ETV Bharat / bharat

'OPS కోసం సమ్మె చేస్తే సీరియస్ యాక్షన్!'.. ఉద్యోగులకు ప్రభుత్వం వార్నింగ్

author img

By

Published : Mar 21, 2023, 5:42 PM IST

పాత పెన్షన్​ విధానాన్ని(ఓపీఎస్​) పునరుద్ధరించాలంటూ జరగుతున్న నిరసనల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించింది కేంద్రం. ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖల కార్యదర్శులకు సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ​(డీఓపీటీ) ఉత్తర్వులు జారీ చేసింది.

ops strike
ops strike

పాత పెన్షన్​ విధానాన్ని(ఓపీఎస్​) పునరుద్ధరించాలంటూ జరగుతున్న నిరసనల్లో పాల్గొనకూడదని ప్రభుత్వ ఉద్యోగులకు సూచించింది కేంద్రం. ఈ సూచనను అతిక్రమిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు చేపట్టాలని జాయింట్​ ఫోరమ్​ ఫర్ రీస్టోరేషన్ ఆఫ్​ ఓల్డ్​ పెన్షన్​ స్కీమ్​ ఆధ్వర్యంలోని నేషనల్​ జాయింట్​ కౌన్సిల్​​ పిలుపునిచ్చింది. ఈ తరుణంలోనే ఆ ర్యాలీల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పాల్గొనకూడదని చెప్పింది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖల కార్యదర్శులకు సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ ​(డీఓపీటీ) ఉత్తర్వులు జారీ చేసింది.

ఉద్యోగులు ర్యాలీల్లో పాల్గొనకుండా నిషేధించాలని.. సాధారణ సెలవులు కూడా మంజూరు చేయవద్దని సంబంధిత అధికారులకు డీఓపీటీ సూచించింది. వీటిని అతిక్రమిస్తే సీసీఎస్​ 1964 నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. నిరసన చేపట్టిన ఉద్యోగులకు వేతనాల కోతతో పాటు క్రమశిక్షల చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నిబంధనలు అతిక్రమించి ఏ ఉద్యోగైనా.. నిరసనలో పాల్గొంటే సాయంత్రంలోగా డీఓపీటీకి తేలియజేయాలని చెప్పింది. దీని కోసం జాయింట్ సెక్రటరీ(పరిపాలన).. భద్రతా సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని సూచించింది.

"సమ్మెకు వెళ్లేందుకు ఉద్యోగులకు అధికారమిచ్చే చట్టబద్ధమైన నిబంధన ఏదీ లేదు. సమ్మెకు దిగడం ప్రవర్తనా నియమాల ప్రకారం తప్పిదమని.. ప్రభుత్వ ఉద్యోగులు చట్టాలకు లోబడే పనిచేయాలని సుప్రీం కోర్టు అనేక తీర్పుల్లో వెల్లడించింది."

--డీఓపీటీ ఉత్తర్వుల ప్రకారం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం జాయింట్ కన్సల్టేటివ్ వ్యవస్థ ఇప్పటికే పనిచేస్తోందని.. దీనిపై అనేక దశల్లో చర్చలు జరుగుతున్నాయని తెలిపింది. ఈ పథకం ప్రభుత్వం, ఉద్యోగి మధ్య సంబంధాలు పెంచి.. ఇద్దరికి ఉమ్మడి బాధ్యతను పెంపొందించే లక్ష్యంగా ప్రవేశపెట్టారని అభిప్రాయపడింది.
మరోవైపు పాత పెన్షన్‌ విధానానికి మారుతున్నట్లు ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, ఝార్ఖండ్‌ వంటి రాష్ట్రాలు ఇప్పటికే ప్రకటించాయి. ఇదే విషయాన్ని కేంద్రానికి సైతం తెలియజేశాయి. మరో రాష్ట్రం పంజాబ్‌ కూడా పాత పెన్షన్‌ విధానానికి వెళుతున్నట్లు చెప్పింది. పాత పింఛను విధానం ప్రకారం.. పదవీ విరమణ నాటికి ఉన్న వేతనంలో 50 శాతం మొత్తాన్ని పెన్షన్‌గా చెల్లిస్తారు.

2003లో నాటి ఎన్డీఏ ప్రభుత్వం పాత పెన్షన్‌ విధానాన్ని రద్దు చేసి కొత్త పింఛను విధానాన్ని ప్రవేశపెట్టింది. కొత్త విధానం ప్రకారం ఉద్యోగి తన మూల వేతనంలో 10 శాతం మొత్తాన్ని పెన్షన్‌ నిధికి జమ చేయాలి. దీనికి అదనంగా ప్రభుత్వం మరో 14 శాతం జమ చేస్తుంది. కాగా 2003 డిసెంబర్‌ 22కు ముందు వెలువడిన ఉద్యోగ నియామక ప్రకటనల ఆధారంగా నియమితులైన ఉద్యోగులకు ఓపీఎస్‌ ఎంచుకునే అవకాశాన్ని ఇటీవల కేంద్రం కల్పించింది.

ఇవీ చదవండి : తల్లిని కాటేసిన పాము.. నోటితో విషం తీసి పునర్జన్మనిచ్చిన కూతురు

10 కేజీల వెండితో అయోధ్య రామ మందిరం ప్రతిమలు.. ఎంత చక్కగా ఉన్నాయో!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.