ETV Bharat / bharat

యూపీలో రూ.3.5వేల కోట్ల అభివృద్ధి పనులకు మోదీ శ్రీకారం

author img

By

Published : Nov 19, 2021, 7:43 PM IST

Updated : Nov 19, 2021, 7:54 PM IST

వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న ఉత్తర్​ప్రదేశ్​లో పర్యటించిన మోదీ(PM Modi in UP).. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అల్ట్రామెగా సోలార్ పవర్ పార్క్, రక్షణ ఉత్పత్తుల ప్లాంట్​లకు శంకుస్థాపన చేశారు. అటల్ ఏక్తా పార్క్​ను (PM Modi news) ఆవిష్కరించారు. అదే సమయంలో ఎన్​సీసీ అలమ్నీ అసోసియేషన్​ను ప్రారంభించి.. తొలి సభ్యుడిగా పేరు నమోదు చేసుకున్నారు.

pm modi news
pm modi news

ఉత్తర్​ప్రదేశ్​ ఝాన్సీలో (PM Modi in UP) రూ.3,425 కోట్లు విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi news) ప్రారంభించారు. 600 మెగావాట్​ల అల్ట్రా మెగా సోలార్ పవర్ పార్క్​ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.3,013 కోట్లతో దీన్ని నిర్మించనున్నారు. తక్కువ ధరకే విద్యుత్ సరఫరా చేయడం సహా, గ్రిడ్ స్థిరత్వం కోసం దీన్ని ఏర్పాటు చేయనున్నారు. 40 వేల చదరపు మీటర్లలో నిర్మించిన అటల్ ఏక్తా పార్క్​ను మోదీ ప్రారంభించారు.

యూపీ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్​లో రూ.400 కోట్ల ప్రాజెక్టుకూ భూమిపూజ చేశారు మోదీ. యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణుల కోసం ప్రొపల్షన్ సిస్టమ్​లను తయారు చేసేందుకు భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఈ ప్రాంతంలో ఓ ప్లాంట్ నిర్మించనుంది. ఈ ప్రాజెక్టుతో భారత రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేసే ప్రధాన కేంద్రంగా బుందేల్​ఖండ్ మారుతుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు.

ఆర్మీకి ఆయుధాలు!

ఈ సందర్భంగా.. 'హెచ్ఏఎల్' తయారు చేసిన తేలికపాటి యుద్ధ హెలికాప్టర్​ను.. భారత వాయుసేనకు అందించారు మోజీ. నావికా దళం కోసం డీఆర్​డీఓ డిజైన్ చేసిన అడ్వాన్స్​డ్ ఎలక్ట్రానిక్స్ వార్​ఫేర్​తో పాటు అంకుర సంస్థలు తయారు చేసిన డ్రోన్లు/యూఏవీలను సైతం ఆర్మీకి అప్పగించారు.

PM-UP-JHANSI
సైనికాధికారుల చేతికి ఆయుధాలు

ఝాన్సీ కోటలో మోదీ..

ఝాన్సీ రాణి లక్ష్మీభాయి జయంతి సందర్భంగా నిర్వహించిన మూడు రోజుల రాష్ట్ర రక్ష సమర్పణ్ పర్వ్​ ముగింపు వేడుకలకు హాజరయ్యారు మోదీ. ఝాన్సీ కోటను సందర్శించిన ఆయన.. రాష్ట్ర రక్ష సమర్పణ్ పర్వ్ దేశ రక్షణలో సరికొత్త అధ్యాయమని పేర్కొన్నారు.

PM-UP-JHANSI
ఝాన్సీ కోటలో మోదీ

ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని మోదీ.. హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్​చంద్​ ఝాన్సీకి చెందినవారని చెప్పారు. భారత క్రీడకు విశ్వవ్యాప్తంగా గుర్తింపు తెచ్చారని కీర్తించారు. ఖేల్​రత్న అవార్డుకు ఆయన పేరునే పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు.

ఎన్​సీసీ అలమ్నీ అసోసియేషన్...

అదే సమయంలో, ఎన్​సీసీ అలమ్నీ అసోసియేషన్​ను ప్రారంభించి.. తొలి సభ్యుడిగా పేరు నమోదు చేసుకున్నారు. ఎన్​సీసీ క్యాడెట్​లకు సిమ్యులేషన్ ట్రైనింగ్ విధానాన్ని సైతం మోదీ ప్రారంభించారు.

PM-UP-JHANSI
మోదీ ఎన్​సీసీ అలుమ్నీ కార్డ్
PM-UP-JHANSI
ఎన్​సీసీ సిమ్యులేషన్ ట్రైనింగ్​ను ప్రారంభిస్తున్న ప్రధాని

మరోవైపు, దిల్లీలోని జాతీయ యుద్ధస్మారకం వద్ద అగ్​మెంటెడ్ రియాలిటీతో కూడిన ఎలక్ట్రానిక్ కయోస్క్​లను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. వీటి ద్వారా సందర్శకులు అమర జవాన్లకు డిజిటల్ రూపంలో పుష్పాంజలి అర్పించే వీలు ఉంటుంది.

ఇదీ చదవండి: 'యూపీ అభివృద్ధి కోసం మాఫియాపై బుల్​డోజర్ ప్రయోగం'

Last Updated :Nov 19, 2021, 7:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.