ETV Bharat / bharat

'పింఛన్​ విధానంలో మార్పులు.. ఇకపై 40 శాతమే'.. కేంద్రం ఆర్థిక శాఖ క్లారిటీ

author img

By

Published : Jun 22, 2023, 9:42 PM IST

Updated : Jun 23, 2023, 6:23 AM IST

New Pension Scheme 2023 : కొత్త పింఛన్​ విధానంలో మార్పులపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. పింఛన్​ విధానంలో మార్పులు తీసుకువస్తున్నట్లు.. మీడియాలో వస్తున్న కథనాల నేపథ్యంలో ఈ వివరణ ఇచ్చింది.

Rumors on the new pension system
పెన్షన్ పథకంలో మార్పులపై కేంద్రం స్పష్టత

New Pension Scheme 2023 : కొత్త పింఛన్​ విధానంలో మార్పులు తీసుకువస్తున్నట్లు మీడియాలో వస్తున్న కథనాలను కేంద్ర ఆర్థిక శాఖ ఖండించింది. అవన్నీ అసత్య ప్రచారాలని వెల్లడించింది. ఆ అంశంపై ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయని తెలిపింది. దానిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఆర్థిక శాఖ పేర్కొంది. కాగా ప్రస్తుతమున్న విధానానికి బదులుగా ఉద్యోగుల చివరి జీతంలో 40-45 శాతాన్ని.. పింఛన్​గా వారికిచ్చేందుకు ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నట్లు గతంలో కొన్ని కథనాలు వెలువడ్డాయి. దీనిపై గురువారం ఆర్థిక శాఖ వివరణ ఇచ్చింది. అవన్నీ అవాస్తవాలని కొట్టిపారేసింది.

"కొత్త ఫించన్​ విధానంలో ప్రభుత్వం మార్పులు తీసుకువస్తున్నట్లు.. పలు వార్తాపత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. అవన్నీ నిజం కావు. గత లోక్​సభ సమావేశాల్లోనే కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి నేతృత్వంలో.. దీనిపై ఓ కమిటీని ఏర్పాటు చేశాం. ఎన్​పీఎస్​ విషయంలో చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. వాటాదారులతో కమిటీ సంప్రదింపులు జరుగుతోంది" అని కేంద్ర ఆర్థిక శాఖ​ ట్వీట్​ చేసింది. భాజపాయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు.. ఇప్పటికే పాత పింఛన్​ విధానాన్నితిరిగి ప్రవేశపెట్టాయి. ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్​తో, ఇతర వర్గాల ఒత్తిడితో ఈ దిశగా ఆ రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయి. పంజాబ్​, రాజస్థాన్​, ఛత్తీస్​గఢ్, హిమాచల్​ ప్రదేశ్​, ఝార్ఖండ్​, వంటి ప్రతిపక్షపాలిత రాష్ట్రాలు పాత పింఛన్​ విధానం వైపే తిరిగి అడుగులేశాయి.

పాత ఫించన్ విధానం ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగులు తాము చివరగా తీసుకున్న జీతంలో.. 50 శాతాన్ని పింఛన్​గా పొందుతారు. కొత్త పింఛన్ విధానంలో తమ జీతంలో కొంత మొత్తాన్ని పెన్షన్​ ఫండ్​లో ఉద్యోగులు జమ చేస్తారు. వారు జమచేసిన సొమ్ము ఆధారంగా పదవి విరమణ సమయంలో.. ఒకే సారి ఆ మొత్తాన్ని పొందుతారు. పాత ఫించన్ విధానాన్ని 2003 డిసెంబర్​లో నిలిపివేసింది అప్పటి ప్రభుత్వం. అనంతరం 2004 ఏప్రిల్​ 1 నుంచి కొత్త పింఛన్​ విధానాన్ని ప్రవేశపెట్టింది. ​

ఓపీఎస్​ పునరుద్ధరించాలంటూ నిరసనలు.. కేంద్రం బెదిరింపులు..
గత కొంత కాలంగా కొత్త పింఛన్​ విధానంపై ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. పాత పెన్షన్​ విధానాన్ని(ఓపీఎస్​) పునరుద్ధరించాలంటూ వారు నిరసనలు కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలోనే నిరసనల్లో పాల్గొనకూడదని ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం సూచించింది. ఈ సూచనను అతిక్రమిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. కొద్ది రోజుల క్రితం దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు చేపట్టాలని జాయింట్​ ఫోరమ్​ ఫర్ రీస్టోరేషన్ ఆఫ్​ ఓల్డ్​ పెన్షన్​ స్కీమ్​ ఆధ్వర్యంలోని నేషనల్​ జాయింట్​ కౌన్సిల్​​ పిలుపునిచ్చింది. ఆ ర్యాలీల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పాల్గొనకూడదని కేంద్రం చెప్పింది. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Last Updated : Jun 23, 2023, 6:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.