ETV Bharat / sitara

'ఢీ' ఫినాలే గెస్ట్​గా బన్నీ.. కొత్త ప్రోమో 'తగ్గేదే లే'

author img

By

Published : Nov 29, 2021, 9:14 AM IST

allu arjun dhee promo
ఢీ షోలో అల్లు అర్జున్

'ఢీ' ఫినాలే ఎపిసోడ్ లేటెస్ట్ ప్రోమో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆద్యంతం ఆకట్టుకుంటూ పూర్తి ఎపిసోడ్​పై అంచనాల్ని పెంచుతోంది.

గత కొన్ని నెలల నుంచి టీవీ ప్రేక్షకుల్ని అలరిస్తూ వచ్చిన 'ఢీ: కింగ్స్ వర్సెస్ క్వీన్స్' తుది అంకానికి వచ్చేసింది. ఈ క్రమంలోనే ఈ డ్యాన్స్​ షోకు సంబంధించిన కొత్త ప్రోమో రిలీజైంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. గ్రాండ్ ఫినాలేకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ పూర్తి ఎపిసోడ్​.. డిసెంబరు 1న రాత్రి 9:30 గంటలకు ప్రసారం కానుంది.

అదిరిపోయే డ్యాన్స్​లతో పలువురు కంటెస్టెంట్​లు ప్రేక్షకులను అబ్బురపరిచారు. వీరికి తోడు సుధీర్-ప్రదీప్-ఆది చేసిన కామెడీ తెగ నవ్విస్తోంది.

'పుష్ప' ప్రమోషన్​లో భాగంగా అల్లు అర్జున్​.. పలు కార్యక్రమాల్లో సందడి చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే 'ఢీ'లోనూ సందడి చేశారు. తన కొత్త సినిమా 'పుష్ప'లోని 'ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా' సాంగ్​కు తనదైన మేనరిజంతో కనువిందు చేశారు.

డిసెంబరు 17న పాన్ ఇండియా స్థాయిలో 'పుష్ప' రిలీజ్​ కానుంది. ఇందులో బన్నీ సరసన రష్మిక నటించింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్య కథతో దీనిని తెరకెక్కించారు. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ తదితరులు కీలకపాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. సుకుమార్ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.