ETV Bharat / bharat

సరిహద్దులో భారీ ఆయుధాల డంప్ స్వాధీనం

author img

By

Published : Jun 16, 2020, 10:48 AM IST

భారత్​-భూటాన్ సరిహద్దు అసోంలోని చిరాంగ్ వద్ద భారీ ఆయుధాల డంప్ స్వాధీనం చేసుకున్నారు రక్షణ సిబ్బంది. బోడోల్యాండ్ టెరిటోరియల్ కౌన్సిల్​కు మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న వేళ ఆయుధాలు బయటపడటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ డంప్​లో 192 గ్రెనేడ్లు, 200 రౌండ్ల ఏకే 47 తుపాకీ తూటాలు సహా భారీ స్థాయిలో ఆయుధ సామగ్రి లభించింది.

guns
భారత్-భూటాన్ సరిహద్దులో భారీ ఆయుధాల డంప్ స్వాధీనం

అసోంలోని బోడోల్యాండ్ టెరిటోరియల్ కౌన్సిల్​కు మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న వేళ.. చిరాంగ్​లో బయటపడిన భారీ ఆయుధాల డంప్ కలకలం రేపింది. అసోం పోలీసులు, భారత సైన్యం జరిపిన ఈ సంయుక్త ఆపరేషన్​లో బయటపడిన ఈ డంప్​లో 7 పిస్టళ్లు, 3 రివాల్వర్లు, 192 గ్రెనేడ్లు, 200 రౌండ్ల ఏకే 47 తుపాకి తూటాలు, 85 ఎస్​ఎల్​ఆర్ మ్యాగజైన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు అసోం ఎస్పీ సుధాకర్ సింగ్ ప్రకటన విడుదల చేశారు. ఆయుధాల డంప్​పై విశ్వసనీయ వర్గాల నుంచి వచ్చిన కచ్చితమైన సమాచారాన్ని అనుసరించే ఈ ఆపరేషన్ చేపట్టినట్లు పేర్కొన్నారు.

ammunition
ఆయుధ సామగ్రి వివరాలు

12 రోజులపాటు..

ఈ డంప్ చేజిక్కించుకునేందుకు 12 రోజుల పాటు తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. చాలా లోతులో పూడ్చిపెట్టిన ఈ ఆయుధాలను మెటల్ డిటెక్టర్ సాయంతో గుర్తించినట్లు తెలుస్తోంది.

grenede
గ్రెనేడ్లు

రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ ప్రకారం ఏర్పాటు చేసిన బోడోల్యాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ 4 జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది. ఏప్రిల్ 4న ఎన్నికలు జరగాల్సి ఉండగా కరోనా విజృంభణ నేపథ్యంలో పోలింగ్ వాయిదా పడింది.

guns, bullets
తుపాకులు, తూటాలు

ఇదీ చూడండి: సంక్షోభంలో దాగిన అవకాశం.. కొవిడ్‌ నేర్పిన పది పాఠాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.