ETV Bharat / bharat

వరుణుడి బీభత్సానికి ముంబయి గజగజ

author img

By

Published : Jul 5, 2020, 6:34 PM IST

Updated : Jul 5, 2020, 6:44 PM IST

గత మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు ముంబయి మహా నగరంలో జన జీవనం స్తంభించింది. భారీ వర్షాలకు ప్రముఖ 'పోవై' సరస్సు పొంగిపొర్లుతోంది. పలు ప్రాంతాలు నీట మునిగాయి. సోమవారమూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది వాతావరణ శాఖ.

powai-lake-overflow-mumbai
వరుణుడి బీభత్సానికి ముంబయి గజగజ

మహారాష్ట్రను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత మూడు రోజులుగా కురుస్తున్న వానలకు ముంబయి మహానగరం తడిసిముద్దయింది. నగరంలోని ప్రముఖ పర్యటక ప్రాంతం 'పోవై' సరస్సు పొంగి పొర్లుతోంది. ఈ క్రమంలో ఓవైపు లాక్​డౌన్​ ఆంక్షలు, మరోవైపు భారీ వర్షాలను సైతం లెక్కచేయకుండా సరస్సును చూసేందుకు పలువురు తరలివస్తున్నారు.

Powai Lake Overflow Mumbai
ఉప్పొంగిన 'పోవఈ' సరస్సు

రెడ్​ అలర్ట్​ను కొనసాగిస్తున్నారు అధికారులు. ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 200 మిల్లీమీటర్లకుపైగా వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. సోమవారం కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. మహారాష్ట్ర-గోవా తీరంలో ఈదురు గాలుతో కూడిన వాతావరణం ఉంటుందని.. గాలి వేగం గంటకు 50-60 కిలోమీటర్ల మేర ఉండొచ్చని అంచనా వేసింది. సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని సూచించింది.

Powai Lake Overflow Mumbai
రోడ్లన్నీ జలమయం

చెరువులను తలపిస్తున్న ప్రాంతాలు..

నగరంలోని బులభాయ్​ దేశాయ్​ మార్గ్​, బిందు మాధవ్​ జంక్షన్​, వర్లీ నాకా, హిందూమాతా జంక్షన్​, ధోబిఘాట్​, పరేడ్​ చిరాబజార్​, పోలీస్​ కమిషనర్​ కార్యాలయం, సియాన్​ రోడ్​ నం.24, గాంధీ మార్కెట్​, అంధేరి మలాద్​ వంటి ప్రాంతాల్లో వరద నీరు నిలిచి జన జీవనం స్తంభించింది.

Powai Lake Overflow Mumbai
చెరువులను తలపిస్తున్న రహదారులు

కుప్పకూలిన భవనం..

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఠాణె నగరంలోని తెల్లి గల్లీ ప్రాంతంలో ఓ పాత భవనం కుప్పకూలింది. నెల రోజుల క్రితమే భవనాన్ని ఖాళీ చేసిన నేపథ్యంలో ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు వెల్లడించారు. ఠాణేలో అత్యధికంగా 377 మిల్లీమీటర్లు, పాల్ఘడ్​ జిల్లాలో 93.06 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపారు.

రంగంలోకి బలగాలు..

భారీ వర్షాలతో తలెత్తే సమస్యలను ఎదుర్కొనేందుకు అగ్నిమాపక, ఎన్​డీఆర్​ఎఫ్​, నౌకాదళం, తీర రక్షక దళం,​ ఇతర విపత్తు స్పందన దళాలను రంగంలోకి దించింది ముంబయి మహానగర పాలక సంస్థ.

Powai Lake Overflow Mumbai
మహానగరంపై కుండపోత వర్షాలు
Powai Lake Overflow Mumbai
భారీ వర్షాలకు ఇబ్బందుల్లో జనాలు

ఇదీ చూడండి: ముంబయిలో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం

Last Updated :Jul 5, 2020, 6:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.