cabinet sub committee on Corona: కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌పై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కొవిడ్, వ్యాక్సినేషన్‌పై మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో.. మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి, సబిత సభ్యులుగా మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుచేస్తూ నిర్ణయం తీసుకొంది. ఒమిక్రాన్‌ను (Corona New Variant) ఎదుర్కొనే చర్యలు, వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసే ప్రక్రియను కేబినెట్ సబ్‌కమిటీ పర్యవేక్షణ చేయనుంది.
ప్రస్తుతం కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న కేబినెట్ భేటీలో.. కొవిడ్ కొత్త వేరియంట్ వల్ల ఎలాంటి పరిస్థితి ఏర్పడినా... ఎదుర్కొనేందుకు వైద్యారోగ్యశాఖ సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు. ప్రజారోగ్యం, వైద్యసేవలకు సంబంధించి శాఖ సన్నద్ధత, అనుసరిస్తున్న కార్యాచరణ, రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ టీకాల పురోగతి, ఔషధాల లభ్యత, ఆక్సిజన్ పడకలు, తదితర అంశాలపై ప్రధానంగా చర్చించారు. కరోనా పరీక్షల సంఖ్య పెంచేందుకు అవసరమైన ఏర్పాట్లపై కూడా సమావేశంలో చర్చించారు.
ఇదీచూడండి: