డిమాండ్లను నెరవేర్చేందుకు నవంబరు 30వరకు సమయం ఉందని చెప్పారు.

  • సిరివెన్నెల హెల్త్​ బులిటెన్​

అస్వస్థకు గురై కిమ్స్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి హెల్త్​ బులిటెన్​ విడుదల చేశారు వైద్యులు. సిరివెన్నెల న్యూమోనియాతో బాధపడుతున్నట్లు తెలిపిన వైద్యులు.. ఆయన్ను వైద్యనిపుణుల బృందం పరిశీలిస్తోందని చెప్పారు.

  • "ఆ నిర్ణయం వారి చేతుల్లోనే"

కాన్పూర్ వేదికగా భారత్​-న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. భారత బౌలర్లు చివరి బంతి వరకు పోరాడినా.. కివీస్ టెయిలెండర్లు రచిన్ రవీంద్ర, అజాజ్ పటేల్ వికెట్ పడకుండా అడ్డుకున్నారు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన ఇరుజట్ల కెప్టెన్లు ఇదొక గొప్ప అనుభవమని తెలిపారు.

17:55 November 29

టాప్ న్యూస్ @ 6PM

  • 12 మందిపై సస్పెన్షన్ వేటు​

పార్లమెంట్​ శీతాకాల సమావేశాల(parliament winter session) తొలిరోజునే 12 మంది రాజ్యసభ ఎంపీలపై వేటు పడింది(rajya sabha mps suspended). వర్షాకాల సమావేశాల్లో ప్రవర్తనపై క్రమశిక్షణా చర్యల కింద కాంగ్రెస్​, శివసేన, టీఎంసీ సహా పలు పార్టీల నేతలను సస్పెండ్​ చేసింది రాజ్యసభ. ఈ నేపథ్యంలో మంగళవారం అత్యవసర భేటీకి పిలుపునిచ్చాయి విపక్షాలు.

  • ఒమిక్రాన్​పై అప్రమత్తం

కొవిడ్​ కొత్త వేరియంట్​ ఒమిక్రాన్​పై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కొవిడ్‌, వ్యాక్సినేషన్‌పై మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది.

  • 'ఆ ప్రతిపాదనేది లేదు'

Bitcoin News India Government : బిట్​కాయిన్​ను కరెన్సీగా గుర్తించే ప్రతిపాదననేదీ తమ వద్ద లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మాలా సీతా రామన్​ ప్రశ్నోత్తరాల సమయంలో లోక్​సభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు.

  • 'గుడ్​లక్​ సఖి' సెన్సార్​ పూర్తి..

కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చాయి. ఇందులో కీర్తిసురేశ్​, రణ్​వీర్​ సింగ్​-అలియా భట్​, అమితాబ్​ బచ్చన్​-రకుల్​ ప్రీత్​ సింగ్​ చిత్రాల వివరాలు ఉన్నాయి.

  • శార్దూల్​ ఠాకూర్ నిశ్చితార్థం

Shardul Thakur Engagement: టీమ్​ఇండియా పేసర్ శార్దూల్ ఠాకూర్, తన ప్రేయసి మిథాలీ పారుల్కర్​కు నిశ్చితార్థం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి.

16:43 November 29

టాప్ న్యూస్ @ 5PM

  • డ్రాగా ముగిసిన తొలి టెస్టు

భారత్-న్యూజిలాండ్ మధ్య కాన్పూర్ వేదికగా జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. ఐదో రోజు కివీస్ బ్యాటర్లు పట్టుదలతో ఆడటం వల్ల భారత బౌలర్లు ఆలౌట్ చేయడంలో విఫలమయ్యారు.

  • 'ఎలా చెప్పిందో నిరూపించండి'

పుత్రవాత్సల్యం కోసం రైతులను ఆగం చేయొద్దని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌ మొండివైఖరి వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. ధాన్యం విషయంలో లేని సమస్యను పట్టుకుని ఆందోళన చేస్తున్నారని విమర్శించారు.

  • 3 అడుగుల వరుడు.. 2 అడుగుల వధువు..

కర్ణాటకలో జరిగిన ఓ పెళ్లి అందరి దృష్టిని ఆకర్షించింది. మూడు అడుగుల వరుడు రెండు అడుగుల వధువు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వేద మంత్రాల సాక్షిగా సాంప్రదాయబద్ధంగా వీరి వివాహం ఘనంగా జరిగింది. వైవాహిక బంధంలోకి అడుగిడిన ఈ నవ దంపతుల చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

  • శిల్పా కస్టడీకి పోలీసుల పిటిషన్‌

అధిక వడ్డీ ఇస్తానంటూ కోట్ల రూపాయలు మోసాలకు పాల్పడిన శిల్పాచౌదరి బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. తన వద్ద 2.4 కోట్లు తీసుకుని మోసం చేసిందని నార్సింగి ఠాణాలో మరో మహిళ ఫిర్యాదు చేశారు.

  • 'ఆర్​ఆర్​ఆర్​' ​ రిలీజ్​కు డేట్​ ఫిక్స్​

RRR movie trailer: రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్​ఆర్​ఆర్'​ సినిమా ట్రైలర్​ డిసెంబరు 3న విడుదల చేయనున్నట్లు తెలిపింది చిత్రబృందం. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

15:55 November 29

టాప్ న్యూస్ @ 4PM

  • కొనసాగుతున్న కేబినెట్​ భేటీ

ప్రగతి భవన్​లో ముఖ్యమంత్రి కేసీఆర్​ అధ్యక్షతన భేటీ అయిన కేబినెట్ కొనసాగుతోంది. ధాన్యం కొనుగోళ్లు, యాసంగి సాగు, రాష్ట్రంలో కొవిడ్​ పరిస్థితులు, ప్రజారోగ్యం, వైద్యారోగ్యశాఖ సన్నద్ధత, కార్యాచరణ, రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ టీకాల పురోగతి, కరోనా పరీక్షలు ఎక్కువగా చేసేందుకు అవసరమైన సన్నద్ధత, మందుల లభ్యత, ఆక్సిజన్ పడకల సామర్థ్యం, తదితర అంశాలపై మంత్రివర్గం సమీక్ష నిర్వహించింది.

  • ఆ మహిళ కోసం వేట

omicron variant: 'ఒమిక్రాన్' ప్రపంచ దేశాలకు విస్తరిస్తున్న క్రమంలో.. దక్షిణాఫ్రికా నుంచి మధ్యప్రదేశ్​కు వచ్చిన మహిళ కోసం గాలిస్తున్నారు అధికారులు. ఈ నెల 18న ఆమె జబల్​పుర్​కు వచ్చినట్లు ఓ అధికారి తెలిపారు.

  • వారెంట్​ రద్దు

బలవంతపు వసూళ్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముంబయి మాజీ పోలీసు కమిషనర్​ పరమ్​బీర్​ సింగ్​పై(Param Bir Singh News) ​ బెయిలబుల్​ వారెంట్​ను రద్దు చేసింది విచారణ కమిషన్​. సోమవారం విచారణకు హాజరైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

  • విదేశాలకు కొవాగ్జిన్​

నవంబర్‌లో విదేశాలకు కొవాగ్జిన్‌ ఎగుమతులు (covaxin export news) ప్రారంభించినట్లు భారత్‌ బయోటెక్‌ తెలిపింది. ఎంతో కాలంగా పెండింగ్​లో ఉన్న ఎగుమతుల ఆర్డర్లను సరఫరా చేస్తున్నట్లు వెల్లడించింది. ఎగుమతులకు అనుమతి ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పింది.

  • బిగ్​బాస్​ ఫైర్​

Bigboss warns Priyanka: టాప్​-7 కంటెస్టెంట్స్​తో బిగ్​బాస్ హౌస్​లో నామినేషన్​ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ క్రమంలోనే బిగ్​బాస్​ ప్రియాంకపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. నేరుగా నామినేట్​ చేస్తానని ఆమెను హెచ్చరించాడు.

14:38 November 29

టాప్ న్యూస్ @ 3PM

  • ధాన్యం కొనుగోళ్లపై పిల్

ధాన్యం కొనేలా రాష్ట్రాన్ని ఆదేశించాలని హైకోర్టులో పిల్ దాఖలైంది. న్యాయ విద్యార్థి బొమ్మనగారి శ్రీకర్ పిల్ దాఖలు చేశారు.

  • వాటిపైనే చర్చ

హైదరాబాద్ ప్రగతిభవన్​లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ధాన్యం కొనుగోళ్లు, యాసంగి సాగుపై మంత్రివర్గంలో చర్చించనున్నారు.

  • ఆందోళనల మధ్యే ఆమోదం

నూతన సాగు చట్టాల రద్దు బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. విపక్షాల ఆందోళనల మధ్యే మూజువాణి ఓటు ద్వారా బిల్లును ఆమోదించారు. ఆ తర్వాత 30 నిమిషాల పాటు సభను వాయిదా వేశారు.

  • మాస్టర్​ అంత్యక్రియలు పూర్తి

ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ అంత్యక్రియలు.. హైదరాబాద్​లో ఆదివారం పూర్తయ్యాయి. అంతకు ముందు మాస్టర్ పార్థివ దేహాన్ని హీరో రాజశేఖర్ సందర్శించారు.

  • ఆ జాబితాలో మూడోస్థానం

టెస్టుల్లో టీమ్​ఇండియా స్పిన్​ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్​ అరుదైన ఘనత సాధించాడు. దిగ్గజ స్పిన్నర్​ హర్భజన్​ను వెనక్కినెట్టి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మూడో స్థానానికి చేరాడు.

13:51 November 29

టాప్ న్యూస్ @ 2PM

  • 'సాగు చట్టాల రద్దు' బిల్లుకు లోక్​సభ ఆమోదం

పార్లమెంట్​ శీతాకాల సమావేశాల(Parliament winter sessions) తొలిరోజే గందరగోళ పరిస్థితులు కనిపించాయి. రైతు సమస్యలు సహా పలు అంశాలను లేవనెత్తుతూ విపక్ష సభ్యులు నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలోనే లోక్​సభలో సాగు చట్టాల రద్దు బిల్లును(The Farm Laws Repeal Bill 2021) కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​ ప్రవేశపెట్టగా.. ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదం పొందింది.

  • వరంగల్​లో క్రికెట్‌ బెట్టింగ్‌ గ్యాంగ్

Warangal Cricket betting gang arrest: వరంగల్​లో క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బెట్టింగ్‌కు పాల్పడుతున్న బుకీలు అభయ్, ప్రసాద్ అరెస్టు చేసి... నిందితుల నుంచి రూ.2.05 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ముంబయి కేంద్రంగా ఆన్‌లైన్‌లో క్రికెట్‌ బెట్టింగ్, పేకాట నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

  • రోగి, వైద్యుడు మృతిపై మంత్రి హరీశ్ స్పందన

Gandhari heart attack: గాంధారి మండలంలో రోగి, వైద్యుడు మృత్యువాత పడిన ఘటనపై మంత్రి హరీశ్ రావు స్పందించారు. రోగికి చికిత్స అందిస్తూనే వైద్యుడు మృతిచెందడం బాధాకరమని ట్వీట్ చేశారు.

  • చిన్న మాత్ర నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది

Ben Stokes Ahead of Ashes 2021: ఇంగ్లాండ్​ ఆల్​రౌండర్ బెన్ స్టోక్స్​ జీవితంలో తను ఎదుర్కొన్న సంక్లిష్ట పరిస్థితుల గురించి చెప్పుకొచ్చాడు. ఓ చిన్న మాత్ర తనను ఉక్కిరిబిక్కిరి చేసిందని అన్నాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ యాషెస్ సిరీస్​ త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశాడు.

  • 2000 అడుగుల ఎత్తులో స్టంట్​ చేసిన హాలీవుడ్ హీరో

హాలీవుడ్​ ప్రముఖ కథానాయకుడు టామ్ క్రూజ్ అదిరిపోయే ఫీట్ చేశాడు. ఏకంగా రెండు వేల అడుగుల ఎత్తులో విమానంపై సాహసం చేశాడు.

13:45 November 29

టాప్ న్యూస్ @ 1PM

  • లోక్‌స‌భ‌లో తెరాస ఎంపీల ఆందోళ‌న‌..

Parliament Winter Sessions 2021: పార్ల‌మెంట్‌లో తొలి రోజే ర‌భ‌స మొద‌లైంది. లోక్‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల‌ను ర‌ద్దు చేసి రైతు స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించాల‌ని విప‌క్షాలు డిమాండ్ చేశాయి. తెలంగాణ మార్కెట్ యార్డుల్లో మ‌క్కిపోతున్న ధాన్యాన్ని కొనుగోలు చేయాల‌ని తెరాస ఎంపీలు డిమాండ్ చేశారు.

  • వంట చేస్తుండగా పేలిన గ్యాస్ సిలిండర్

Cylinder blast Peddapalli : పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీలోని ఓ ప్రమాదం జరిగింది. వంట చేస్తుండగా.. గ్యాస్ పైపు ఊడిపోయి మంటలు వ్యాపించాయి. ఇల్లాలి అరుపులతో వంటగదిలోకి వచ్చిన మరో ఇద్దరు మంటలు ఆర్పడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ముగ్గురికి గాయాలయ్యాయి. వారి అరుపులు విన్న చుట్టుపక్కల వారు ఇంట్లోకి వచ్చి చూసేసరికి ముగ్గురు మంటల్లో కాలిపోతున్నారు. వెంటనే వారు మంటలు ఆర్పి వారిని మంథని ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించారు.

  • కుక్కను చూసినా భయంతో..

Ghaziabad Leopard News: ఉత్తర్​ప్రదేశ్​ గాజియాబాద్​లోని ప్రజలను ఓ చిరుతపులి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. నగరంలో చిరుత సంచరిస్తుండటం వల్ల ప్రజలు ఇళ్లనుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఒక్కోసారి వీధికుక్కను చూసినా చిరుత అని భ్రమపడుతూ.. తమకు ఫోన్​లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

  • షేన్​ వార్న్​కు బైక్​ యాక్సిడెంట్​

Shane Warne Accident: ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ షేన్​ వార్న్​ బైక్​ నడుపుతూ కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో స్వల్పంగా గాయాలైనట్లు వార్న్ వెల్లడించాడు.

  • విక్కీ-కత్రినా పెళ్లి.. అతిథుల కోసం 45 హోటల్స్!

డిసెంబరు రెండో వారంలో విక్కీ కౌశల్-కత్రినా కైఫ్ వివాహం జరగనుంది! ఈ వేడుకకు వచ్చే గెస్ట్​ల కోసం భారీగా హోటల్స్​ బుక్​ చేసినట్లు తెలుస్తోంది.

12:00 November 29

టాప్ న్యూస్ @ 12PM

  • తమిళనాడులో ఆ ప్రాంతాలు జలదిగ్బంధం

తమిళనాడులో వర్షాల ప్రభావం ఇంకా కొనసాగుతోంది. చెన్నై, తిరుచ్చి సహా పలు ప్రాంతాలు (Tamil Nadu News) నీట మునిగాయి. 11 జిల్లాల్లోని స్కూల్స్​, కాలేజీలకు ప్రభుత్వం సోమవారం సెలవు ప్రకటించింది.

  • అన్ని సమస్యలపై చర్చకు సిద్ధం

Winter Session 2021: అన్ని సమస్యలపైనా చర్చించేందుకు, వాటికి సమాధానాలు చెప్పేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్రమోదీ(Pm modi news) స్పష్టం చేశారు. శీతాకాల సమావేశాల నేపథ్యంలో పార్లమెంట్ ఆవరణలో ఆయన ప్రసంగించారు.

  • మరియమ్మ కేసు ముగింపు బాధ్యత ప్రభుత్వానిదే

Mariamma Custodial Death case: మరియమ్మ మృతిపై సీబీఐ దర్యాప్తు అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్ర పోలీసుల దర్యాప్తు సరైన రీతిలోనే జరుగుతోందని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. మరియమ్మ కస్టోడియల్ మృతిపై విచారణ ముగించిన హైకోర్టు.. ఈ కేసులో తార్కిక ముగింపు తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అభిప్రాయపడింది.

  • లంచ్ విరామానికి 79/1

IND vs NZ 1st Test: భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు ఐదో రోజు ఆట లంచ్​ విరామానికి కివీస్ ఒక వికెట్ కోల్పోయి 79 పరుగులు చేసింది. ఓపెనర్ లాథమ్, బ్యాటర్​ సోమర్​విల్లే ఆచితూచి ఆడుతున్నారు.

  • 'పుష్ప' ట్రైలర్ రిలీజ్ డేట్

'పుష్ప' ట్రైలర్​ రిలీజ్ ఎప్పుడు చేస్తారో ప్రకటించారు. డిసెంబరు 6న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు. దీంతో అభిమానుల ఇప్పుడు నుంచే కౌంట్​డౌన్ మొదలుపెట్టేశారు.

10:47 November 29

టాప్​న్యూస్ @ 11AM

  • 10 క్వింటాళ్ల గంజాయి పట్టివేత

తెలుగు రాష్ట్రాల్లో గంజాయి రవాణా విచ్చలవిడిగా సాగుతోంది. ప్రభుత్వం, పోలీసులు ఎంత ప్రయత్నించినా.. ఈ దందా ఆగట్లేదు. ఎక్కడికక్కడే రవాణాలు అడ్డుకుంటున్నా ఏదో మూల గంజాయి రవాణా జరుగుతూనే ఉంది. తాజాగా సంగారెడ్డి జిల్లాలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు.

  • అల్లారం మోగినా వినిపించుకోలే..

ATM robbery news : ఏటీఎం చోరీకి పాల్పడుతూ ఓ రెడ్​హ్యాండెడ్​గా పోలీసులకు చిక్కాడు. నిజామాబాద్​ నగరంలోని ఓ ఏటీఎంలోకి సునీల్ అనే వ్యక్తి డబ్బులు తీయడానికి యత్నిస్తుండగా పట్టుబడ్డాడు.

  • NCP మహిళా ఎంపీతో శివసేన ఎంపీ స్టెప్పులు

రాజకీయాల్లో క్షణం తీరిక లేకుండా గడిపే శివసేన నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్​.. ఉత్సాహంగా స్టెప్పులేశారు. ముంబయిలోని ఓ సెవెన్ స్టార్ హోటల్ దీనికి వేదికైంది. ఆయన కుమార్తె వివాహాన్ని పురస్కరించుకుని నిర్వహించిన సంగీత్​లో ఈ దృశ్యం కనిపించింది. డ్యాన్స్ మధ్యలో.. ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలేనూ డ్యాన్స్ చేసేందుకు ఆహ్వానించారు రౌత్. ఆమెతో కలసి నృత్యం చేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. రౌత్ కుమార్తె పూర్వశి- హిచి మల్హర్ నర్వేకర్‌ల వివాహం సోమవారం జరగనుంది. మల్హర్ నర్వేకర్ ఠాణె జిల్లా కలెక్టర్ రాజేష్ నర్వేకర్ కుమారుడు.

  • కెరీర్‌ మొత్తం వర్ణ వివక్షకు గురయ్యా

ఇంగ్లాండ్‌ కౌంటీ క్రికెట్లో జాతి వివక్షపై(Colour discrimination in Cricket) దుమారం రేపుతున్న నేపథ్యంలో భారత మాజీ లెగ్‌ స్పిన్నర్‌ లక్ష్మణ్‌ శివరామకృష్ణన్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన కెరీర్‌ ఆసాంతం వర్ణ వివక్షతకు గురైనట్లు ట్వీట్​ చేశాడు.

  • 'బింబిసార' టీజర్​ నెక్ట్స్ లెవల్!

హీరో కల్యాణ్​రామ్ కొత్త సినిమా 'బింబిసార'ను అదిరిపోయే రేంజ్​లో తెరకెక్కిస్తున్నారు. సోమవారం రిలీజైన టీజర్​.. ఈ విషయాన్ని చెబుతోంది. ఇంకెందుకు ఆలస్యం ఆ టీజర్​ను మీరు చూసేయండి.

09:44 November 29

టాప్​న్యూస్ @ 10AM

  • దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా

ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగిస్తున్న ఒమిక్రాన్​ వేరియంట్ (Omicron Variant in India)​ భారత్​లో కూడా వ్యాపించిందా? ఇటీవల దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చిన మహారాష్ట్ర వాసికి కరోనా పాజిటివ్​ రావడం వల్ల వ్యక్తమవుతున్న సందేహాం ఇది. అయితే ఒమిక్రాన్​ సోకిన విషయంపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదంటున్నారు అధికారులు.

  • భారత్​ @ 8,309 కేసులు

Covid Cases in India Today: భారత్​లో కొత్తగా 8,309 కొవిడ్​ కేసులు (covid cases in India) నమోదయ్యాయి. వైరస్​ ధాటికి మరో 236 మంది మరణించారు. ఒక్కరోజే 9,905 మందికిపైగా కరోనా నుంచి కోలుకున్నారు.

  • మత్తుకు బానిసలై 385 మంది బలవన్మరణం

Drug Addicts suicide in AP : మద్యం, మాదకద్రవ్యాలకు బానిసలై బలవన్మరణాలకు పాల్పడుతున్న వారి సంఖ్య ఏపీలో గణనీయంగా పెరుగుతోంది. గతేడాది రికార్డు స్థాయిలో మత్తుకు బానిసలైన 385 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఈ లెక్కల్లో మహిళలు సైతం ఉన్నారు.

  • ధోనీ వారుసుడిగా అతనే సరైనోడు..

చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టు తదుపరి కెప్టెన్​గా(CSK next captain) ఆ క్రికెటర్ సరైనోడు అని మాజీ క్రికెటర్​ సైమన్​ డౌల్​ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్​లో గత రెండు సీజన్లలో బ్యాటుతో రాణిస్తున్న ఆ బ్యాటర్.. ధోనీ వారసుడు అవుతాడని పేర్కొన్నాడు. ఇంతకీ ఆ ఆటగాడు ఎవరంటే?

  • 'ఢీ' ఫినాలే గెస్ట్​గా బన్నీ

'ఢీ' ఫినాలే ఎపిసోడ్ లేటెస్ట్ ప్రోమో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆద్యంతం ఆకట్టుకుంటూ పూర్తి ఎపిసోడ్​పై అంచనాల్ని పెంచుతోంది.

08:46 November 29

టాప్​న్యూస్ @ 9AM

  • ఎన్నికల వేళ శీతాకాల సమావేశాలు

winter session 2021: సోమవారం నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పెగసస్​ వ్యవహారం, నిరుద్యోగం, ఇంధన ధరల పెరుగుదల, కనీసమద్దతు ధరపై చట్టం.. తదితర అంశాల్లో కేంద్రంపై ప్రశ్నలను సంధించేందుకు ప్రతిపక్షాలు సన్నద్ధమయ్యాయి. ఉత్తర్‌ ప్రదేశ్‌తోపాటు మరో నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల నగారా మోగనుంది. దాంతో అన్ని పార్టీలు సమావేశాలను ఆ ఎన్నికలకు వేదికగా మలచుకునేందుకు సిద్ధమవుతున్నాయి.

  • కాశీ విశ్వనాథుడు కరుణించేది ఎవరినో?

ఉత్తర్​ప్రదేశ్​ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఎత్తులు, పై ఎత్తులతో ముందుకెళ్తున్నాయి. ఇన్నాళ్లు అయోధ్య కేంద్రంగా నడిచిన రాజకీయాలు, ఇప్పుడు కాశీ విశ్వనాథ అలయం పైవుకు మళ్లాయి. మోదీ త్వరలో కాశీ విశ్వనాథ్​ ఆలయ ధామ్ ప్రారంభించనుండటమే ఇందుకు కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

  • మూడో ముప్పును ఎదుర్కొనేందుకు సిద్ధం

Omicron Covid Variant Cases: ప్రపంచదేశాలను వణికిస్తున్న ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రభావం, దానిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ప్రజలు మాస్కు ధారణ, భౌతిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలని సూచించింది. డెల్టా కన్నా ఒమిక్రాన్‌ తీవ్రత 30 రెట్లు ఎక్కువ(Omicron is More Dangerous Than DELTA)గా ఉంటుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్న వేళ.. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరింది.

  • నేటి నుంచి సాగర్‌, శ్రీశైలం లాంచీ ప్రయాణం

Nagarjuna Sagar Boating : నేటి నుంచి సాగర్‌, శ్రీశైలం మధ్య లాంచీ ప్రయాణం (Nagarjuna Sagar And Srisailam Boat Journey) ప్రారంభం కానుంది. ఉదయం 9 గంటలకు సాగర్​ నుంచి బయలుదేరి.. సాయంత్రం 3 గంటలకు శ్రీశైలం చేరుకుంటుంది.

  • 'అరుంధతి' సాంగ్​కు 32 రోజులు

దాదాపు 800లకు పైగా పాటల్ని కొరియోగ్రాఫీ చేసిన శివశంకర్​ మాస్టర్.. ఆదివారం తుదిశ్వాస విడిచారు. అయితే తన కెరీర్​లో మర్చిపోలేని రెండు పాటలు ఉన్నాయని ఆయన గతంలో చెప్పారు. వాటి గురించే ఈ ప్రత్యేక కథనం.

07:47 November 29

టాప్​న్యూస్ @ 8AM

  • భర్త కొట్టడం తప్పేమీ కాదంట..

National Family Health Survey: భార్యను భర్త కొట్టడం తప్పేమీ కాదని.. 14 రాష్ట్రాల్లో 30 శాతానికి పైగా మహిళలు అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోనైతే.. ఏకంగా 84శాతం మంది మహిళలు అది తప్పు కాదని తెలిపారు.

  • 'మెరుగైన పనితీరుతోనే సమాధానం'

సభలో సమన్వయం కోసం ప్రభుత్వం తరఫున మంత్రులు ప్రతిపక్షాలతో నిరంతరం మాట్లాడుతూ ఉండాలని సూచించారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఆదివారం ఆయన నివాసంలో పలు పార్టీల నేతలతో భేటీ అయిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

  • చైనాకు హెచ్చరిక..

ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు కరోనా ఆంక్షలు సడలిస్తున్నప్పటికీ (China Covid Restrictions) చైనా మాత్రం సరిహద్దులను మూసివేయాలనే నిర్ణయించుకుంది. కొవిడ్​ కట్టడికి ఇతర దేశాల విధానాన్ని పాటిస్తే చైనాలో రోజుకు 6 లక్షలపైన కొవిడ్​ కేసులు బయటపడతాయని హెచ్చరించారు.

  • 'బిగ్​బాస్' నుంచి రవి ఎలిమినేట్..

ప్రేక్షకుల్ని ఇది ఆశ్చర్యపరిచే విషయం. బలమైన కంటెస్టెంట్స్​లో ఒకరైన రవి.. బిగ్​బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. రవికి తక్కువ ఓట్లు వచ్చాయని హోస్ట్ నాగార్జున చెప్పారు.

  • కెరీర్‌ మొత్తం వర్ణ వివక్షకు గురయ్యా..

ఇంగ్లాండ్‌ కౌంటీ క్రికెట్లో జాతి వివక్షపై(Colour discrimination in Cricket) దుమారం రేపుతున్న నేపథ్యంలో భారత మాజీ లెగ్‌ స్పిన్నర్‌ లక్ష్మణ్‌ శివరామకృష్ణన్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన కెరీర్‌ ఆసాంతం వర్ణ వివక్షతకు గురైనట్లు ట్వీట్​ చేశాడు.

06:43 November 29

టాప్​న్యూస్ @ 7AM

  • నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు (Parliament winter session 2021) వాడీవేడీగా జరిగే అవకాశం ఉంది. ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలతో సన్నద్ధమైన వేళ.. సోమవారం సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పెగసస్​, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, చైనా చొరబాట్లు వంటి అంశాలపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో ఆయా పార్టీలను దీటుగా ఎదుర్కొనేందుకు కేంద్రం సిద్ధమవుతోంది.

  • తిరుమల శ్రీవారి ఆలయ ఓయస్‌డీ డాలర్ శేషాద్రి హఠాన్మరణం

తిరుమల శ్రీవారి ఆలయ ఓయస్‌డీ డాలర్ శేషాద్రి హఠాన్మరణం చెందారు. కార్తిక దీపోత్సవం కోసం విశాఖ వెళ్లిన డాలర్ శేషాద్రికి వేకువజామున గుండెపోటు వచ్చింది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో తుదిశ్వాస విడిచారు.

  • వెలుగుచూసిన మూడో ఒమిక్రాన్ కేసు

ప్రపంచాన్ని గడగడ వణికిస్తున్న ఒమిక్రాన్ కరోనా వైరస్ కట్టడిపై బ్రిటన్​ అప్రమత్తమైంది. అక్కడ మూడో కేసు వెలుగుచూసిన నేపథ్యంలో పలు నిబంధనలు తప్పనిసరి చేసింది. బహిరంగ ప్రదేశాల్లో ఫేస్​మాస్క్​ను తప్పనిసరి చేసింది.

  • కర్ణాటక వాదన అవాస్తవం

Brijesh Kumar tribunal : బ్రిజేష్‌ ట్రైబ్యునల్‌ తీర్పును నోటిఫై చేయాలన్న... కర్ణాటక వాదనను తెలంగాణ వ్యతిరేకించింది. 2013లో ట్రైబ్యునల్‌ తీర్పు వస్తే ఇప్పటివరకు కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వలేదని... సుప్రీంకోర్టు తుది తీర్పునకు లోబడి అమలుచేసేలా నిర్ణయం తీసుకోవాలని కోరుతూ కర్ణాటక... ఈనెల తొలివారంలో సర్వోన్నత న్యాయస్థానంలో మధ్యంతర పిటిషన్‌ వేసింది. ఆ పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర అభిప్రాయాలను కోర్టు కోరింది. ఈ నేపథ్యంలో కర్ణాటక అభ్యర్థనను వ్యతిరేకిస్తూ... కొద్దిరోజుల క్రితం ఏపీ తాజాగా తెలంగాణ, మహారాష్ట్రలు అఫిడవిట్‌లు దాఖలు చేశాయి. కర్ణాటక వినతికి తెలంగాణ వ్యతిరేకత తెలపగా... మహారాష్ట్ర అనుకూలంగా స్పందించింది.

  • ప్రభాస్​పై సైఫ్ ప్రశంసలు

Saif Ali khan praises prabhas: స్టార్​ హీరో ప్రభాస్​ను ప్రశంసించారు బాలీవుడ్ ప్రముఖ​ నటుడు సైఫ్​ అలీఖాన్​. డార్లింగ్​ ఎంతో కూల్​గా ఉంటారని, గొప్ప నటుడని కితాబిచ్చారు.

05:26 November 29

ఈటీవీ భారత్​ ముఖ్యాంశాలు

  • మాడ్యూళ్ల ఏర్పాటు తప్పనిసరి

ధరణి సమస్యలపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం ప్రాథమిక జాబితాను రూపొందించింది. ఇప్పటికే రెండుసార్లు సమావేశమైన సంఘం దృష్టికి కీలక సమస్యలు వచ్చాయి. వాటిలో 46 సమస్యలకు ధరణి పోర్టల్‌లో సరైన మాడ్యూళ్లు లేవని గుర్తించారు.

  • ఇవాళ కేబినెట్ సమావేశం

యాసంగి పంటలసాగే ప్రధాన అజెండాగా... ఇవాళ రాష్ట్ర మంత్రివర్గం (TS Cabinet) సమావేశం కానుంది. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో వరిసాగు, ప్రత్యామ్నాయ పంటల అంశాన్ని కేబినెట్ తేల్చనుంది.

  • రాజీపడే ప్రసక్తే లేదు

ధాన్యం సేకరణ(Paddy Procurment)పై స్పష్టత కోసం పార్లమెంట్ ఉభయసభల్లో కేంద్రాన్ని నిలదీయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ (Cm Kcr) ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఆహార ధాన్యసేకరణలో జాతీయ సమగ్ర విధానాన్ని ప్రకటించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

  • మాదకద్రవ్యాల వలలో యువత

తొలుత రుచి చూడాలనే తహతహతో మత్తు ఊబిలోకి దిగిన చాలామంది..క్రమంగా బానిసలుగా మారుతున్నారు. అప్పటికిగానీ కుటుంబ సభ్యులు గుర్తించలేకపోతున్నారు. వారికి తెలిసేసరికే పరిస్థితి చేయి దాటిపోతుండటంతో ఆయా కుటుంబాల బాధ వర్ణనాతీతంగా ఉంటోంది.

  • భాజపా నిరసన ప్రదర్శనలు

తెరాస ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నేటి (bjp plans to state wide protests) నుంచి నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ (bjp state president) పిలుపునిచ్చారు.

  • ప్రమాదకరంగా ఒమిక్రాన్

AIIMS Chief on Omicron: ఎయిమ్స్​ చీఫ్​ డా. రణ్​దీప్​ గులేరియా.. కరోనా కొత్త వేరియంట్​పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఒమిక్రాన్​ స్పైక్​ ప్రోటీన్​లో 30కిపైగా మ్యుటేషన్లు ఉన్నట్టు పేర్కొన్నారు. ఎన్ని ఎక్కువ మ్యుటేషన్లు ఉంటే.. టీకాల సామర్థ్యం అంత తగ్గిపోతుందన్నారు.

  • వివాహ వేడుకలో అగ్నిప్రమాదం

మహారాష్ట్ర ఠాణె జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. భీవండిలోని ఓ మ్యారేజ్ హాల్‌లో వివాహ వేడుకలో ఈ మంటలు చెలరేగాయి. పార్కింగ్ స్థలంలో బాణాసంచా కాల్చడమే అగ్నిప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. ఈ ఘటనలో ప్రాణనష్టమేమీ జరగలేదని పోలీసులు తెలిపారు.

  • శివశంకర్ మాస్టర్ కన్నుమూత

Choreographer Shivashankar master died: ప్రముఖ నృత్య దర్శకుడు శివశంకర్ మాస్టర్(72) కన్నుమూశారు. కరోనాతో చికిత్స పొందుతూ గచ్చిబౌలి ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారాయన.

  • నాకు చెప్పింది అదే

Shreyas iyer on Rahul Dravid:న్యూజిలాండ్​తో తొలి టెస్టులో యువ బ్యాటర్ శ్రేయస్​ అయ్యర్ కీలక ఇన్నింగ్స్​ ఆడాడు. ఈ నేపథ్యంలో ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ అతడికి చెప్పిన విషయాలను వెల్లడించాడు. అధిక సమయం క్రీజ్‌లో నిలదొక్కుకోవాలని ద్రవిడ్ సూచించినట్లు పేర్కొన్నాడు.

Last Updated : Nov 29, 2021, 9:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.