ETV Bharat / bharat

పొరపాటున బ్యాంక్​ ఖాతాల్లోకి రూ.2కోట్లు.. విలాసాలకు ఖర్చు చేసిన యువకులు.. ఆఖరికి..

author img

By

Published : Dec 24, 2022, 10:57 PM IST

పొరపాటున తమ అకౌంట్​లో పడిన రూ.2.44 కోట్లను ఖర్చు చేశారు ఇద్దరు యువకులు. ఈ ఘటన కేరళలో జరిగింది. నిందితులిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు.

Etv Bharat
Etv Bharat

బ్యాంక్​ నుంచి పొరపాటున ఇద్దరు యువకుల అకౌంట్లకు రూ.2.44 కోట్లు జమ అయ్యాయి. అయితే, ఈ డబ్బును యువకులు విలాసవంతంగా ఖర్చు చేశారు. ఈ ఘటన కేరళలోని త్రిస్సూర్​లో జరిగింది. ఈ కేసులో అరింబూర్​కు నిధిన్​, మను అనే ఇద్దరు నిందితులను త్రిస్సూర్​ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ఈ డబ్బులతో ఖరీదైన ఫోన్లు, వస్తువులను కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. కొంత డబ్బును లోన్​లు కట్టేందుకు, షేర్​ మార్కెట్లో మదుపు చేసేందుకు ఉపయోగించారని పేర్కొన్నారు. తమ అకౌంట్​లో మిగిలిన మొత్తాన్ని 19 వేర్వేరు బ్యాంకుల్లోని 54 ఖాతాలకు బదిలీ చేసినట్లు పోలీసులు తెలిపారు.

బ్యాంక్ నుంచి డబ్బులు వేరే అకౌంట్​లోకి వెళ్లాయని గుర్తించిన అధికారులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులకు అకౌంట్ ఉన్న బ్యాంక్ మరో బ్యాంక్​లో విలీనం కావడం వల్ల.. సర్వర్​ సమస్య వల్ల డబ్బులు వారి అకౌంట్​లోకి పడినట్లు గుర్తించారు. నిందితులు.. బ్యాంకు సర్వర్‌లను తారుమారు చేసి డబ్బులు స్వాహా చేశారా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.