ETV Bharat / bharat

ముంబయిలో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం

author img

By

Published : Jul 5, 2020, 12:31 PM IST

మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంబయి సహా పలు ప్రధాన నగరాల్లో ఎల్లో, ఆరెంజ్​ అలర్ట్​లు జారీ చేసింది భారత వాతావరణ శాఖ. రానున్న 24 గంటల్లో తీవ్రత మరింత పెరగనున్నట్లు అంచనా వేసింది.

Rains continue to lash Mumbai, Konkan, warning for tomorrow
భారీ వర్షాలకు ముంబయి అతలాకుతలం!

ముంబయి నగరం ఇప్పటికే కరోనా కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతోంది. దానికి తోడు భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రోడ్లన్నీ జలమయమై.. ట్రాఫిక్​ జామ్​ అవుతోంది. చెట్లు, విద్యుత్​ తీగలు తెగిపడుతున్నాయి. ముంబయితో పాటు, రాయ్​గఢ్​, ఠాణె, రత్నగిరి, సింధ్​దుర్గ్​, నాసిక్​ జిల్లాల్లో ఆదివారం ఎల్లో అలర్ట్​ ప్రకటించింది భారత వాతావరణ శాఖ. పాల్​ఘర్​లో ఆరెంజ్ అలర్ట్​ జారీ చేసింది.

Rains continue to lash Mumbai, Konkan, warning for tomorrow
భారీ వర్షాలకు ముంబయి అతలాకుతలం!

ముంబయి, కొంకణ్​, ఠాణెల్లో 3 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. శాంతాక్రూజ్​లో అత్యధికంగా 200.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దక్షిణ ముంబయిలోని కోలాబాలో 129.6 మి.మీ. వర్షం కురిసింది. రానున్న 24 గంటల్లోనూ భారీ వర్షాలు పడే అవకాశముందని స్థానిక వాతావరణ విభాగం హెచ్చరించింది.

కుండపోత వర్షాలకు రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. జనజీవనం స్తంభించింది.

Rains continue to lash Mumbai, Konkan, warning for tomorrow
హింద్​మాతాలో వర్షం బీభత్సం..

"ముంబయి, నవీ ముంబయి, ఠాణే జిల్లాల్లో.. భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఠాణేలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే 200 మి.మీ వర్షపాతం నమోదైంది. రానున్న 24 గంటల్లో ఈ సంఖ్య మరింత పెరగొచ్చు. "

-కే షోసలికర్​, భారత వాతావరణ శాఖ డీజీ

  • ఎల్లో వార్నింగ్​ - ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారం తెలుసుకుంటూ.. జాగ్రత్తగా ఉండాలి.
  • ఆరెంజ్​ అలర్జ్​ - అధికారులు సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలి.
  • రెడ్​ అలర్ట్​ - చర్యలు ప్రారంభించాలి.
    Rains continue to lash Mumbai, Konkan, warning for tomorrow
    హింద్​మాతాలో వర్షం బీభత్సం..
Rains continue to lash Mumbai, Konkan, warning for tomorrow
హింద్​మాతాలో వర్షం బీభత్సం..
Rains continue to lash Mumbai, Konkan, warning for tomorrow
హింద్​మాతాలో వర్షం బీభత్సం..

ఇదీ చదవండి: రాజ్​భవన్​లో కరోనా కలకలం.. కంటైన్మెంట్​ జోన్​గా ప్రకటన!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.