ETV Bharat / business

గోల్డ్ లోన్​ తీసుకోవాలా? ఏ బ్యాంకులో ఎంత వడ్డీ రేటు?

author img

By

Published : Mar 16, 2023, 4:45 PM IST

బంగారంపై చాలా బ్యాంకులు అప్పులిస్తున్నాయి. అయితే వీటిపై వడ్డీ రేట్లు ఒక్కో బ్యాంక్​లో ఒక్కోలా ఉంటాయి. ఏ బ్యాంక్​ ఎంత వడ్డీ వసూలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

gold-loan-interest-rate-2023-in-india
భారత్​లో​ బంగారు రుణ వడ్డీ రేటు 2023

బంగారాన్ని హామీగా పెట్టుకుని చాలా బ్యాంక్​లు​ కస్టమర్​లకు అప్పులు ఇస్తాయి. బయట తీసుకునే అప్పులతో పోలిస్తే.. బంగారం రుణాలపై బ్యాంక్​లు వసూలు చేసే వడ్డీలు చాలా తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా బంగారాన్ని హామీగా పెట్టి వీలైనంత త్వరగా బ్యాంక్​ను నుంచి రుణాలు పొందవచ్చు. బంగారంపై రుణాలకు కనిష్ఠ డాక్యుమెంటేషన్‌ పక్రియ పూర్తి చేస్తే సరిపోతుంది. ఈ అప్పులపై వడ్డీలు వినియోగదారుడు తీసుకునే మొత్తంపై ఆధారపడి ఉంటాయి. బంగారంపై రుణం కోసం ఆభరణాలను, నాణేలను తాకట్టు పెట్టవచ్చు. 18-22 క్యారెట్ల బంగారు ఆభరణాలను, బ్యాంకు ముద్రించిన బంగారు నాణేలను మాత్రమే హామీగా పెట్టి అప్పు తీసుకోవచ్చు. కాకపోతే బ్యాంకు ముద్రించిన బంగారు నాణేలపై.. ఒక క్లయింట్‌కు 50 గ్రాముల వరకు మాత్రమే అనుమతి ఉంటుంది.

బంగారు రుణాలపై వడ్డీ రేట్లు ఇలా..

  1. హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​.. బంగారంపై రుణాలకు కనిష్ఠంగా 7.20 శాతం వడ్డీ విధిస్తోంది. గరిష్ఠంగా 11.35 శాతం వడ్డీని వసూలు చేస్తోంది. ఈ బ్యాంక్​లో ప్రాసెసింగ్​ ఫీజు.. తీసుకున్న రుణ మొత్తంపై 1 శాతం ఉంటుంది.
  2. కొటక్ మహీంద్రా బ్యాంక్​.. బంగారు రుణాలపై కనిష్ఠంగా 8 శాతం వడ్డీని, గరిష్ఠంగా 17 శాతం వరకు వడ్డీని వసూలు చేస్తోంది. ఈ బ్యాంక్​లో బంగారు రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు.. తీసుకున్న మొత్తంపై 2 శాతంగా ఉంటుంది. దీనికి జీఎస్​టీ ఛార్జీలు అదనంగా ఉంటాయి.
  3. యూనియన్​ బ్యాంక్​.. బంగారంపై రుణాలకు కనిష్ఠంగా 8.40 శాతం వడ్డీని.. గరిష్ఠంగా 9.65 శాతం వడ్డీని విధిస్తోంది.
  4. సెంట్రల్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా.. బంగారంపై తీసుకున్న అప్పులకు కనిష్ఠంగా 8.45 శాతం వడ్డీని, గరిష్ఠంగా 8.55 శాతం వడ్డీని విధిస్తోంది. తీసుకున్న రుణంపై 0.50 శాతం ప్రాసెసింగ్​ ఫీజును వసూలు చేస్తోంది.
  5. యూకో బ్యాంక్​లో మాత్రం బంగారం రుణాలపై వడ్డీ రేటు 8.50 శాతం ఉంది. ప్రాసెసింగ్ ఫీజు రూ.250 నుంచి ఐదు వేల వరకు ఉంది.
  6. స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియాలో.. బంగారంపై వడ్డీ రేటు 8.55 శాతంగా ఉంది. ఈ బ్యాంక్​లో ప్రాసెసింగ్ ఫీజు.. తీసుకున్న మొత్తంపై ​ 0.50 శాతంగా ఉంటుంది. దీనికి జీఎస్​టీ చార్జీలు అదనంగా వసూలు చేస్తారు.
  7. ఇండస్​ ఇండ్ బ్యాంక్​.. కనిష్ఠంగా 8.75 శాతం, గరిష్ఠంగా 16 శాతం వడ్డీని బంగారంపై తీసుకున్న అప్పులపై వసూలు చేస్తోంది. ఈ బ్యాంక్​లో ప్రాసెసింగ్​ ఫీజు తీసుకున్న మొత్తంపై 1 శాతం ఉంటుంది.
  8. పంజాబ్​ అండ్ సింధ్​ బ్యాంక్​లో బంగారంపై రుణాలకు వడ్డీరేటు 8.85 శాతం ఉంది. రూ.500 నుంచి పది వేల వరకు ప్రాసెసింగ్​ ఫీజును వసూలు చేస్తారు.
  9. ఫెడరల్ బ్యాంక్​లో బంగారంపై అప్పులకు 8.89 శాతం వడ్డీ రేటు ఉంటుంది. పంజాబ్​ నేషనల్ బ్యాంక్​లో ఈ వడ్డీ రేటు 9 శాతంగా ఉంది. ఈ బ్యాంక్​లో రుణ మొత్తంపై 0.75 శాతం ప్రాసెసింగ్​ ఫీజు ఉంటుంది.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.